ప్రిక్వార్టర్స్‌లో పేస్-ముర్రే జోడీ | Pace-Murray match in the pre-quarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో పేస్-ముర్రే జోడీ

Published Tue, Aug 11 2015 11:28 PM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

Pace-Murray match in the pre-quarters

మాంట్రియల్ : కెనడా ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో లియాండర్ పేస్ (భారత్) -ఆండీ ముర్రే (బ్రిటన్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో పేస్-ముర్రే ద్వయం 6-3, 6-1తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)-జెరెమి చార్డీ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన పేస్ ద్వయం ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లో నొవాక్ జొకోవిచ్-టిప్సరెవిచ్ (సెర్బియా) జోడీతో ఆడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement