మూడో రౌండ్‌లో జొకోవిచ్ | Novak Djokovic survives scare as Stepanek wows Wimbledon | Sakshi
Sakshi News home page

మూడో రౌండ్‌లో జొకోవిచ్

Published Thu, Jun 26 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

మూడో రౌండ్‌లో జొకోవిచ్

మూడో రౌండ్‌లో జొకోవిచ్

ముర్రే, దిమిత్రోవ్ కూడా..
 లండన్: వింబుల్డన్‌లో స్టార్ ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్, డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) అలవోక విజయాలతో మూడోరౌండ్‌లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండోరౌండ్‌లో టాప్‌సీడ్ జొకోవిచ్ 6-4, 6-3, 6-7 (5/7), 7-6 (7/5)తో రాడెక్ స్టెఫానిక్ (చెక్)పై; మూడోసీడ్ ముర్రే 6-1, 6-1, 6-0తో ప్రపంచ 92వ ర్యాంకర్ బ్లాజ్ రోలా (స్లొవేనియా)పై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల్లో 6వ సీడ్ బెర్డిచ్ (చెక్) 4-6, 7-6 (7/5), 7-6, (7/3), 6-1తో బెర్నార్డ్ టోమిక్ (ఆస్ట్రేలియా)పై; దిమిత్రోవ్ (బల్గేరియా) 6-3, 6-2, 6-4తో ల్యూక్ సావిల్లే (ఆస్ట్రేలియా)పై గెలిచి మూడోరౌండ్‌లోకి అడుగుపెట్టారు.
 
 వీనస్, నా లీ, రద్వాన్‌స్కా ముందంజ
  మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో రెండో సీడ్ నా లీ (చైనా) 6-2, 6-2తో మీస్‌బర్జర్ (ఆస్ట్రియా)పై; 4వ సీడ్ రద్వాన్‌స్కా (పోలెండ్) 6-4, 6-0తో డెల్లాక్వా (ఆస్ట్రేలియా)పై; 6వ సీడ్ క్విటోవా (చెక్) 6-2, 6-0తో మోనా బార్తెల్ (జర్మనీ)పై; 30వ సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 7-6 (4), 6-1తో కురుమీ నారా (జపాన్)పై గెలిస్తే... 8వ సీడ్ అజరెంకా (బెలారస్) 3-6, 6-3, 5-7తో జానోస్కి (సెర్బియా) చేతిలో ఓడింది.
 
 పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో దివిజ్ శరణ్ (భారత్)-యెన్ సున్ లు (ైచైనీస్‌తైపీ) 6-2, 6-2, 6-7 (3), 3-6, 2-6తో జెమీ డెల్గాడో (బ్రిటన్)-గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్) చేతిలో; పురవ్ రాజా
 (భారత్)-డిమోలినర్ (బ్రెజిల్) 2-6, 4-6, 4-6తో సెబాస్టియన్ కాబెల్ (కొలంబియా)-మత్‌కోవాస్కి
 (పోలెండ్) చేతిలో ఓటమిపాలయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement