జొకోవిచ్తో వావ్రింకా ‘సై’
♦ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్
♦ టైటిల్‌పై సెర్బియా, స్విస్ స్టార్స్ గురి
♦ సెమీస్‌లో మోన్‌ఫిల్స్, నిషికొరిలపై విజయం
♦ నేటి అర్ధరాత్రి గం. 1.30 నుంచి టెన్-1లో ప్రత్యక్ష ప్రసారం
కెరీర్‌లో 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో నొవాక్ జొకోవిచ్... మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో స్టానిస్లాస్ వావ్రింకా... యూఎస్ ఓపెన్ అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. జొకోవిచ్ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన మూడో ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. వావ్రింకా నెగ్గితే మ్యాచ్ పారుుంట్ కాచుకొని యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన ఏడో ప్లేయర్‌గా నిలుస్తాడు.
న్యూయార్క్: గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో వావ్రింకా (స్విట్జర్లాండ్) చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు లభించింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఈ ఇద్దరూ టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 6-3, 6-2, 3-6, 6-2తో పదో సీడ్ గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్‌స)పై గెలుపొందగా... మూడో సీడ్ వావ్రింకా 4-6, 7-5, 6-4, 6-2తో ఆరో సీడ్ కీ నిషికొరి (జపాన్)ను ఓడించాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 19-4తో వావ్రింకాపై ఆధిక్యంలో ఉన్నాడు.
జొకోవిచ్ టైటిల్ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జాబితాలో 13 టైటిల్స్‌తో ఒంటరిగా మూడో స్థానానికి చేరుకుంటాడు. ఫెడరర్ (స్విట్జర్లాండ్-17 టైటిల్స్) అగ్రస్థానంలో ఉండగా... పీట్ సంప్రాస్ (అమెరికా), రాఫెల్ నాదల్ (స్పెరుున్) 14 టైటిల్స్‌తో ఉమ్మడిగా రెండో స్థానంలో, 12 టైటిల్స్‌తో జొకోవిచ్, ఎమర్సన్ (ఆస్ట్రేలియా) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.
ఎనిమిదేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన గేల్ మోన్‌ఫిల్స్ టాప్ సీడ్ జొకోవిచ్‌ను అంతగా ఇబ్బంది పెట్టలేకపోయాడు. ఈ టోర్నీలో తన ప్రత్యర్థులు మధ్యలో వైదొలగడంతో మూడు పూర్తిస్థారుు మ్యాచ్‌లు ఆడకుండానే సెమీస్‌కు చేరిన జొకోవిచ్ ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కేవలం 15 నిమిషాల్లోనే తొలి సెట్‌లో 5-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అరుుతే మోన్‌ఫిల్స్ తేరుకొని మూడు గేమ్‌లు గెలిచినా సెట్‌ను మాత్రం కోల్పోయాడు.
రెండో సెట్‌లోనూ జొకోవిచ్ హవా కొనసాగింది. మోన్‌ఫిల్స్ ఉద్దేశపూర్వకంగా గట్టిపోటీ ఇవ్వడంలేదని భావించిన ప్రేక్షకులు అతణ్ని ఎగతాళి చేశారు. మూడో సెట్‌లో మోన్‌ఫిల్స్ సహజశైలిలో ఆడి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో సెట్‌ను నెగ్గాడు. అరుుతే నాలుగో సెట్‌లో మళ్లీ జొకోవిచ్ విజృంభించడంతో మోన్‌ఫిల్స్ చేతులెత్తేశాడు. 2 గంటల 32 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో మోన్‌ఫిల్స్ 11 ఏస్‌లు సంధించి, 11 డబుల్ ఫాల్ట్‌లు, 52 అనవసర తప్పిదాలు చేశాడు. జొకోవిచ్ ఒకే ఏస్ కొట్టి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 27 అనవసర తప్పిదాలు చేశాడు.
మాజీ రన్నరప్ నిషికొరితో జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా తొలి సెట్‌ను కోల్పోరుునా వెంటనే తేరుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. గతంలో రెండుసార్లు సెమీఫైనల్లో ఓడిన వావ్రింకా మూడో ప్రయత్నంలో ఈ అడ్డంకిని అధిగమించి తొలిసారి ఫైనల్‌కు చేరుకున్నాడు. మూడో రౌండ్‌లో డానియల్ ఇవాన్‌స (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో సెట్‌లో మ్యాచ్ పారుుంట్ కాపాడుకున్న వావ్రింకా... వరుసగా మూడో మ్యాచ్‌లో నాలుగు సెట్‌లు ఆడి గెలిచాడు. 3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన సెమీస్‌లో వావ్రింకా పది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు.