మయామీ: రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్ ఈ ఏడాది తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ నాలుగో ఏటీపీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీలో మెద్వెదెవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతను 7–5, 6–3 స్కోరుతో జనిక్ సిన్నర్ (ఇటలీ)ని ఓడించాడు.
1 గంటా 34 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మెద్వెదెవ్ 9 ఏస్‌లు కొట్టగా, సిన్నర్ 6 ఏస్‌లు బాదాడు. రష్యా ఆటగాడు 6 డబుల్ ఫాల్ట్‌లు చేసినా ఆ ప్రభావం ఫలితంపై పడకుండా సత్తా చాటడం విశేషం. 2023లో 24 మ్యాచ్‌లలో గెలిచి ఒకే ఒక మ్యాచ్‌లో ఓడిన మెద్వెదెవ్ ఖాతాలో ఇది నాలుగో టైటిల్ కాగా ఓవరాల్‌గా ఐదో ఏటీపీ మాస్టర్స్ టైటిల్.
Comments
Please login to add a commentAdd a comment