వావ్రింకా.. వావ్!
స్విట్జర్లాండ్ టెన్నిస్ ప్లేయర్ స్టానిస్లాస్ వావ్రింకా తొలిసారి యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుపొందాడు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఫైనల్స్ లో ప్రపంచ నంబర్ వన్ సెర్బియన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ ని వావ్రింకా మట్టికరిపించాడు.
హోరా హోరీగా జరిగిన ఫైనల్లో 6-7(1), 6-4, 7-5, 6-3 సెట్లలో జకోవిచ్ ను ఓడించి టైటిల్ ను దక్కించుకున్నాడు. ఇప్పటివరకూ కెరీర్లో మూడు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడిన వావ్రింకా మూడు టైటిల్స్‌ను గెలుపొందాడు. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2015లో ఫ్రెంచ్ ఓపెన్ లలో వావ్రింకా విజేతగా నిలిచాడు.