Stanislas Wawrinka
-
వావ్రింకా ఇంటిముఖం...
తొలి రోజు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఒస్టాపెంకో తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... రెండోరోజు పురుషుల సింగిల్స్‌లో గతేడాది రన్నరప్, 2015 చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా మొదటి రౌండ్లోనే వెనుదిరిగాడు. ప్రపంచ 67వ ర్యాంకర్ గిలెర్మో గార్సియా లోపెజ్ అద్వితీయ ఆటతీరు కనబరిచి ఐదు సెట్ల పోరాటంలో వావ్రింకాను బోల్తా కొట్టించాడు. ఈ ఓటమితో జూన్ రెండో వారంలో విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వావ్రింకా ప్రస్తుత 30వ ర్యాంక్ నుంచి దిగజారి 256వ ర్యాంక్‌కు పడిపోనున్నాడు. మరోవైపు మాజీ చాంపియన్, 20వ సీడ్ నొవాక్ జొకోవిచ్, ఏడో సీడ్ డొమినిక్ థీమ్ అలవోక విజయాలతో రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. పారిస్: కొంతకాలంగా గాయాలతో సతమతమవుతూ ఫామ్ కోల్పోయిన స్విట్జర్లాండ్ అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ స్టానిస్లాస్ వావ్రింకాకు ఫ్రెంచ్ ఓపెన్‌లో చేదు ఫలితం ఎదురైంది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన అతను ఈసారి తొలి రౌండ్లోనే చేతులెత్తేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 67వ ర్యాంకర్ గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెయిన్) 6–2, 3–6, 4–6, 7–6 (7/5), 6–3తో వావ్రింకాను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 3 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వావ్రింకా ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. అయితే ఊహించని రీతిలో ఏకంగా 72 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో ఐదుసార్లు వావ్రింకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన లోపెజ్ 40 అనవసర తప్పిదాలు చేశాడు. ‘ఈ ఓటమితో నా ర్యాంక్ ఘోరంగా పడిపోతుందని తెలుసు. అయితే దీనిపై నాకేమీ ఇబ్బంది లేదు. మళ్లీ ఫామ్‌లోకి రావడానికి కాస్త సమయం ఎక్కువ పడుతుంది’ అని 33 ఏళ్ల వావ్రింకా వ్యాఖ్యానించాడు. ఇతర పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 20వ సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–4తో దుత్రా సిల్వా (బ్రెజిల్)పై, డొమినిక్ థీమ్ 6–2, 6–4, 6–1తో ఇవాష్కా (బెలారస్)పై, 12వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) 6–1, 6–2, 7–6 (8/6)తో టియాఫో (అమెరికా)పై గెలుపొంది రెండో రౌండ్లోకి ప్రవేశించారు. వొజ్నియాకి ముందంజ... మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్), ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోకి చేరగా... 20వ సీడ్ సెవస్తోవా (లాత్వియా) తొలి రౌండ్లో పరాజయం చవి చూసింది. వొజ్నియాకి 7–6 (7/2), 6–1తో కోలిన్స్ (అమెరికా)పై, క్విటోవా 3–6, 6–1, 7–5తో వెరోనికా (పరాగ్వే)పై గెలిచారు. సెవస్తోవా 6–4, 1–6, 3–6తో మరీనో (కొలంబియా) చేతిలో ఓడింది. -
వావ్రింకా.. వావ్!
-
వావ్రింకా.. వావ్!
స్విట్జర్లాండ్ టెన్నిస్ ప్లేయర్ స్టానిస్లాస్ వావ్రింకా తొలిసారి యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుపొందాడు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఫైనల్స్ లో ప్రపంచ నంబర్ వన్ సెర్బియన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ ని వావ్రింకా మట్టికరిపించాడు. హోరా హోరీగా జరిగిన ఫైనల్లో 6-7(1), 6-4, 7-5, 6-3 సెట్లలో జకోవిచ్ ను ఓడించి టైటిల్ ను దక్కించుకున్నాడు. ఇప్పటివరకూ కెరీర్లో మూడు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడిన వావ్రింకా మూడు టైటిల్స్‌ను గెలుపొందాడు. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2015లో ఫ్రెంచ్ ఓపెన్ లలో వావ్రింకా విజేతగా నిలిచాడు. -
జొకోవిచ్‌తో వావ్రింకా ‘సై’
♦ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ♦ టైటిల్‌పై సెర్బియా, స్విస్ స్టార్స్ గురి ♦ సెమీస్‌లో మోన్ఫిల్స్, నిషికొరిలపై విజయం ♦ నేటి అర్ధరాత్రి గం. 1.30 నుంచి టెన్-1లో ప్రత్యక్ష ప్రసారం కెరీర్లో 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో నొవాక్ జొకోవిచ్... మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో స్టానిస్లాస్ వావ్రింకా... యూఎస్ ఓపెన్ అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. జొకోవిచ్ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన మూడో ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. వావ్రింకా నెగ్గితే మ్యాచ్ పారుుంట్ కాచుకొని యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన ఏడో ప్లేయర్‌గా నిలుస్తాడు. న్యూయార్క్: గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో వావ్రింకా (స్విట్జర్లాండ్) చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు లభించింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఈ ఇద్దరూ టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 6-3, 6-2, 3-6, 6-2తో పదో సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స)పై గెలుపొందగా... మూడో సీడ్ వావ్రింకా 4-6, 7-5, 6-4, 6-2తో ఆరో సీడ్ కీ నిషికొరి (జపాన్)ను ఓడించాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 19-4తో వావ్రింకాపై ఆధిక్యంలో ఉన్నాడు. జొకోవిచ్ టైటిల్ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జాబితాలో 13 టైటిల్స్‌తో ఒంటరిగా మూడో స్థానానికి చేరుకుంటాడు. ఫెడరర్ (స్విట్జర్లాండ్-17 టైటిల్స్) అగ్రస్థానంలో ఉండగా... పీట్ సంప్రాస్ (అమెరికా), రాఫెల్ నాదల్ (స్పెరుున్) 14 టైటిల్స్‌తో ఉమ్మడిగా రెండో స్థానంలో, 12 టైటిల్స్‌తో జొకోవిచ్, ఎమర్సన్ (ఆస్ట్రేలియా) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన గేల్ మోన్ఫిల్స్ టాప్ సీడ్ జొకోవిచ్‌ను అంతగా ఇబ్బంది పెట్టలేకపోయాడు. ఈ టోర్నీలో తన ప్రత్యర్థులు మధ్యలో వైదొలగడంతో మూడు పూర్తిస్థారుు మ్యాచ్‌లు ఆడకుండానే సెమీస్‌కు చేరిన జొకోవిచ్ ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కేవలం 15 నిమిషాల్లోనే తొలి సెట్లో 5-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అరుుతే మోన్ఫిల్స్ తేరుకొని మూడు గేమ్‌లు గెలిచినా సెట్‌ను మాత్రం కోల్పోయాడు. రెండో సెట్లోనూ జొకోవిచ్ హవా కొనసాగింది. మోన్ఫిల్స్ ఉద్దేశపూర్వకంగా గట్టిపోటీ ఇవ్వడంలేదని భావించిన ప్రేక్షకులు అతణ్ని ఎగతాళి చేశారు. మూడో సెట్లో మోన్ఫిల్స్ సహజశైలిలో ఆడి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో సెట్‌ను నెగ్గాడు. అరుుతే నాలుగో సెట్లో మళ్లీ జొకోవిచ్ విజృంభించడంతో మోన్ఫిల్స్ చేతులెత్తేశాడు. 2 గంటల 32 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో మోన్ఫిల్స్ 11 ఏస్‌లు సంధించి, 11 డబుల్ ఫాల్ట్‌లు, 52 అనవసర తప్పిదాలు చేశాడు. జొకోవిచ్ ఒకే ఏస్ కొట్టి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 27 అనవసర తప్పిదాలు చేశాడు. మాజీ రన్నరప్ నిషికొరితో జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా తొలి సెట్‌ను కోల్పోరుునా వెంటనే తేరుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. గతంలో రెండుసార్లు సెమీఫైనల్లో ఓడిన వావ్రింకా మూడో ప్రయత్నంలో ఈ అడ్డంకిని అధిగమించి తొలిసారి ఫైనల్‌కు చేరుకున్నాడు. మూడో రౌండ్లో డానియల్ ఇవాన్‌స (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో సెట్లో మ్యాచ్ పారుుంట్ కాపాడుకున్న వావ్రింకా... వరుసగా మూడో మ్యాచ్‌లో నాలుగు సెట్లు ఆడి గెలిచాడు. 3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన సెమీస్‌లో వావ్రింకా పది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. -
గట్టెక్కిన వావ్రింకా
ప్రిక్వార్టర్స్‌లోకి స్విస్ స్టార్ మ్యాచ్ పారుుంట్ కాపాడుకున్న మూడో యూఎస్ ఓపెన్ టోర్నీ న్యూయార్క్: తొలి రెండు రౌండ్లలో అంతగా ప్రతిఘటన ఎదుర్కోని స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా మూడో రౌండ్లో మాత్రం తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సి వచ్చింది. ఒకదశలో ఓటమి అంచుల్లో నిలిచిన ఈ స్విస్ ప్లేయర్ ఆ తర్వాత మ్యాచ్ పారుుంట్‌ను కాపాడుకొని అతికష్టమ్మీద గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నాడు. అన్‌సీడెడ్ డాన్ ఇవాన్‌స (బ్రిటన్)తో ఆదివారం జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో వావ్రింకా 4-6, 6-3, 6-7 (6/8), 7-6 (10/8), 6-2తో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. నాలుగో సెట్ టైబ్రేక్‌లో వావ్రింకా 5-6తో వెనుకబడి పరాజయం అంచుల్లో నిలిచాడు. అరుుతే మ్యాచ్ పారుుంట్‌ను కాపాడుకున్న అతను 10-8తో టైబ్రేక్‌లో సెట్‌ను సాధించి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లో తేరుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. ‘మ్యాచ్ పారుుంట్‌ను కాచుకున్నాక విజయం సాధిస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నెగ్గినందుకు చాలా సంతోషంగా ఉన్నాను’ అని వావ్రింకా అన్నాడు. మాజీ చాంపియన్, రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) కూడా కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. మూడో రౌండ్లో ముర్రే 7-6 (7/4), 5-7, 6-2, 6-3తో పాలో లొరెంజీ (ఇటలీ)ను ఓడించాడు. ఫెరర్‌కు షాక్... మరోవైపు 11వ సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెరుున్) మూడో రౌండ్లో నిష్కమ్రించాడు. మాజీ చాంపియన్ యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 7-6 (7/3), 6-2, 6-3తో ఫెరర్‌ను ఓడించాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్టియ్రా) 1-6, 6-4, 6-4, 7-5తో కరెనో బస్టా (స్పెరుున్)పై, ఆరో సీడ్ నిషికోరి (జపాన్) 4-6, 6-1, 6-2, 6-2తో నికొలస్ మహుట్ (ఫ్రాన్స)పై, 21వ సీడ్ కార్లోవిచ్ (క్రొయేషియా) 6-4, 7-6 (7/3), 6-3తో డొనాల్డ్సన్ (అమెరికా)పై, 22వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6-4, 6-1, 3-6, 6-2తో సుసా (పోర్చుగల్)పై గెలిచారు. మర్చెంకో (ఉక్రెరుున్)తో జరిగిన మ్యాచ్‌లో 14వ సీడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) స్కోరు 6-4, 4-6, 1-6తో ఉన్నదశలో గాయం కారణంగా వైదొలిగాడు. క్వార్టర్స్‌లో విన్సీ, సెవస్తోవా గతేడాది రన్నరప్ రొబెర్టా విన్సీ (ఇటలీ), అన్‌సీడెడ్ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ విన్సీ 7-6 (7/5), 6-2తో సురెంకో (ఉక్రెరుున్)పై గెలుపొందగా... సెవస్తోవా 6-4, 7-5తో 13వ సీడ్ జొహానా కొంటా (బ్రిటన్)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. -
రాయనిక్ సంచలన విజయం
మెల్బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్‌లో మరో సంచలనం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి ప్రపంచ నాల్గో ర్యాంక్ ఆటగాడు, స్విస్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా నిష్క్రమించాడు. ప్రి క్వార్టర్స్ ఫైనల్లో భాగంగా సోమవారం మిలాస్ రాయనిక్(కెనడా)తో జరిగిన పోరులో వావ్రింకా ఓటమి పాలయ్యాడు. రాయనిక్ 6-4, 6-3, 5-7, 7-4, 6,3 తేడాతో వావ్రింకాను మట్టికరిపించి క్వార్టర్స్ కు చేరాడు. గతంలో వీరిద్దరూ ఫ్రెంచ్ ఓపెన్ లో తలపడిన నాలుగుసార్లు వావ్రింకానే విజయం సాధించగా, ఈసారి మాత్రం ఆ అంచనాలను తలకిందులు చేస్తూ రాయనిక్ అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మూడు గంటల 44 నిమిషాల పాటు జరిగిన పోరులో 24 ఏస్ లను సంధించిన రాయనిక్.. వావ్రింకాకు చుక్కలు చూపించాడు. దీంతో 2014 ఫ్రెంచ్ ఓపెన్ నుంచి ఇప్పటివరకూ కనీసం క్వార్టర్స్ ఫైనల్ కు చేరిన వావ్రింకా విజయాలకు బ్రేక్ పడింది. -
నాలుగో టైటిల్‌పై గురి
చెన్నై ఓపెన్ ఫైనల్లో వావ్రింకా చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) చెన్నై ఓపెన్‌లో ‘హ్యాట్రిక్’ నమోదు చేయడానికి మరో విజయం దూరంలో ఉన్నాడు. భారత్‌లో జరిగే ఈ ఏకైక ఏటీపీ టోర్నీలో టాప్ సీడ్ వావ్రింకా ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ వావ్రింకా 6-4, 6-4తో మూడో సీడ్ బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. 2011, 2014, 2015లలో చెన్నై ఓపెన్ టైటిల్‌ను సాధించిన వావ్రింకా... ఆదివారం జరిగే టైటిల్ పోరులో ప్రపంచ 44వ ర్యాంకర్, ఎనిమిదో సీడ్ బోర్నా కోరిచ్ (క్రొయేషియా)తో అమీతుమీ తేల్చుకుంటాడు. సుమారు మూడు గంటలపాటు జరిగిన రెండో సెమీఫైనల్లో కోరిచ్ 7-6 (7/5), 6-7 (5/7), 6-3తో అల్జాజ్ బెడెన్ (బ్రిటన్)పై గెలుపొందాడు. 19 ఏళ్ల కోరిచ్ ఏకంగా 17 ఏస్‌లు సంధించడం విశేషం. వావ్రింకాతో ముఖాముఖి రికార్డులో కోరిచ్ 0-2తో వెనుకబడి ఉన్నాడు. గతేడాది సిన్సినాటి ఓపెన్‌లో, చెన్నై ఓపెన్‌లో వావ్రింకాతో ఆడిన మ్యాచ్‌ల్లో కోరిచ్కు ఓటమి ఎదురైంది. -
రెండో రౌండ్లో పేస్ జంట
సిన్సినాటి (అమెరికా) : వెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)-స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) జంట రెండో రౌండ్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో పేస్-వావ్రింకా ద్వయం 1-6, 6-1, 10-6తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)-జెరెమి చార్డీ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. వావ్రింకాతో జతకట్టి పేస్ ఆడుతున్న రెండో టోర్నీ ఇది. గతేడాది పారిస్ మాస్టర్స్‌లో ఈ జంట క్వార్టర్స్‌కు చేరింది. -
వావ్రింకాదే టైటిల్
రన్నరప్‌గా పేస్ జంట చెన్నై ఓపెన్ చెన్నై: ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా ఆద్యంతం నిలకడగా ఆడిన స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా చెన్నై ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అతను ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 6-3, 6-4తో ‘క్వాలిఫయర్’ అల్జాజ్ బెడెన్ (స్లొవేనియా)పై విజయం సాధించాడు. ఫైనల్ చేరే క్రమంలో ముగ్గురు సీడెడ్ క్రీడాకారులను ఓడించిన బెడెన్ టైటిల్ పోరులో మాత్రం వావ్రింకా ధాటికి నిలువలేకపోయాడు. మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ లియాండర్ పేస్ (భారత్)-రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జంట 3-6, 6-7 (4/7)తో యెన్ సున్ లూ (చైనీస్ తైపీ)-జేమీ ముర్రే (బ్రిటన్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. -
అటు నా లీ... ఇటు వావ్రింకా
తొలి రౌండ్లోనే ఓడిన ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలు మ్లాడెనోవిక్, లోపెజ్ సంచలనం ఫెరర్, ఇవనోవిచ్ ముందంజ ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: తమ అద్వితీయ ప్రదర్శనతో ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టైటిల్స్ నెగ్గిన స్టార్ క్రీడాకారులు నా లీ (చైనా), స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్)లకు ఫ్రెంచ్ ఓపెన్ కలిసిరాలేదు. ఊహించనిరీతిలో ఈ ఇద్దరూ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. ప్రపంచ 103వ ర్యాంకర్ క్రిస్టినా మ్లాడెనోవిక్ (ఫ్రాన్స్), ప్రపంచ 41వ ర్యాంకర్ గిలెర్మో గార్సియో లోపెజ్ (స్పెయిన్) ఈ సంచలనాలకు రూపకర్తలుగా నిలిచారు. క్రిస్టినా మ్లాడెనోవిక్ (ఫ్రాన్స్) 7-5, 3-6, 1-6తో 2011 విజేత, రెండో సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ నా లీని బోల్తా కొట్టించింది. పురుషుల సింగిల్స్‌లో గార్సియో లోపెజ్ 6-4, 5-7, 6-2, 6-0తో మూడో సీడ్, ప్రపంచ 3వ ర్యాంకర్ వావ్రింకాను కంగుతినిపించాడు. మ్లాడెనోవిక్తో 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నా లీ ఏకంగా 37 అనవసర తప్పిదాలు, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. ఎనిమిదోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన నా లీ తొలి రౌండ్లోనే ఓడిపోవడం ఇదే మొదటిసారి. మ్లాడెనోవిక్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసినా నా లీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. మరోవైపు వావ్రింకా నిలకడలేని ఆటతీరుతో తడబడ్డాడు. 2 గంటల 23 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా 62 అనవసర తప్పిదాలు చేశాడు. కెరీర్లో 38 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన లోపెజ్ ఇప్పటివరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే మూడో రౌండ్‌కు చేరాడు. వావ్రింకాతో మ్యాచ్‌లో లోపెజ్ ఎనిమిది బ్రేక్ పాయింట్లు సాధించడం విశేషం. మరో మ్యాచ్‌లో 11వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా)కు కూడా చుక్కెదురైంది. అన్‌సీడెడ్ ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా) 6-4, 7-5, 7-6 (7/4)తో దిమిత్రోవ్‌ను ఓడించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-4, 6-3, 6-1తో సిసిలింగ్ (నెదర్లాండ్స్)పై; ఏడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-1, 6-4, 3-6, 6-3తో గొలుబెవ్ (కజకిస్థాన్)పై; 12వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-2, 6-1, 7-5తో బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా)పై; 19వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 7-5, 6-3, 6-4తో రాబర్ట్ (ఫ్రాన్స్)పై గెలిచారు. వేర్వేరు మ్యాచ్‌ల్లో 21వ సీడ్ నికొలస్ అల్మాగ్రో (స్పెయిన్), 16వ సీడ్ టామీ హాస్ (జర్మనీ) గాయాల కారణంగా మ్యాచ్ మధ్యలోనే వైదొలిగారు. మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్, 11వ సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), ఆరో సీడ్ జంకోవిచ్ (సెర్బియా) శుభారంభం చేశారు. ఇవనోవిచ్ 6-1, 6-3తో గార్సియా (ఫ్రాన్స్)పై, సిమోనా 6-0, 6-2తో అలీసా క్లెబనోవా (రష్యా)పై; జంకోవిచ్ 5-7, 6-1, 6-3తో ఫిచ్మన్ (కెనడా)పై గెలిచారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్, 13వ సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) తొలి రౌండ్లోనే చేతులెత్తేసింది. యానినా విక్‌మాయెర్ (బెల్జియం) 7-6 (7/5), 4-6, 6-2తో వొజ్నియాకిని ఓడించింది. నేటి రెండో రౌండ్ మ్యాచ్‌లు మ. గం. 2.30 నుంచి నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం -
వారె‘వ్వావ్రింకా’...
-
వారె‘వ్వావ్రింకా’...
మెల్బోర్న్: ఈ ఏడాది చెన్నైలో మొదలుపెట్టిన విజయాల పరంపరను మెల్‌బోర్న్‌లోనూ కొనసాగించిన స్విట్జర్లాండ్ ప్లేయర్ స్టానిస్లాస్ వావ్రింకా కెరీర్లోనే చిరస్మరణీయ విజయం నమోదు చేశాడు. ఆద్యంతం నమ్మశక్యంకానిరీతిలో ఆడిన వావ్రింకా ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్‌ను బోల్తా కొట్టించి ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం 2 గంటల 21 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ వావ్రింకా 6-3, 6-2, 3-6, 6-3తో రాఫెల్ నాదల్‌ను చిత్తుగా ఓడించి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. ఈ విజయంతో సోమవారం విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో వావ్రింకా ఎనిమిదో స్థానం నుంచి కెరీర్లో అత్యుత్తమంగా మూడో స్థానానికి ఎగబాకుతాడు. రన్నరప్ సానియా జోడి కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా-హొరియా టెకావ్ (రుమేనియా) జంట రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఫైనల్లో సానియా-టెకావ్ ద్వయం 3-6, 2-6తో క్రిస్టినా మ్లడెనోవిక్ (ఫ్రాన్స్)-డానియల్ నెస్టర్ (కెనడా) జోడి చేతిలో ఓడిపోయింది. రన్నరప్ సానియా జంటకు 67,750 ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 36 లక్షల 99 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఈసారి అద్భుతం ఈ సీజన్లో ఆడిన తొలి టోర్నీ చెన్నై ఓపెన్‌లో విజేతగా నిలిచి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అడుగుపెట్టిన 28 ఏళ్ల వావ్రింకా అదే జోరును కొనసాగించాడు. క్వార్టర్ ఫైనల్లో ‘హ్యాట్రిక్ చాంపియన్’ రెండో సీడ్ జొకోవిచ్‌ను ఐదు సెట్లలో... సెమీఫైనల్లో ఏడో సీడ్ బెర్డిచ్ను ఓడించిన వావ్రింకా ఫైనల్లోనూ హడలెత్తించాడు. నాదల్‌తో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతోపాటు కనీసం ఒక్క సెట్ కూడా నెగ్గని వావ్రింకా గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో మాత్రం అద్భుతమే సృష్టించాడు. ఏస్‌ల జోరు మ్యాచ్‌లో వావ్రింకా 19 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 12 సార్లు వచ్చి 11 సార్లు పాయింట్లు నెగ్గాడు. 15 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఐదిసార్లు సఫలమయ్యాడు. 53 విన్నర్స్ (స్పష్టమైన పాయింట్లు) కొట్టిన వావ్రింకా 49 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు నాదల్ కేవలం ఒక ఏస్ కొట్టాడు. మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 32 అనవసర తప్పిదాలు చేసి కేవలం రెండు బ్రేక్ పాయింట్లు సంపాదించాడు. విశేషాలు విజేతగా నిలిచిన వావ్రింకాకు 26 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 14 కోట్ల 44 లక్షల 41 వేలు); రన్నరప్ నాదల్కు 13 లక్షల 25 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 7 కోట్ల 22 లక్షల 20 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2002లో థామస్ జొహాన్సన్ (స్వీడన్-ప్రపంచ 18వ ర్యాంకర్) తర్వాత టాప్-4లో లేని క్రీడాకారుడు తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గాడు. కెరీర్లో ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోనే టైటిల్ నెగ్గిన 36వ క్రీడాకారుడు వావ్రింకా. 1993 ఫ్రెంచ్ ఓపెన్‌లో సెర్గీ బ్రుగుయెరా (స్పెయిన్) ఘనత తర్వాత... టాప్ సీడ్, రెండో సీడ్ ఆటగాళ్లను ఓడించి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో క్రీడాకారుడిగా వావ్రింకా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా వావ్రింకా తన కెరీర్లో తొలిసారి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో టాప్-10 ర్యాంకింగ్ ఆటగాళ్లను ఓడించాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడాక తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన రెండో ప్లేయర్ వావ్రింకా. అతనికిది 36వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ. ఈ జాబితాలో గొరాన్ ఇవానిసెవిచ్ (48 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు-2001 వింబుల్డన్ చాంపియన్) అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ విజయంతో వావ్రింకా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అధికారికంగా స్విట్జర్లాండ్ నంబర్‌వన్ ప్లేయర్ కానున్నాడు. 2001 నుంచి 13 ఏళ్లపాటు ఫెడరర్ ఈ స్థానంలో ఉన్నాడు. ఓపెన్ శకంలో తొలిసారి టాప్ సీడ్, ఎనిమిదో సీడ్ క్రీడాకారుల మధ్య పురుషుల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ జరిగింది. మూడో సెట్ మినహా పదునైన సర్వీస్‌లు... కళ్లు చెదిరే సింగిల్ హ్యాండెడ్ బ్యాక్‌హ్యాండ్ షాట్లు... సుదీర్ఘ ర్యాలీలను విన్నర్స్‌తో ముగించడం... శక్తివంతమైన గ్రౌండ్ స్ట్రోక్స్... ఇలా ఫైనల్లో వావ్రింకా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. తొలి సెట్లోని నాలుగో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ స్విస్ స్టార్ అదే జోరులో 37 నిమిషాల్లో సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్లోనూ వావ్రింకా జోరు తగ్గలేదు. మరోవైపు తన ప్రత్యర్థి దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలో నాదల్కు అర్థం కాలేదు. వెన్నునొప్పి కూడా రావడంతో కోర్టులోనే చికిత్స చేయించుకున్నాడు. కొన్నిసార్లయితే వావ్రింకా అనవసర తప్పిదాలతోనే నాదల్కు పాయింట్లు వచ్చాయి. నాదల్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన వావ్రింకా 38 నిమిషాల్లో రెండో సెట్‌ను నెగ్గాడు. మూడో సెట్లో నాదల్ తేరుకున్నాడు. వావ్రింకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన అతను 33 నిమిషాల్లో సెట్ నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. అయితే నాలుగో సెట్లో వావ్రింకా మళ్లీ ఏకాగ్రతతో ఆడుతూ నాదల్‌ను కోలుకోనియలేదు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయినా నాదల్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ‘‘అంతా కలలా అనిపిస్తోంది. గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుస్తానని ఏనాడూ ఊహించలేదు. గతేడాది జొకోవిచ్ చేతిలో ఐదు సెట్ల మ్యాచ్‌లో ఓడిపోయాక బాధతో ఏడ్చేశాను. ఏడాది కాలంలో చాలా మార్పు వచ్చింది.’’-వావ్రింకా -
ఆస్ట్రేలియా ఒపెన్ ఫైనల్లో నాదల్ పై వావ్రింకా సంచలన విజయం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ పురుషల సింగిల్స్ విభాగంలో స్టానిస్లాస్ వావ్రింకా సంచలన విజయాన్ని నమోదు చేసి టైటిల్ ను ఎగురవేసుకుపోయాడు. ఫైనల్ మ్యాచ్ లో భాగంగా ఇక్కడ ఆదివారం జరిగిన పోరులో వావ్రింకా 6-3,6-2,3-6,6-3 తేడాతో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ను కంగుతినిపించాడు. దీంతో తొలిసారి గ్రాండ్ స్లామ్ ను సాధించిన ఆటగాడిగా వావ్రింకా రికార్డులోకెక్కాడు. ఆద్యంత ఏకపక్షం సాగిన పోరులో రఫెల్ నాదల్ మాత్రం సరైన పోటీ నివ్వకుండా చేతులెత్తేశాడు. అంతకముందు క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ ను మట్టికరిపించిన వావ్రింకా అదే ఊపును కనబరుస్తూ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో నాదల్ వరుస సెట్లలో చిరకాల ప్రత్యర్థి స్విట్జర్లాండ్ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్ పై గెలిచిన సంగతి తెలిసిందే. ఓపెన్ శకం ఆరంభయిన అనంతరం ఒక్కో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ను రెండేసిసార్లు నెగ్గిన తొలి క్రీడాకారుడిగా... టెన్నిస్ చరిత్రలో మూడో క్రీడాకారుడిగా రికార్డులకెక్కాలని భావించిన నాదల్ కు స్విట్జర్లాండ్ క్రీడాకారుడు వావ్రింకా చేతిలో ఓటమి ఎదురవడం గమనార్హం. -
జొకోవిచ్‌కు ‘చెన్నై’ కింగ్ షాక్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. టైటిల్ ఫేవరెట్స్ ఒక్కొక్కరూ నిష్ర్కమిస్తున్నారు. నిన్నటి వరకు మహిళా విభాగంలో కొనసాగిని సంచనాలు తాజాగా పురుషుల విభాగానికి పాకాయి. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మంగళవారం సంచలనం నమోదయింది. డిపెండింగ్ చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ అనుహ్యంగా ఓటమి పాలయ్యాడు. జొకోవిచ్‌కు స్విట్జర్లాండ్ ప్లేయర్ స్టానిస్లాస్ వావ్రింకా షాక్ ఇచ్చాడు. హోరాహోరీగా జరిగిన పోరులో 6-2, 4-6, 2-6, 6-3, 7-9తో జొకోవిచ్ ఓటమి పాలయ్యాడు. మొదటి, నాలుగు సెట్లు గెల్చుకున్నప్పటికీ నిర్ణయాత్మక చివర సెట్లో చేతులెత్తేయడంతో జొకోవిచ్ పరాజయం ఎదురయింది. ఇటీవల జరిగిన చెన్నై ఓపెన్‌లో స్టానిస్లాస్ వావ్రింకా సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. రెండుసార్లు చెన్నై ఓపెన్ టైటిల్ నెగ్గిన క్రీడాకారుడిగా వావ్రింకా గుర్తింపు పొందాడు. -
చెన్నై ఓపెన్ విజేత స్టానిస్లాస్ వావ్రింకా
చెన్నై: టాప్ సీడ్ స్టానిస్లాస్ వావ్ రింకా చెన్నై ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వావ్ రింకా 7-5, 6-2 తేడాతో రోజర్ వాస్లిన్ పై విజయం సాధించించాడు. ఏకపక్షం జరిగిన పోరులో వావ్ రింకా కేవలం 35 నిమిషాల్లోనే ట్రోఫీని చేజిక్కించుకుని సత్తా చాటాడు. ఎనిమిదో సీడ్ వావ్ రింకా టోర్నీ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. చెన్నై ఓపెన్ లో ఎప్పుడూ ఆకట్టుకుని వావ్ రింకా రెండో సారి ట్రోఫిని సాధించాడు. కాగా, రోజర్ వాస్లిన్ చేతి వరకు వచ్చిన అవకాశం చేజారింది. తొలిసారి ఏటీపీ ట్రోఫీని కైవసం చేసుకుందామని భావించిన వాస్లిన్ నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు.