ఆండ్రీ ముర్రే 'రికార్డు' షో | Andy Murray Wins Record Fifth Queen's Title, Warms up in Style for Wimbledon | Sakshi
Sakshi News home page

ఆండ్రీ ముర్రే 'రికార్డు' షో

Published Mon, Jun 20 2016 5:42 PM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

ఆండ్రీ ముర్రే  'రికార్డు' షో

ఆండ్రీ ముర్రే 'రికార్డు' షో

లండన్:ప్రపంచ రెండో నంబర్ ఆటగాడు, బ్రిటన్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ  ముర్రే క్వీన్స్ క్లబ్ చాంపియన్ షిప్లో విజేతగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముర్రే 6-7(5/7), 6-4, 6-3 తేడాతో మిలాస్ రాయనిక్(కెనడా)పై గెలిచి ఐదోసారి టైటిల్ను సాధించాడు.  టై బ్రేక్ కు దారి తీసిన తొలి సెట్ ను కోల్పోయిన ముర్రే.. ఆ తరువాత రెండు సెట్లలో విజృంభించాడు. రెండు గంటల 13 నిమిషాల పాటు జరిగిన హోరాహోరీ పోరులో రాయనిక్ను ముర్రే మట్టికరిపించాడు. తద్వారా ఐదోసారి  క్వీన్స్ క్లబ్ టైటిల్ను సాధించిన ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

 

అంతకుముందు ఈ టైటిల్ను జాన్ మెక్ ఎన్రో, బోరిస్ బేకర్, ఆండీ రాడిక్, హెవిట్లను నాలుగు సార్లు మాత్రమే దక్కించుకున్నారు. మరోవైపు దాదాపు 10 సంవత్సరాల తరువాత  డిఫెండింగ్ చాంపియన్ గా టైటిల్ ను సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 2005లో రాడిక్ ఒక్కడే ఆ ఘనతను అందుకున్నాడు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్కు వార్మప్ గా జరిగే ఈ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా ముర్రే 37వ ఏటీపీ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement