pre-quarter
-
ప్రిక్వార్టర్స్‌లో ముర్రే
పారిస్: ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. శనివారం జరిగిన మూడో రౌండ్లో ముర్రే 7–6 (10/8), 7–5, 6–0తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా)పై గెలిచాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7–6 (7/2), 6–0, 6–2తో ఫాగ్నిని (ఇటలీ)పై, ఏడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6–1, 6–3, 6–3తో లోపెజ్ (స్పెయిన్)పై, వెర్డాస్కో (స్పెయిన్) 6–2, 6–1, 6–3తో 22వ సీడ్ క్యువాస్ (ఉరుగ్వే)పై నెగ్గారు. రద్వాన్‌స్కా అవుట్...: మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో తొమ్మిదో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా 2–6, 1–6తో అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో 11వ సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–2, 2–6, 6–3తో బెలిస్ (అమెరికా)పై, మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 6–0, 7–5తో కసత్కినా (రష్యా)పై, కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–4, 4–6, 9–7తో సు వీ సెయి (చైనీస్ తైపీ)పై గెలిచారు. -
ప్రిక్వార్టర్స్‌లో సుమిత్, వికాస్
అల్మాటీ (కజకిస్థాన్): ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మరో ఇద్దరు భారత బాక్సర్లు ముందంజ వేశారు. ఒలింపియన్ సుమిత్ సంగ్వాన్ (81 కేజీలు), వికాస్ మాలిక్ (60 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. దీంతో ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించిన భారత బాక్సర్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. మన్దీప్ జాంగ్రా (69 కేజీ) పరాజయం చవిచూశాడు. ఆదివారం ఇక్కడ జరిగిన పోటీల్లో సుమిత్ 2-1తో తొమ్మిదో సీడ్ పెట్రూ సియోబను (మాల్దోవా)కు షాకిచ్చాడు. ప్రతి రౌండ్లోనూ చక్కని ఆధిపత్యం కనబరిచిన భారత బాక్సర్ చివరి రౌండ్లో మాత్రం పాయింట్ వెనుకబడ్డాడు. చివరకు 30-27, 30-27, 28-29తో ప్రత్యర్థిపై జయకేతనం ఎగరవేశాడు. మరో పోరులో వికాస్ 2-1తో పొలండ్‌కు చెందిన డేవిడ్ మిచెలస్పై గెలుపొందాడు. ఈ బౌట్లో విజయం కోసం ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. దీంతో రెండు రౌండ్లలో స్కోరు టై అయింది. అయితే ఒక రౌండ్లో భారత బాక్సర్ ఆధిక్యం కనబరచడంతో 2-1తో గెలిచినట్లు జడ్జీలు ప్రకటించారు. వికాస్ 28-28, 29-27, 28-28తో గెలిచాడు. ప్రిక్వార్టర్స్‌లో ఇతను ఐదో సీడ్ మిక్లోస్ వర్గా (హంగేరి)తో, సుమిత్... ఎనిమిదో సీడ్ సియర్హే నొవికవూ (బెలారస్)తో తలపడతారు. మన్దీప్... సెర్దార్ హుదమెర్డియెవ్ (తుర్క్మెనిస్థాన్) చేతిలో కంగుతిన్నాడు. సతీష్ కుమార్ (ప్లస్ 91 కేజీ) 3-0తో మిరోద్జిదిన్ కరిమోవ్ (తజకిస్థాన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. నానో సింగ్, శివతాపా, మన్‌ప్రీత్, మనోజ్ కుమార్ల ప్రిక్వార్టర్స్ బౌట్లు సోమవారం జరగనున్నాయి.