ATP Masters Series tennis tournament
-
Miami Opens 2023: మయామీ ఓపెన్ విజేత మెద్వెదెవ్
మయామీ: రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్ ఈ ఏడాది తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ నాలుగో ఏటీపీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీలో మెద్వెదెవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతను 7–5, 6–3 స్కోరుతో జనిక్ సిన్నర్ (ఇటలీ)ని ఓడించాడు. 1 గంటా 34 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మెద్వెదెవ్ 9 ఏస్‌లు కొట్టగా, సిన్నర్ 6 ఏస్‌లు బాదాడు. రష్యా ఆటగాడు 6 డబుల్ ఫాల్ట్‌లు చేసినా ఆ ప్రభావం ఫలితంపై పడకుండా సత్తా చాటడం విశేషం. 2023లో 24 మ్యాచ్‌లలో గెలిచి ఒకే ఒక మ్యాచ్‌లో ఓడిన మెద్వెదెవ్ ఖాతాలో ఇది నాలుగో టైటిల్ కాగా ఓవరాల్‌గా ఐదో ఏటీపీ మాస్టర్స్ టైటిల్. -
బోపన్న జోడీ ఓటమి
పారిస్: ఏటీపీ మాస్టర్స్ టోర్నీ పారిస్ ఓపెన్ డబుల్స్ విభాగంలో భారత ఆటగాళ్లు రోహన్ బోపన్న, దివిజ్ శరణ్‌లకు నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో రోహన్ బోపన్న–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీ 6–7, 3–6 తో ఒలివర్ (ఆస్ట్రియా)–మాట్ పావిక్ (క్రొయేషియా) జంట చేతి లో ఓడింది. దివిజ్ శరణ్–అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) ద్వయం 4–6, 3–6తో మైక్ బ్రయన్–జాక్ సోక్ (అమెరికా) చేతిలో ఓడింది. సెమీస్‌లో సాకేత్ జోడి... మరోవైపు షెన్జెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ సెమీ ఫైనల్ చేరింది. చైనాలో జరుగుతోన్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ జోడీ 6–4, 6–3తో రిగలె టి–డీ వూ (చైనా) జంటపై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. మరో క్వార్టర్స్‌లో అర్జున్ కడే (భారత్)–సంచయ్ రతివతన (థాయ్‌లాండ్) ద్వయం 6–7, 7–5, 10–2తో యిన్ పెంగ్ (తైవాన్) సోంచట్ రతివతన (థాయ్‌లాండ్) జంటపై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. -
33వ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌కు చేరువలో నాదల్
పురుషుల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ కెరీర్లో 33వ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. కెనడాలోని టొరంటోలో జరుగుతున్న రోజర్స్ కప్ టోర్నీలో ఈ స్పెయిన్ స్టార్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో టాప్ సీడ్ నాదల్ 7–6 (7/3), 6–4తో కరెన్ ఖచనోవ్ (రష్యా)పై గెలుపొందాడు. ఫైనల్లో స్టెఫానో సిట్సిపాస్ (గ్రీస్)తో నాదల్ ఆడతాడు. మరో సెమీఫైనల్లో సిట్సిపాస్ 6–7 (4/7), 6–4, 7–6 (9/7)తో వింబుల్డన్ టోర్నీ రన్నరప్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. -
రెండో రౌండ్లో పేస్ జంట
సిన్సినాటి (అమెరికా) : వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)-స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) జంట రెండో రౌండ్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో పేస్-వావ్రింకా ద్వయం 1-6, 6-1, 10-6తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)-జెరెమి చార్డీ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. వావ్రింకాతో జతకట్టి పేస్ ఆడుతున్న రెండో టోర్నీ ఇది. గతేడాది పారిస్ మాస్టర్స్‌లో ఈ జంట క్వార్టర్స్‌కు చేరింది. -
ప్రిక్వార్టర్స్‌లో పేస్-ముర్రే జోడీ
మాంట్రియల్ : కెనడా ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్) -ఆండీ ముర్రే (బ్రిటన్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో పేస్-ముర్రే ద్వయం 6-3, 6-1తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)-జెరెమి చార్డీ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన పేస్ ద్వయం ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు తొలి రౌండ్లో ‘బై’ పొందిన రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంట ప్రిక్వార్టర్ ఫైనల్లో నొవాక్ జొకోవిచ్-టిప్సరెవిచ్ (సెర్బియా) జోడీతో ఆడుతుంది.