ప‍్రపంచ నెంబర్ వన్‌కు షాక్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్‌లో ప్రపంచ నెంబర్ వన్, బ్రిటన్ గ్రేట్ ఆండీ ముర్రేకు షాక్ తగిలింది. ఈ మెగా టైటిల్‌ను సాధించాలన్న కల మరోసారి కలగానే మిగిలింది.
పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్లో ముర్రే అనామక ఆటగాడి చేతిలో పరాజయం పాలయ్యాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో ప్రపంచ నెంబర్ వన్ ముర్రే 5-7, 7-5, 2-6, 4-6 స్కోరుతో 50వ ర్యాంకర్ మిషా జ్వెరెవ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. మూడున్నర గంటల పాటు జరిగిన మ్యాచ్లో ముర్రే నాలుగు సెట్లలో మ్యాచ్ను కోల్పోయాడు.