యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ హస్తగతం
ఫైనల్లో అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌పై విజయం
రూ. 30 కోట్ల 23 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
ఈ ఏడాది తన అది్వతీయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ మరో గొప్ప విజయం సాధించాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో సినెర్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించాడు. ఆద్యంతం తన ఆధిపత్యం చలాయిస్తూ వరుస సెట్‌లలో అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌పై
గెలిచాడు. తన కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు.
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టోర్నీ ప్రారంభానికి ముందు తెరపైకొచి్చన డోపింగ్ వివాదం తన ఆటతీరుపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఇటలీ స్టార్ యానిక్ సినెర్ నిరూపించాడు. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌కు, టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో సినెర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 23 ఏళ్ల సినెర్ 6–3, 6–4, 7–5తో ప్రపంచ 12వ ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సినెర్‌కు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురుకాలేదు. విజేతగా నిలిచిన సినెర్‌కు 36 లక్షల డాలర్లు (రూ. 30 కోట్ల 23 లక్షలు), రన్నరప్ ఫ్రిట్జ్‌కు 18 లక్షల డాలర్లు (రూ. 15 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
బ్రేక్ పాయింట్‌తో మొదలు...
2003లో ఆండీ రాడిక్ యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచాక మరో అమెరికన్ క్రీడాకారుడు గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించలేకపోయాడు. 2009లో ఆండీ రాడిక్ వింబుల్డన్ ఫైనల్లో ఫెడరర్ చేతిలో ఓడిపోయాక మరో అమెరికా ప్లేయర్ మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ ఫైనల్ చేరలేకపోయాడు. 15 ఏళ్ల తర్వాత టేలర్ ఫ్రిట్జ్ రూపంలో అమెరికా ప్లేయర్ ఒకరు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ ఆడుతుండటంతో అందరి కళ్లు ఫ్రిట్జ్‌పైనే కేంద్రీకృతమయ్యాయి. అయితే సినెర్ మాత్రం అమెరికా అభిమానుల ఆశలను వమ్ము చేశాడు.
తొలి సెట్‌లోని తొలి గేమ్‌లోనే ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 2–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే మూడో గేమ్‌లో సరీ్వస్ కాపాడుకొని, నాలుగో గేమ్‌లో సినెర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫ్రిట్జ్ స్కోరును 2–2తో సమం చేశాడు. కానీ సినెర్ వెంటనే విజృంభించి మరో రెండుసార్లు ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను గెల్చుకున్నాడు. రెండో సెట్‌లోనూ సినెర్ దూకుడుకు ఫ్రిట్జ్ జవాబు ఇవ్వలేకపోయాడు. మూడో సెట్‌లో కాస్త పోటీ ఎదురైనా 12వ గేమ్‌లో ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ విజయాన్ని అందుకున్నాడు.
6: ఈ ఏడాది సినెర్ గెలిచిన టైటిల్స్. ఆ్రస్టేలియన్ ఓపెన్, రోటర్‌డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో సినెర్ విజేతగా నిలిచాడు.
55: ఈ సంవత్సరం సినెర్ మొత్తం 60 మ్యాచ్‌లు ఆడాడు. 55 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. ఐదింటిలో ఓడిపోయాడు. 3: తన కెరీర్‌లో ఒకే ఏడాది ఫైనల్ చేరుకున్న తొలి రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ విజేతగా నిలిచిన మూడో ప్లేయర్ సినెర్. గతంలో గిలెర్మో విలాస్ (అర్జెంటీనా; 1977లో ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్), జిమ్మీ కానర్స్ (అమెరికా; 1974లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) మాత్రమే ఈ ఘనత సాధించారు.
4: ఒకే ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన నాలుగో ప్లేయర్ సినెర్. ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా) మూడుసార్లు చొప్పున... 1988లో మాట్స్ విలాండర్ (స్వీడన్) ఒకసారి ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment