ప్రిక్వార్టర్స్‌లో ముర్రే | Andy Murray fells Juan Martin Del Potro to enter French Open last 16 | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో ముర్రే

Published Sun, Jun 4 2017 1:07 AM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

ప్రిక్వార్టర్స్‌లో ముర్రే

ప్రిక్వార్టర్స్‌లో ముర్రే

పారిస్‌: ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌) ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో ముర్రే 7–6 (10/8), 7–5, 6–0తో యూఎస్‌ ఓపెన్‌ మాజీ చాంపియన్‌ డెల్‌పొట్రో (అర్జెంటీనా)పై గెలిచాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 7–6 (7/2), 6–0, 6–2తో ఫాగ్‌నిని (ఇటలీ)పై, ఏడో సీడ్‌ సిలిచ్‌ (క్రొయేషియా) 6–1, 6–3, 6–3తో లోపెజ్‌ (స్పెయిన్‌)పై, వెర్డాస్కో (స్పెయిన్‌) 6–2, 6–1, 6–3తో 22వ సీడ్‌ క్యువాస్‌ (ఉరుగ్వే)పై నెగ్గారు.

రద్వాన్‌స్కా అవుట్‌...: మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో తొమ్మిదో సీడ్‌ అగ్నెస్కా రద్వాన్‌స్కా 2–6, 1–6తో అలైజ్‌ కార్నెట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో 11వ సీడ్‌ కరోలైన్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌) 6–2, 2–6, 6–3తో బెలిస్‌ (అమెరికా)పై, మూడో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) 6–0, 7–5తో కసత్‌కినా (రష్యా)పై, కరోలినా గార్సియా (ఫ్రాన్స్‌) 6–4, 4–6, 9–7తో సు వీ సెయి (చైనీస్‌ తైపీ)పై గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement