స్టానిస్లాస్ వావ్రింకా
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్లో సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. టైటిల్ ఫేవరెట్స్ ఒక్కొక్కరూ నిష్ర్కమిస్తున్నారు. నిన్నటి వరకు మహిళా విభాగంలో కొనసాగిని సంచనాలు తాజాగా పురుషుల విభాగానికి పాకాయి. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మంగళవారం సంచలనం నమోదయింది. డిపెండింగ్ చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ అనుహ్యంగా ఓటమి పాలయ్యాడు.
జొకోవిచ్కు స్విట్జర్లాండ్ ప్లేయర్ స్టానిస్లాస్ వావ్రింకా షాక్ ఇచ్చాడు. హోరాహోరీగా జరిగిన పోరులో 6-2, 4-6, 2-6, 6-3, 7-9తో జొకోవిచ్ ఓటమి పాలయ్యాడు. మొదటి, నాలుగు సెట్లు గెల్చుకున్నప్పటికీ నిర్ణయాత్మక చివర సెట్లో చేతులెత్తేయడంతో జొకోవిచ్ పరాజయం ఎదురయింది. ఇటీవల జరిగిన చెన్నై ఓపెన్‌లో స్టానిస్లాస్ వావ్రింకా సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. రెండుసార్లు చెన్నై ఓపెన్ టైటిల్ నెగ్గిన క్రీడాకారుడిగా వావ్రింకా గుర్తింపు పొందాడు.