రాఫెల్ నాదల్
పురుషుల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ కెరీర్‌లో 33వ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. కెనడాలోని టొరంటోలో జరుగుతున్న రోజర్స్ కప్ టోర్నీలో ఈ స్పెయిన్ స్టార్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో టాప్ సీడ్ నాదల్ 7–6 (7/3), 6–4తో కరెన్ ఖచనోవ్ (రష్యా)పై గెలుపొందాడు. ఫైనల్లో స్టెఫానో సిట్‌సిపాస్ (గ్రీస్)తో నాదల్ ఆడతాడు. మరో సెమీఫైనల్లో సిట్‌సిపాస్ 6–7 (4/7), 6–4, 7–6 (9/7)తో వింబుల్డన్ టోర్నీ రన్నరప్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు.
Comments
Please login to add a commentAdd a comment