US Open mens singles
-
US Open 2024: సూపర్ సినెర్
ఈ ఏడాది తన అది్వతీయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ మరో గొప్ప విజయం సాధించాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో సినెర్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించాడు. ఆద్యంతం తన ఆధిపత్యం చలాయిస్తూ వరుస సెట్లలో అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌పై గెలిచాడు. తన కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టోర్నీ ప్రారంభానికి ముందు తెరపైకొచి్చన డోపింగ్ వివాదం తన ఆటతీరుపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఇటలీ స్టార్ యానిక్ సినెర్ నిరూపించాడు. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌కు, టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో సినెర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 23 ఏళ్ల సినెర్ 6–3, 6–4, 7–5తో ప్రపంచ 12వ ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సినెర్‌కు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురుకాలేదు. విజేతగా నిలిచిన సినెర్‌కు 36 లక్షల డాలర్లు (రూ. 30 కోట్ల 23 లక్షలు), రన్నరప్ ఫ్రిట్జ్కు 18 లక్షల డాలర్లు (రూ. 15 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. బ్రేక్ పాయింట్‌తో మొదలు... 2003లో ఆండీ రాడిక్ యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచాక మరో అమెరికన్ క్రీడాకారుడు గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించలేకపోయాడు. 2009లో ఆండీ రాడిక్ వింబుల్డన్ ఫైనల్లో ఫెడరర్ చేతిలో ఓడిపోయాక మరో అమెరికా ప్లేయర్ మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ ఫైనల్ చేరలేకపోయాడు. 15 ఏళ్ల తర్వాత టేలర్ ఫ్రిట్జ్ రూపంలో అమెరికా ప్లేయర్ ఒకరు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ ఆడుతుండటంతో అందరి కళ్లు ఫ్రిట్జ్పైనే కేంద్రీకృతమయ్యాయి. అయితే సినెర్ మాత్రం అమెరికా అభిమానుల ఆశలను వమ్ము చేశాడు.తొలి సెట్లోని తొలి గేమ్‌లోనే ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 2–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే మూడో గేమ్‌లో సరీ్వస్ కాపాడుకొని, నాలుగో గేమ్‌లో సినెర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫ్రిట్జ్ స్కోరును 2–2తో సమం చేశాడు. కానీ సినెర్ వెంటనే విజృంభించి మరో రెండుసార్లు ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను గెల్చుకున్నాడు. రెండో సెట్లోనూ సినెర్ దూకుడుకు ఫ్రిట్జ్ జవాబు ఇవ్వలేకపోయాడు. మూడో సెట్లో కాస్త పోటీ ఎదురైనా 12వ గేమ్‌లో ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ విజయాన్ని అందుకున్నాడు.6: ఈ ఏడాది సినెర్ గెలిచిన టైటిల్స్. ఆ్రస్టేలియన్ ఓపెన్, రోటర్‌డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో సినెర్ విజేతగా నిలిచాడు. 55: ఈ సంవత్సరం సినెర్ మొత్తం 60 మ్యాచ్‌లు ఆడాడు. 55 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. ఐదింటిలో ఓడిపోయాడు. 3: తన కెరీర్లో ఒకే ఏడాది ఫైనల్ చేరుకున్న తొలి రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ విజేతగా నిలిచిన మూడో ప్లేయర్ సినెర్. గతంలో గిలెర్మో విలాస్ (అర్జెంటీనా; 1977లో ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్), జిమ్మీ కానర్స్ (అమెరికా; 1974లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) మాత్రమే ఈ ఘనత సాధించారు. 4: ఒకే ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన నాలుగో ప్లేయర్ సినెర్. ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా) మూడుసార్లు చొప్పున... 1988లో మాట్స్ విలాండర్ (స్వీడన్) ఒకసారి ఈ ఘనత సాధించారు. -
Jannik Sinner: యూఎస్ ఓపెన్ సింగిల్స్ విజేతగా సిన్నర్ (ఫోటోలు)
-
రూడ్‌కు చుక్కెదురు
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో గురువారం సంచలన ఫలితాలు నమోదయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో గత ఏడాది రన్నరప్, ఐదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఏడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 67వ ర్యాంకర్ జీజెన్ జాంగ్ (చైనా) 3 గంటల 19 నిమిషాల్లో 6–4, 5–7, 6–2, 0–6, 6–2తో రూడ్‌ను ఓడించగా... ప్రపంచ 128వ ర్యాంకర్ డొమినిక్ స్ట్రికర్ (స్విట్జర్లాండ్) 4 గంటల 4 నిమిషాల్లో 7–5, 6–7 (2/7), 6–7 (5/7), 7–6 (8/6), 6–3తో సిట్సిపాస్‌పై సంచలన విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–4, 6–1, 6–1తో మిరాలెస్ (స్పెయిన్)పై నెగ్గి మూడో రౌండ్‌కు చేరాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ వొజ్నియాకి (డెన్మార్క్) 7–5, 7–6 (7/5)తో 11వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై, టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 6–3, 6–4తో దరియా సావిల్లె (ఆ్రస్టేలియా)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ 6–4, 6–2తో క్రిస్టోఫర్ ఒకానెల్–వుకిచ్ (ఆ్రస్టేలియా) జంటను ఓడించగా... సాకేత్ మైనేని (భారత్)–కరత్సెవ్ (రష్యా) ద్వయం 7–6 (7/4), 3–6, 2–6తో హుస్లెర్ (స్విట్జర్లాండ్)–లాస్లో జెరె (సెర్బియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
అల్కరాజ్ అదరహో
న్యూయార్క్: పురుషుల టెన్నిస్‌లో కార్లోస్ అల్కరాజ్ రూపంలో కొత్త కెరటం వచ్చింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో 19 ఏళ్ల ఈ స్పెయిన్ టీనేజర్ అద్భుతం చేశాడు. ఈ సీజన్లో తాను సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ అల్కరాజ్ ఏకంగా గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అల్కరాజ్ 6–4, 2–6, 7–6 (7/1), 6–3తో ప్రపంచ ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే)పై విజయం సాధించాడు. ఈ గెలుపుతో అల్కరాజ్ కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడంతోపాటు సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. రన్నరప్ కాస్పర్ రూడ్ ఐదు స్థానాలు పురోగతి సాధించి కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. విజేతగా నిలిచిన అల్కరాజ్కు 26 లక్షల డాలర్లు (రూ. 20 కోట్ల 71 లక్షలు)... రన్నరప్ కాస్పర్ రూడ్‌కు 13 లక్షల డాలర్లు (రూ. 10 కోట్ల 35 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. అల్కరాజ్ కెరీర్లో ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో టైటిల్ నెగ్గగా... కాస్పర్ రూడ్‌కు రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోనూ ఓటమి ఎదురైంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో రాఫెల్ నాదల్ చేతిలో కాస్పర్ రూడ్ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. నాదల్ (19 ఏళ్లు; 2005లో ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన పిన్న వయస్కుడిగా... సంప్రాస్ (19 ఏళ్లు; 1990లో యూఎస్ ఓపెన్) తర్వాత యూఎస్ ఓపెన్ గెలిచిన పిన్న వయస్కుడిగా అల్కరాజ్ గుర్తింపు పొందాడు. అదే జోరు ఫైనల్ చేరే క్రమంలో ప్రిక్వార్టర్ ఫైనల్లో, క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో ఐదు సెట్లపాటు పోరాడిన గెలిచిన అల్కరాజ్ తుది సమరంలోనూ పట్టుదలతో ఆడాడు. పదునైన రిటర్న్‌లు, శక్తివంతమైన గ్రౌండ్ స్ట్రోక్‌లు, డ్రాప్ షాట్లు, బేస్‌లైన్ ఆటతో అలరించిన అల్కరాజ్ 3 గంటల 20 నిమిషాల్లో కాస్పర్ రూడ్ ఆట కట్టించాడు. తొలి సెట్లోని మూడో గేమ్‌లో రూడ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్కరాజ్ ఆ తర్వాత తన సర్వీస్‌లు నిలబెట్టుకొని సెట్ దక్కించుకున్నాడు. అయితే రెండో సెట్లో రూడ్ తేరుకొని నాలుగో గేమ్‌లో, ఆరో గేమ్‌లో అల్కరాజ్ సర్వీస్‌లను బ్రేక్ చేసి సెట్‌ను గెల్చుకున్నాడు. మూడో సెట్ హోరాహోరీగా సాగింది. రూడ్ 6–5తో ఆధిక్యంలో నిలిచి అల్కరాజ్ సర్వ్ చేసిన 12వ గేమ్‌లో రెండుసార్లు సెట్ పాయింట్లు సంపాదించాడు. అయితే అల్కరాజ్ పట్టుదలతో ఆడి ఐదుసార్లు డ్యూస్‌ల తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 6–6తో సమం చేశాడు. అనంతరం టైబ్రేక్‌లో ఈ స్పెయిన్ యువతార పైచేయి సాధించి మూడో సెట్‌ను సాధించాడు. నాలుగో సెట్లోనూ అల్కరాజ్ జోరు కొనసాగించి ఆరో గేమ్‌లో రూడ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 4–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అల్కరాజ్ తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను గెల్చుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన కార్లోస్ అల్కరాజ్.. యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసం
యూఎస్ ఓపెన్‌లో స్పానిష్ యువ సంచలనం 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. న్యూయార్క్ వేదికగా ఆదివారం ఆర్ధ రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నార్వేజియన్ కాస్పర్ రూడ్‌ను ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను అల్కరాజ్ కైవసం చేసుకున్నాడు. 2 గంటల 20 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 6-4, 2-6, 7-6(7-1), 6-3 తేడాతో అల్కరాజ్ విజయం సాధించాడు. దీంతో వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా రఫెల్ నాదల్ తర్వాత 19 ఏళ్లకే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా అల్కరాజ్ నిలిచాడు. 2005లో రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుని ఈ ఘనత సాధించాడు. అదే విధంగా అతి తక్కువ వయస్సులోనే వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి ఆటగాడిగా కూడా అల్కరాజ్ నిలిచాడు. చదవండి: US Open 2022: మహిళల సింగిల్స్ విజేతగా ఇగా స్వియాటెక్ -
వివాదం లేకుంటే మనసుకు పట్టదనుకుంటా.. నువ్వు మారవు!
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ సహనం కోల్పోయాడు. ఓడిపోయాననే బాధలో టెన్నిస్ రాకెట్‌ను నేలకేసి కొట్టడం వైరల్‌గా మారింది. ఆట కంటే వివాదాలతోనే ఎక్కువ పేరు సంపాదించిన కిర్గియోస్ ఆన్‌ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్‌లో చాలాసార్లు తన కోపాన్ని ప్రదర్శించాడు. తాజాగా యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లోనే వెనుదిరగడంతో కిర్గియోస్లో కోపం కట్టలు తెంచుకుంది. విషయంలోకి వెళితే.. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్థరాత్రి జరిగిన క్వార్టర్స్‌లో రష్యన్ టెన్నిస్ ప్లేయర్ కచనోవ్ చేతిలో 7-5, 4-6,7-5, 6-7(3-7)తో కిర్గియోస్ ఓటమి పాలయ్యాడు. దీంతో గ్రాండ్‌స్లామ్ కొట్టాలన్న అతని కల క్వార్టర్స్‌కే పరిమితం కావడంతో కోపం నషాళానికి అంటింది. ప్లేయర్‌కు, అంపైర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చిన అనంతరం తన బ్యాగు వద్దకు వెళ్లిన కిర్గియోస్.. చేతిలోని రాకెట్‌ను కోపంతో నేలకేసి బాదాడు. అయినా కోపం తగ్గలేదనుకుంటా.. మరో టెన్నిస్ రాకెట్‌ను నేలకేసి కొట్టాడు. అనంతరం బ్యాగు వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ప్రాప్ స్వాప్ అనే సంస్థ తన ట్విటర్లో షేర్ చేసింది. ''కోపం నషాళానికి అంటింది.. కిర్గియోస్ తన రెండు రాకెట్లను ముక్కలు చేశాడు.'' అంటూ క్యాప్షన్ జత చేసింది. అయితే కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన నిక్ కిర్గియోస్ ఓటమిపై స్పందించాడు. ''నేను ఓడిపోవడం బాధ కలిగించింది. నేను గెలవాలని చాలా మంది మద్దతు ఇచ్చారు. కానీ వారి ఆశలను వమ్ము చేశాను. అందుకే కోపంతో టెన్నిస్ రాకెట్‌ను విరగొట్టాల్సి వచ్చింది. అయితే కచనోవ్ పోరాటం మెచ్చుకోదగినది. ఈరోజు అతనిలో ఒక ఫైటర్, వారియర్ కనిపించాడు. ఇక ముందు కూడా ఇదే పోరాట పటిమను కనబరిచి గ్రాండ్‌స్లామ్ నెగ్గాలని ఆశిస్తున్నా'' అంటూ పేర్కొన్నాడు. ఇక సెమీస్‌కు చేరుకున్న కచనోవ్ నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌తో తలపడనున్నాడు. ఇప్పటికే నాదల్, మెద్వదేవ్‌లు వెనుదిరగ్గా.. తాజాగా కిర్గియోస్ కూడా క్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టడంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. Nick Kyrgios restringing his racket after the match pic.twitter.com/Q2TDri1mxa — PropSwap (@PropSwap) September 7, 2022 చదవండి: FIH Awards: ‘ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో హర్మన్‌ప్రీత్ సింగ్ -
తెరపై కనిపించిన ఆనందంలో ఆ అమ్మడు ఏం చేసిందో చూడండి..
న్యూయార్క్: ఏవైనా పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు బాగా సీరియస్‌గా ఉన్న స్టేడియాన్ని ఉర్రూతలూగించేందుకు కెమెరామెన్లు ఎవరో ఒకరు చేసే సిల్లీ పనులను బిగ్ స్క్రీన్‌పై చూపిస్తుంటారు. సరిగ్గా యూఎస్ ఓపెన్-2021లోనూ ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుంది. ఫెలిక్స్ అగర్ అలియాస్సిమ్, రాబర్టో బటిస్టా అగుట్ మధ్య జరిగిన మూడో రౌండ్ మ్యాచ్ మధ్యలో కెమెరామెన్ ఓ మహిళను బిగ్ స్క్రీన్‌పై చూపించాడు. She’s a champ. #USOpen pic.twitter.com/nA4ccZ2W3g — Dynamics • £ (@theDYNAMICS) September 4, 2021 దీంతో ఆమె ఆనందాన్ని ఆపుకోలేక, తన చేతిలోని బీరు మొత్తాన్ని గుటుక్కున మింగేసి సంబరాలు చేసుకుంది. ఇది చూసిన మిగతా ప్రేక్షకులు మ్యాచ్‌ను చూడటం మానేసి ఆ అమ్మాయిని ప్రోత్సహిస్తూ.. 'షి ఈజ్ ఏ ఛాంప్' అంటూ కేకలు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: ఆ సిరీస్‌లో రివ్యూ కోరే అవకాశం లేదు.. -
నాదల్ విజయనాదం
అద్భుతం ఆ పోరు... అనూహ్యం ఆ పోరాటం... దాదాపు ఐదు గంటల సమరంలో అంతిమ విజేతగా నిలిచేందుకు సాగించిన అసమాన, అసాధారణ ఆట... అపార అనుభవం ఒకరిదైతే, అంతులేని ఆత్మవిశ్వాసం మరొకరిది... ‘బిగ్ 3’లలో ఏ ఇద్దరైనా పోటీ పడినప్పుడు మాత్రమే గ్రాండ్‌స్లామ్ ఫైనల్ రసవత్తరం, మిగతా మ్యాచ్‌లన్నీ ఏకపక్షం అంటూ తీర్మానించుకున్న అభిమానులు అయ్యో చూడలేకపోయామే అని ఆ తర్వాత వగచిన క్షణం ఇది! ఇలాంటి ఘనాఘన హోరాహోరీ సమరంలో చివరకు స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్‌దే పైచేయి అయింది. యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నాలుగోసారి గెలుచుకొని నాదల్ తన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్యను 19కి పెంచుకోగా... చివరి వరకు తలవంచని రష్యా కుర్రాడు మెద్వెదేవ్ రన్నరప్‌గానే ముగించాడు. తొలి రెండు సెట్లను స్పెయిన్ బుల్ సొంతం చేసుకున్న తర్వాత ఇక లాంఛనమే అనిపించిన మ్యాచ్‌లో తర్వాతి రెండు సెట్లు సాధించి మెద్వెదేవ్ ఒక్కసారిగా అలజడి రేపాడు. కానీ తనదైన పదునైన ఆటతో నాదల్ మళ్లీ లయ అందుకొని విజేతగా మారాడు. ఫెడరర్ ఆల్‌టైమ్ గ్రేట్ 20 గ్రాండ్‌స్లామ్‌ల రికార్డుకు మరో అడుగు దూరంలోనే నిలిచాడు. న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) వశమైంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన నాదల్ ఈ టోర్నీలోనూ తన సత్తా చాటాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక మొదలై సోమవారం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ముగిసిన ఫైనల్లో నాదల్ 7–5, 6–3, 5–7, 4–6, 6–4 స్కోరుతో ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)పై విజయం సాధించాడు. పోటాపోటీగా సాగిన ఐదు సెట్ల ఈ పోరాటం 4 గంటల 49 నిమిషాల పాటు ప్రేక్షకులను కట్టిపడేయడం విశేషం. తాజా విజయంతో నాదల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్య 19కి చేరింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన మెద్వెదేవ్ రన్నరప్‌గా సంతృప్తి పడాల్సి వచ్చింది. నాదల్ గతంలో 2010, 2013, 2017లలో యూఎస్ ఓపెన్ గెలిచాడు. నాదల్ (62)కంటే ఎక్కువ విన్నర్లు (75) కొట్టినా... 57 అనవసర తప్పిదాలు మెద్వెదేవ్ ఓటమికి కారణమయ్యాయి. విజేత నాదల్కు 38,50,000 డాలర్లు (రూ. 27 కోట్ల 59 లక్షలు)... రన్నరప్ మెద్వెదేవ్‌కు 19,00,000 డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నాదల్ జోరు... ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నాదల్కు సరైన ఆరంభం లభించలేదు. అతని ఫోర్హ్యాండ్లలో ధాటి లేకపోవడంతో మెద్వెదేవ్ వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. మూడో గేమ్‌ను బ్రేక్ చేసిన రష్యన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే కోలుకున్న నాదల్ ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయడంలో సఫలమయ్యాడు. తర్వాతి 10 పాయింట్లలో 8 గెలుచుకొని దూసుకుపోగా... స్కోరు 5–5కు చేరిన తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకున్న నాదల్ మళ్లీ బ్రేక్ చేసి సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో సెట్ నాదల్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. బేస్‌లైన్ వద్దనుంచే చక్కటి రిటర్న్‌లతో మెద్వెదేవ్పై ఒత్తిడి పెంచిన అతను 48 నిమిషాల్లోనే అలవోకగా సెట్‌ను సాధించాడు. అనూహ్య ప్రతిఘటన... పరిస్థితి చూస్తే మరో సెట్‌తో పాటు మ్యాచ్ కూడా ఇదే తరహాలో ముగుస్తుందని అనిపించింది. అయితే మెద్వెదేవ్ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. మరో మూడు గేమ్‌లు గెలిస్తే నాదల్ విజేతగా నిలుస్తాడనగా రష్యన్ ప్రతిఘటించాడు. 2–3తో వెనుకబడి ఉన్న దశ నుంచి తర్వాతి 7 గేమ్‌లలో 5 గెలుచుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరు సుదీర్ఘమైన ర్యాలీలు ఆడారు. నాలుగో సెట్లో మెద్వెదేవ్ మరింత దూకుడు ప్రదర్శించాడు. ఆరంభంలోనే బ్రేక్ సాధించిన అతను పదో గేమ్‌లో కూడా మరో రెండు బ్రేక్ పాయింట్లు అందుకొని ముందంజ వేశాడు. బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో సెట్ అతని ఖాతాలో చేరింది. హోరాహోరీ... 64 నిమిషాల పాటు సాగిన చివరి సెట్లో ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం శ్రమించారు. అయితే అనుభవాన్నంతా రంగరించిన నాదల్ ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఆడాడు. ఇద్దరు సర్వీస్‌లు నిలబెట్టుకొని స్కోరు 2–2కు చేరిన తర్వాత నాదల్ రెండు బ్రేక్‌లు సహా వరుసగా మూడు గేమ్‌లు గెలుచుకొని 5–2తో విజయానికి చేరువయ్యాడు. అయితే పోరాటం వదలని మెద్వెదేవ్ కూడా మళ్లీ రెండు గేమ్‌లు సాధించి స్కోరు 4–5కు తీసుకొచ్చాడు. ఉత్కంఠ తారాస్థాయికి పెరిగిపోయిన సమయంలో పదో గేమ్‌లో నాదల్ సర్వీస్ చేశాడు. ఒక దశలో 30–30, 40–40తో మెద్వెదేవ్ పోటీనిచ్చినా... చివరకు నాదల్‌నే విజయం వరించింది. మెద్వెదేవ్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ రిటర్న్ కోర్టు బయట పడటంతో నాదల్ భావోద్వేగంతో కూలిపోయాడు. నా టెన్నిస్ కెరీర్లో నేను ఎంతో భావోద్వేగానికి లోనైన రోజుల్లో ఇది ఒకటి. చివరి మూడు గంటలు హోరాహోరీగా పోరు సాగింది. ఫైనల్ జరిగిన తీరు, దాదాపు చేతుల్లోకి వచ్చిన మ్యాచ్ మళ్లీ కష్టంగా మారిపోవడం, మళ్లీ కోలుకోవడం చూస్తే నా దృష్టిలో ఈ విజయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే గెలవాలంటే ఈ మాత్రం శ్రమించాల్సిందే. స్క్రీన్‌పై నా గత టైటిల్స్‌ను చూడటం, ఆ విజయాలను గుర్తు చేసుకోవడం గర్వంగా, ప్రత్యేకంగా అనిపించింది. అందుకే నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. మెద్వెదేవ్ తన పోరాటంతో మ్యాచ్ దిశను మార్చేసిన తీరు అద్భుతం. మున్ముందు అతను ఎన్నో విజయాలు సాధించడం ఖాయం. భవిష్యత్తులో మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకోవాలని నేనూ కోరుకుంటున్నా. అయితే అత్యధిక స్లామ్‌లు నెగ్గిన ఆటగాడిగా నిలవకపోయినా నేను ప్రశాంతంగా నిద్రపోగలను. –నాదల్ విజయం ఖాయమైన క్షణాన... నాదల్ భావోద్వేగం -
సెరెనా...ఈసారైనా!
2017 ఆస్ట్రేలియన్ ఓపెన్... అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ గెలిచిన 23వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ. ఆ తర్వాత అమ్మగా మారిన ఆమె మరో గ్రాండ్‌స్లామ్ గెలిచి ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచే ప్రయత్నంలో పోరాటం ఆపలేదు. ఈ క్రమంలో మూడు సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫైనల్ చేరినా సెరెనాకు వరుస సెట్లలో ఓటమి తప్పలేదు. ఇప్పుడు సొంతగడ్డపై మరోసారి తుది పోరుకు అర్హత సాధించిన ఈ స్టార్ గెలుపు గీత దాటుతుందా? 24 టైటిల్స్‌తో మార్గరెట్ కోర్ట్ సరసన నిలుస్తుందా? సెరెనాకు, రికార్డుకు మధ్యలో కెనడా టీనేజర్ బియాంకా ఆండ్రీస్కూ నిలిచింది. ఆటలోనూ, అనుభవంలోనూ సెరెనాతో పోలికే లేని ఆండ్రీస్కూ సంచలనం సాధించగలదా? వీరిద్దరి మధ్య నేడు ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. అంతకుముందు సెమీఫైనల్స్‌లో సెరెనా అలవోకగా స్వితోలినాను చిత్తు చేయగా... బియాంక కొంత పోరాడి బెలిండా బెన్సిచ్‌ను మట్టికరిపించింది. సెరెనా, ఆండ్రీస్కూ మధ్య ఒకే ఒక మ్యాచ్ జరిగింది. గత నెలలో టొరంటోలో జరిగిన రోజర్స్ కప్ ఫైనల్లో వీరిద్దరు తలపడ్డారు. ఆండ్రీస్కూ 3–1తో ఆధిక్యంలో ఉన్న దశలో సెరెనా వెన్నునొప్పితో తప్పుకోవడంతో సొంతగడ్డపై ఆండ్రీస్కూను విజయం వరించింది. న్యూయార్క్: మాజీ వరల్డ్ నంబర్‌వన్, అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ 10వ సారి యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గతంలో ఆరు సార్లు ఇక్కడ విజేతగా నిలిచిన ఆమె ఏడో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన సెమీఫైనల్లో సెరెనా 6–3, 6–1తో ఐదో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)ను చిత్తు చేసింది. నేడు జరిగే ఫైనల్లో సెరెనా... కెనడా టీనేజర్, 15వ సీడ్ బియాంకా ఆండ్రీస్కూతో తలపడుతుంది. రెండో సెమీస్‌లో ఆండ్రీస్కూ 7–6 (7/3), 7–5తో 13వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించింది. గతంలో ఆడిన రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో (2019 ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్) రెండో రౌండ్ కూడా దాటని ఆండ్రీస్కూ తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడబోతుండటం విశేషం. 70 నిమిషాల్లో ముగిసె... క్వార్టర్స్‌లో కియాంగ్ వాంగ్‌ను 44 నిమిషాల్లోనే చిత్తు చేసిన సెరెనా సెమీస్‌లో మాత్రం మరికొంత సమయం తీసుకుంది. తొలి సెట్ మొదటి గేమ్‌లో స్వితోలినా మూడు బ్రేక్ పాయింట్లు సాధించి జోరుగా మొదలు పెట్టినట్లు కనిపించింది. అయితే వెంటనే కోలుకున్న సెరెనా చెలరేగి 3–0తో ముందంజ వేసింది. తర్వాతి గేమ్‌ను ప్రత్యర్థి గెలుచుకున్నా సెరెనా తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 4–1తో ఆధిక్యం ప్రదర్శించింది. పదే పదే నెట్‌పైకి దూసుకొచ్చి (6 నెట్ పాయింట్లు) ప్రత్యర్థిపై చెలరేగిన సెరెనా 41 నిమిషాల్లో సెట్ గెలుచుకుంది. రెండో సెట్ లో స్వితోలినా ఆట ముగించేందుకు సెరెనాకు 29 నిమిషాలు సరిపోయాయి. డబుల్ బ్రేక్‌తో 5–1కి దూ సుకుపోయిన అమెరికా ప్లేయర్ చివ రకు బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మొత్తం 34 విన్నర్లు కొట్టిన సెరెనా 6 ఏస్‌లతో తన పదును చూపించింది. ఆమె 20 అనవసర తప్పిదాలు చేసినా చివరకు ఫలితంపై ప్రభావం పడలేదు. తాజా విజయంతో యూఎస్ ఓపెన్‌లో అత్యధిక విజయాల (101) క్రిస్ ఎవర్ట్ రికార్డును సెరెనా సమం చేసింది. హోరాహోరీగా... బియాంకా ఆండ్రీస్కూ, బెన్సిచ్ మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో గేమ్‌లు సమమవుతూ వచ్చి స్కోరు 4–4కు చేరింది. తొమ్మిదో గేమ్‌ను గెలిచి 5–4తో ఆధిక్యంలో నిలిచిన బెన్సిచ్ వరుస తప్పిదాలతో సెట్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. టైబ్రేక్‌లో ఆండ్రీస్కూ 5–0తో దూసుకుపోయింది. బెన్సిచ్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 5–3కు తగ్గించినా కెనడా యువతార మళ్లీ అవకాశం ఇవ్వకుండా సెట్‌ను ముగించింది. రెండో సెట్‌లోనైతే ఒక దశలో 4–1తో, ఆ తర్వాత 5–2తో ఆధిక్యంలో నిలిచినా... చివరకు బెన్సిచ్ ఓటమిపాలవ్వడం గమనార్హం. ఈ దశలో కోలుకున్న ఆండ్రీస్కూ ఒక్కసారిగా పదునైన బ్యాక్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడింది. ఒత్తిడికి లోనై వరుసగా డబుల్ ఫాల్ట్‌లు, అనవసర తప్పిదాలతో ప్రత్యర్థికి తన వైపు నుంచి ఉపకారం చేసి స్విస్ క్రీడాకారిణి ఓటమిని ఆహ్వానించింది. వరుసగా ఐదు గేమ్‌లు గెలుచుకొని ఆండ్రీస్కూ ఫైనల్ చేరింది. 2 గంటల 12 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో బియాంకా 40 విన్నర్స్ కొట్టగా, బెన్సిచ్ 16 విన్నర్లకే పరిమితమైంది. మరోసారి ఫైనల్‌కు చేరడం సంతోషంగా ఉంది. నేను నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వకపోయినా మ్యాచ్ గెలవగలిగాను. నెట్‌పైకి పదే పదే ఎందుకు వెళ్లానో నాకే అర్థం కాలేదు. ఇకపై అలా జరగదు. అసలు బేస్‌లైన్ నుంచే ఆడాల్సింది. క్రిస్ ఎవర్ట్‌తో ఏ రూపంలోనైనా సమంగా నిలవడం గర్వపడే విషయం. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన రికార్డు అందుకున్నా సరే నేను ఆటను కొనసాగించేదాన్ని. అందుకోసం నాకు గతంలో అవకాశాలు వచ్చాయి. ఇకపై కూడా వస్తాయి. కాబట్టి అతిగా ఆలోచించను. నా సుదీర్ఘ కెరీర్‌ను చూస్తే తరం మారిపోయినట్లనిపిస్తోంది. ఇన్నేళ్లలో నేను ఆడిన, ఓడించిన వారిని చూస్తే ఒక అద్భుతంలా కనిపించింది. ఈ ఏడాదిలోని తొలి మూడు గ్రాండ్‌స్లామ్‌లతో పోలిస్తే ఈ టోర్నీకి బాగా సన్నద్ధమై వచ్చాను. నా ప్రత్యర్థి ఆండ్రీస్కూకు వేర్వేరు షాట్లను వేర్వేరు రకాలుగా ఆడగల సత్తా ఉంది. వ్యక్తిగతంగా కూడా ఆమె చాలా మంచి అమ్మాయి. ఫైనల్ కోసం సిద్ధంగా ఉన్నా. –సెరెనా విలియమ్స్ సంవత్సరం క్రితం ఎవరైనా నేను యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరతానని చెబితే వారిని పిచ్చోళ్లుగా భావించేదానిని. నా ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నాను. అంతా కలలా ఉంది. ఈ దశకు చేరేందుకు చాలా కష్టపడ్డాను. సెమీస్‌లో కూడా చాలా బాగా ఆడిన నాకు ఫైనల్ చేరే అర్హత ఉందని నమ్ముతున్నా. సెరెనా రిటైర్ అయ్యేలోగా ఆమెతో గ్రాండ్‌స్లామ్‌లలో తలపడాలని ఉందంటూ నా సన్నిహితులతో ఎప్పుడూ చెబుతుండేదానిని. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నేను ఎంతో ఉత్సాహంగా ఫైనల్ కోసం ఎదురు చూస్తున్నా. ఆమె తన అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తుందని నాకు తెలుసు. నేనూ అదే విధంగా పోరాడతా. మేమిద్దరం తలపడిన గత మ్యాచ్‌లో ఆడిన నాలుగు గేమ్‌లు ఇప్పుడు స్ఫూర్తినిస్తాయని అనుకుంటున్నా. –బియాంకా ఆండ్రీస్కూ ► సెరెనా టైటిల్ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో మార్గరెట్ కోర్ట్ (24–ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డు సమమవుతుంది. యూఎస్ ఓపెన్‌ను ఎక్కువసార్లు గెలుచుకున్న క్రీడాకారిణిగా క్రిస్ ఎవర్ట్ (7)తో కూడా సమంగా నిలుస్తుంది. ► ఆండ్రీస్కూ ఇప్పటి వరకు టాప్–10లోపు క్రీడాకారిణులతో ఏడుసార్లు తలపడితే ఏడు సార్లూ ఆమెనే విజయం వరిచండం విశేషం. సెరెనా ప్రస్తుత ర్యాంక్ 8. ► సెరెనా 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన తర్వాత మూడుసార్లు ‘గ్రాండ్’ ఫైనల్స్‌కు చేరింది. 2018 వింబుల్డన్ ఫైనల్లో కెర్బర్ (జర్మనీ) చేతిలో... 2018 యూఎస్ ఓపెన్ ఫైనల్లో నయోమి ఒసాకా (జపాన్) చేతిలో.. 2019 వింబుల్డన్ ఫైనల్లో సిమోనా హలెప్ (రొమేనియా) చేతిలో సెరెనా వరుస సెట్లలో ఓడిపోయింది. ► 1997లో వీనస్ విలియమ్స్ తొలిసారి యూఎస్ ఓపెన్ బరిలోకి దిగినప్పుడే ఫైనల్ వరకు చేరింది. ఇప్పుడు బియాంకా కూడా అదే ఘనత సాధించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో 200లోపు ర్యాంక్‌లో కూడా లేని ఆండ్రీస్కూ గతేడాది యూఎస్ ఓపెన్ క్వాలిఫయింగ్ తొలిరౌండ్లోనే ఓడింది. ► యూజిన్ బుషార్డ్ (2014 వింబుల్డన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన రెండో కెనడా ప్లేయర్ ఆండ్రీస్కూ. ► ఆండ్రీస్కూ పుట్టిన తేదీ 16 జూన్ 2000. ఆండ్రీస్కూ పుట్టకముందే సెరెనా ఒకసారి యూఎస్ ఓపెన్ (1999లో) టైటిల్ కూడా సాధించేయడం విశేషం. -
ఒక్కడే మిగిలాడు
టాప్ సీడ్ సెర్బియన్ జొకోవిచ్ ప్రిక్వార్టర్స్‌లో నిష్క్రమించాడు. మూడో సీడ్ టెన్నిస్ స్టార్ ఫెడరర్ క్వార్టర్ ఫైనల్లో ఇంటిదారి పట్టాడు. ఇక అందరికళ్లు రెండో సీడ్ నాదల్ మ్యాచ్‌పైనే పడ్డాయి. కానీ టాప్–3లో అతనొక్కడే నిలిచాడు. క్వార్టర్స్ అంచెదాటి సెమీఫైనల్ చేరాడు. ఇప్పటికే మూడు సార్లు (2010, 2013, 2017) చాంపియన్‌గా నిలిచిన ఈ స్పెయిన్ స్టార్ నాలుగో టైటిల్ వేటలో రెండడుగుల దూరంలో నిలిచాడు. న్యూయార్క్: టాప్–3లో ఒకే ఒక్కడి అడుగు సెమీస్‌లో పడింది. స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ రాఫెల్ నాదల్ ఈ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ మాజీ చాంపియన్ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. గురువారం జరిగిన పోరులో అతను 6–4, 7–5, 6–2తో అర్జెంటీనాకు చెందిన 20వ సీడ్ డీగో ష్వార్జ్‌మన్‌పై విజయం సాధించాడు. 2 గంటల 47 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్కు రెండో సెట్ మినహా ఎక్కడ పోటీ ఎదురవలేదు. ఆఖరి సెట్నైతే ఏకపక్షంగా ముగించేశాడు. 5 ఏస్‌లు సంధించిన నాదల్ ప్రత్యర్థి సర్వీస్‌ను 8 సార్లు బ్రేక్ చేశాడు. 39 అనవసర తప్పిదాలు చేసినప్పటికీ 35 విన్నర్స్ కొట్టాడు. 4 ఏస్‌లు సంధించిన ష్వార్జ్‌మన్... 37 అనవసర తప్పిదాలు చేశాడు. అవతలివైపు నాదల్ జోరుతో కేవలం 26 విన్నర్సే కొట్టగలిగాడు. గతేడాది కూడా ఈ టోర్నీలో సెమీస్ చేరిన నాదల్ ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో 33 సార్లు సెమీఫైనల్ చేరాడు. ప్రస్తుతం అతని కంటే ముందు వరుసలో ఫెడరర్ (45), నొవాక్ జొకోవిచ్ (36) మాత్రమే ఉన్నారు. ఇక ఈ టోర్నీలో టైటిల్ నాదల్ చేతికే అందే అవకాశాలున్నాయి. సెమీస్ బరిలో నిలిచిన ఇతర ఆటగాళ్లెవరూ స్పానియార్డ్ జోరు ముందు నిలబడలేరు. దీంతో ఏదో సంచలనం జరిగితే తప్ప... ఈ టోర్నీలో నాదల్ చాంపియన్‌షిప్‌ను ఎవరూ అడ్డుకోలేరని చెప్పొచ్చు. 42 ఏళ్ల తర్వాత ఓ ఇటాలియన్ మరో క్వార్టర్ ఫైనల్ పోరులో ఇటలీకి చెందిన 24వ సీడ్ మాటెయో బెరెటిని చెమటోడ్చి నెగ్గి సెమీస్ చేరాడు. మ్యాచ్ సాగే కొద్దీ పోటీ పెరిగిన ఈ పోరులో అతను 3–6, 6–3, 6–2, 3–6, 7–6 (7/5)తో ఫ్రాన్స్ ఆటగాడు, 13వ సీడ్ గేల్ మోన్ఫిల్స్పై విజయం సాధించాడు. సుమారు నాలుగు గంటల (3 గం. 57 ని.) పాటు ఐదు సెట్ల దాకా ఈ మ్యాచ్ సాగింది. ఈ విజయంతో 42 ఏళ్ల తర్వాత యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన తొలి ఇటాలియన్గా బెరెటిని ఘనతకెక్కాడు. 1977లో కొరాడో బరజుటి సెమీస్ చేరిన తర్వాత మరో ఇటలీ ఆటగాడెవరూ యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్‌దాకా వెళ్లలేకపోయాడు. సెమీఫైనల్లో నాదల్‌తో బెరెటిని తలపడతాడు. కెనడా టీనేజ్ అమ్మాయి బియాంక అండ్రిస్కూ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 15వ సీడ్‌గా బరిలోకి దిగిన అండ్రిస్కూ 3–6, 6–2, 6–3తో బెల్జియంకు చెందిన ఎలైస్ మెర్టెన్స్‌ను ఓడించింది. తాజా ఫలితంతో దశాబ్దం తర్వాత యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరిన టీనేజ్ క్రీడాకారిణిగా (19 ఏళ్లు) ఆమె ఘనతకెక్కింది. 2009లో వోజ్నియాకి (డెన్మార్క్) ఈ ఘనత సాధించింది. -
జొకోవిచ్‌తో వావ్రింకా ‘సై’
♦ యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ♦ టైటిల్‌పై సెర్బియా, స్విస్ స్టార్స్ గురి ♦ సెమీస్‌లో మోన్ఫిల్స్, నిషికొరిలపై విజయం ♦ నేటి అర్ధరాత్రి గం. 1.30 నుంచి టెన్-1లో ప్రత్యక్ష ప్రసారం కెరీర్లో 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో నొవాక్ జొకోవిచ్... మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో స్టానిస్లాస్ వావ్రింకా... యూఎస్ ఓపెన్ అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. జొకోవిచ్ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన మూడో ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. వావ్రింకా నెగ్గితే మ్యాచ్ పారుుంట్ కాచుకొని యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన ఏడో ప్లేయర్‌గా నిలుస్తాడు. న్యూయార్క్: గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో వావ్రింకా (స్విట్జర్లాండ్) చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు లభించింది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఈ ఇద్దరూ టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 6-3, 6-2, 3-6, 6-2తో పదో సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స)పై గెలుపొందగా... మూడో సీడ్ వావ్రింకా 4-6, 7-5, 6-4, 6-2తో ఆరో సీడ్ కీ నిషికొరి (జపాన్)ను ఓడించాడు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 19-4తో వావ్రింకాపై ఆధిక్యంలో ఉన్నాడు. జొకోవిచ్ టైటిల్ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జాబితాలో 13 టైటిల్స్‌తో ఒంటరిగా మూడో స్థానానికి చేరుకుంటాడు. ఫెడరర్ (స్విట్జర్లాండ్-17 టైటిల్స్) అగ్రస్థానంలో ఉండగా... పీట్ సంప్రాస్ (అమెరికా), రాఫెల్ నాదల్ (స్పెరుున్) 14 టైటిల్స్‌తో ఉమ్మడిగా రెండో స్థానంలో, 12 టైటిల్స్‌తో జొకోవిచ్, ఎమర్సన్ (ఆస్ట్రేలియా) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన గేల్ మోన్ఫిల్స్ టాప్ సీడ్ జొకోవిచ్‌ను అంతగా ఇబ్బంది పెట్టలేకపోయాడు. ఈ టోర్నీలో తన ప్రత్యర్థులు మధ్యలో వైదొలగడంతో మూడు పూర్తిస్థారుు మ్యాచ్‌లు ఆడకుండానే సెమీస్‌కు చేరిన జొకోవిచ్ ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కేవలం 15 నిమిషాల్లోనే తొలి సెట్లో 5-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అరుుతే మోన్ఫిల్స్ తేరుకొని మూడు గేమ్‌లు గెలిచినా సెట్‌ను మాత్రం కోల్పోయాడు. రెండో సెట్లోనూ జొకోవిచ్ హవా కొనసాగింది. మోన్ఫిల్స్ ఉద్దేశపూర్వకంగా గట్టిపోటీ ఇవ్వడంలేదని భావించిన ప్రేక్షకులు అతణ్ని ఎగతాళి చేశారు. మూడో సెట్లో మోన్ఫిల్స్ సహజశైలిలో ఆడి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో సెట్‌ను నెగ్గాడు. అరుుతే నాలుగో సెట్లో మళ్లీ జొకోవిచ్ విజృంభించడంతో మోన్ఫిల్స్ చేతులెత్తేశాడు. 2 గంటల 32 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో మోన్ఫిల్స్ 11 ఏస్‌లు సంధించి, 11 డబుల్ ఫాల్ట్‌లు, 52 అనవసర తప్పిదాలు చేశాడు. జొకోవిచ్ ఒకే ఏస్ కొట్టి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 27 అనవసర తప్పిదాలు చేశాడు. మాజీ రన్నరప్ నిషికొరితో జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా తొలి సెట్‌ను కోల్పోరుునా వెంటనే తేరుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. గతంలో రెండుసార్లు సెమీఫైనల్లో ఓడిన వావ్రింకా మూడో ప్రయత్నంలో ఈ అడ్డంకిని అధిగమించి తొలిసారి ఫైనల్‌కు చేరుకున్నాడు. మూడో రౌండ్లో డానియల్ ఇవాన్‌స (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో సెట్లో మ్యాచ్ పారుుంట్ కాపాడుకున్న వావ్రింకా... వరుసగా మూడో మ్యాచ్‌లో నాలుగు సెట్లు ఆడి గెలిచాడు. 3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన సెమీస్‌లో వావ్రింకా పది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు.