తెరపై కనిపించిన ఆనందంలో ఆ అమ్మడు ఏం చేసిందో చూడండి.. | Viral Video: Woman Chugs Two Beers After Coming On Big Screen At US Open | Sakshi
Sakshi News home page

Viral Video: తెరపై కనిపించిన ఆనందంలో ఒక్క గుక్కలో బీర్‌ మొత్తాన్ని మింగేసింది..

Published Fri, Sep 10 2021 7:04 PM | Last Updated on Sun, Oct 17 2021 1:42 PM

Viral Video: Woman Chugs Two Beers After Coming On Big Screen At US Open - Sakshi

న్యూయార్క్‌: ఏవైనా పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్స్‌ జరుగుతున్నప్పుడు బాగా సీరియస్‌గా ఉన్న స్టేడియాన్ని ఉర్రూతలూగించేందుకు కెమెరామెన్లు ఎవరో ఒకరు చేసే సిల్లీ పనులను బిగ్ స్క్రీన్‌పై చూపిస్తుంటారు. సరిగ్గా యూఎస్ ఓపెన్‌-2021లోనూ ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుంది. ఫెలిక్స్ అగర్ అలియాస్సిమ్, రాబర్టో బటిస్టా అగుట్ మధ్య జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ మధ్యలో కెమెరామెన్ ఓ మహిళను బిగ్ స్క్రీన్‌పై చూపించాడు.

దీంతో ఆమె ఆనందాన్ని ఆపుకోలేక, తన చేతిలోని బీరు మొత్తాన్ని గుటుక్కున మింగేసి సంబరాలు చేసుకుంది. ఇది చూసిన మిగతా ప్రేక్షకులు మ్యాచ్‌ను చూడటం మానేసి ఆ అమ్మాయిని ప్రోత్సహిస్తూ.. 'షి ఈజ్‌ ఏ ఛాంప్‌' అంటూ కేకలు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
చదవండి: ఆ సిరీస్‌లో రివ్యూ కోరే అవకాశం లేదు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement