రెండో రౌండ్‌లో పేస్ జంట | In the second round a couple of pace | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో పేస్ జంట

Published Wed, Aug 19 2015 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

In the second round a couple of pace

సిన్సినాటి (అమెరికా) : వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో లియాండర్ పేస్ (భారత్)-స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) జంట రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో పేస్-వావ్రింకా ద్వయం 1-6, 6-1, 10-6తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)-జెరెమి చార్డీ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. వావ్రింకాతో జతకట్టి పేస్ ఆడుతున్న రెండో టోర్నీ ఇది. గతేడాది పారిస్ మాస్టర్స్‌లో ఈ జంట క్వార్టర్స్‌కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement