గట్టెక్కిన వావ్రింకా
ప్రిక్వార్టర్స్‌లోకి స్విస్ స్టార్
మ్యాచ్ పారుుంట్ కాపాడుకున్న మూడో
యూఎస్ ఓపెన్ టోర్నీ
న్యూయార్క్: తొలి రెండు రౌండ్లలో అంతగా ప్రతిఘటన ఎదుర్కోని స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా మూడో రౌండ్‌లో మాత్రం తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సి వచ్చింది. ఒకదశలో ఓటమి అంచుల్లో నిలిచిన ఈ స్విస్ ప్లేయర్ ఆ తర్వాత మ్యాచ్ పారుుంట్‌ను కాపాడుకొని అతికష్టమ్మీద గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నాడు. అన్‌సీడెడ్ డాన్ ఇవాన్‌స (బ్రిటన్)తో ఆదివారం జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో వావ్రింకా 4-6, 6-3, 6-7 (6/8), 7-6 (10/8), 6-2తో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. నాలుగో సెట్ టైబ్రేక్‌లో వావ్రింకా 5-6తో వెనుకబడి పరాజయం అంచుల్లో నిలిచాడు. అరుుతే మ్యాచ్ పారుుంట్‌ను కాపాడుకున్న అతను 10-8తో టైబ్రేక్‌లో సెట్‌ను సాధించి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్‌లో తేరుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. ‘మ్యాచ్ పారుుంట్‌ను కాచుకున్నాక విజయం సాధిస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నెగ్గినందుకు చాలా సంతోషంగా ఉన్నాను’ అని వావ్రింకా అన్నాడు. మాజీ చాంపియన్, రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) కూడా కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. మూడో రౌండ్‌లో ముర్రే 7-6 (7/4), 5-7, 6-2, 6-3తో పాలో లొరెంజీ (ఇటలీ)ను ఓడించాడు.
ఫెరర్‌కు షాక్...
మరోవైపు 11వ సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెరుున్) మూడో రౌండ్‌లో నిష్కమ్రించాడు. మాజీ చాంపియన్ యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 7-6 (7/3), 6-2, 6-3తో ఫెరర్‌ను ఓడించాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్టియ్రా) 1-6, 6-4, 6-4, 7-5తో కరెనో బస్టా (స్పెరుున్)పై, ఆరో సీడ్ నిషికోరి (జపాన్) 4-6, 6-1, 6-2, 6-2తో నికొలస్ మహుట్ (ఫ్రాన్‌స)పై, 21వ సీడ్ కార్లోవిచ్ (క్రొయేషియా) 6-4, 7-6 (7/3), 6-3తో డొనాల్డ్‌సన్ (అమెరికా)పై, 22వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6-4, 6-1, 3-6, 6-2తో సుసా (పోర్చుగల్)పై గెలిచారు. మర్చెంకో (ఉక్రెరుున్)తో జరిగిన మ్యాచ్‌లో 14వ సీడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) స్కోరు 6-4, 4-6, 1-6తో ఉన్నదశలో గాయం కారణంగా వైదొలిగాడు.
క్వార్టర్స్‌లో విన్సీ, సెవస్తోవా
గతేడాది రన్నరప్ రొబెర్టా విన్సీ (ఇటలీ), అన్‌సీడెడ్ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ విన్సీ 7-6 (7/5), 6-2తో సురెంకో (ఉక్రెరుున్)పై గెలుపొందగా... సెవస్తోవా 6-4, 7-5తో 13వ సీడ్ జొహానా కొంటా (బ్రిటన్)ను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.