యూఎస్ ఓపెన్‌లో స్పానిష్ యువ సంచలనం 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. న్యూయార్క్ వేదికగా ఆదివారం ఆర్ధ రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నార్వేజియన్ కాస్పర్ రూడ్‌ను ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను అల్కరాజ్ కైవసం చేసుకున్నాడు. 2 గంటల 20 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 6-4, 2-6, 7-6(7-1), 6-3 తేడాతో అల్కరాజ్ విజయం సాధించాడు.
దీంతో వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా రఫెల్ నాదల్ తర్వాత 19 ఏళ్లకే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా అల్కరాజ్ నిలిచాడు. 2005లో రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుని ఈ ఘనత సాధించాడు. అదే విధంగా అతి తక్కువ వయస్సులోనే వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి ఆటగాడిగా కూడా అల్కరాజ్ నిలిచాడు.
చదవండి: US Open 2022: మహిళల సింగిల్స్ విజేతగా ఇగా స్వియాటెక్
Comments
Please login to add a commentAdd a comment