tennis champion
-
శభాష్ హృతిక్
సాక్షి, హైదరాబాద్: అంచనాలకు మించి రాణించి... తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను ఓడించి... హైదరాబాద్ కుర్రాడు హృతిక్ కటకం ఆసియా అండర్–14 టెన్నిస్ చాంపియన్íÙప్ బాలుర సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. కంబోడియాలో జరిగిన ఈ టోర్నీలో హృతిక్ టైటిల్ గెలిచే క్రమంలో టాప్ సీడ్, రెండో సీడ్, మూడో సీడ్ క్రీడాకారులను ఓడించడమే కాకుండా... తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఫైనల్లో హృతిక్ 6–3, 7–5తో రెండో సీడ్ డాంగ్జే కిమ్ (దక్షిణ కొరియా)ను ఓడించి టైటిల్ దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో హృతిక్ 6–0, 6–0తో యితియన్ లూ (చైనా)పై, క్వార్టర్ ఫైనల్లో 6–1, 6–1తో మూడో సీడ్ రమ్తిన్ రఫీ»ొరుజెని (ఇరాన్)పై, సెమీఫైనల్లో 6–3, 6–4తో టాప్ సీడ్ ధర్మ పాంతారాటోర్న్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. హైదరాబాద్‌కే చెందిన డేవిస్‌కప్ ప్లేయర్, లండన్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ విష్ణువర్ధన్ దిశానిర్దేశనంలో హృతిక్ ముందుకు సాగుతున్నాడు. హైదరాబాద్ హబ్సిగూడలోని ట్రినిటీ చాలెంజర్స్ టెన్నిస్ అకాడమీలో కోచ్‌లు హెన్రీ ప్రవీణ్, రామకృష్ణ వద్ద హృతిక్ శిక్షణ తీసుకుంటున్నాడు. పుణేలోని ఆర్యన్ పంప్స్‌కు చెందిన ప్రశాంత్ సుతార్ హృతిక్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఆసియా టైటిల్‌తో హృతిక్ ఈ ఏడాది డిసెంబర్లో అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగే ప్రతిష్టాత్మక ఎడ్డీ హెర్, ఆరెంజ్ బౌల్ చాంపియన్íÙప్ పోటీలకు కూడా అర్హత సాధించాడు. -
టైటిల్‌కు గెలుపు దూరంలో యూకీ బాంబ్రీ జోడీ..!
భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ తన కెరీర్లో మూడో ఏటీపీ డబుల్స్ టైటిల్‌కు విజయం దూరంలో ఉన్నాడు. పారిస్‌లో జరుగుతున్న ఓపెన్ పార్క్ ఏటీపీ–250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–7 (5/7), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటను బోల్తా కొట్టించింది. ఒక గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ద్వయం ఏడు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.నేడు జరిగే ఫైనల్లో హెలియోవారా (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్)లతో యూకీ–ఒలివెట్టి పోటీపడతారు. యూకీ ఈ ఏడాది ఒలివెట్టితో కలిసి మ్యూనిక్ ఓపెన్‌లో, గత ఏడాది లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)తో కలిసి మలోర్కా ఓపెన్‌లో డబుల్స్ టైటిల్స్ గెలిచాడు.సచిన్ శుభారంభం బ్యాంకాక్: ఒలింపిక్ వరల్డ్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ సచిన్ సివాచ్ శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన 57 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో సచిన్ 5–0తో అలెక్స్ ముకుకా (న్యూజిలాండ్)పై గెలుపొందాడు. పారిస్ ఒలింపిక్స్‌కు ఇదే చివరి అర్హత టోర్నమెంట్. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్న బాక్సర్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. భారత్ నుంచి పురుషుల విభాగంలో ఏడుగురు, మహిళల విభాగంలో ముగ్గురు బాక్సర్లు ఈ టోరీ్నలో పాల్గొంటున్నారు. భారత్ పరాజయం అంట్వెర్ప్ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టుకు 1–4తో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియం చేతిలో పరాజయం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో రక్షణ పంక్తి వైఫల్యాలతో భారత్ మూల్యం చెల్లించుకుంది. అందివచి్చన పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలోనూ విఫలమైంది. భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను అభిషేక్ (55వ ని.లో) ఆఖరి క్వార్టర్లో నమోదు చేశాడు. బెల్జియం బృందంలో హెండ్రిక్స్ అలెగ్జాండర్ (34వ, 60వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా, ఫెలిక్స్ (22వ ని.), చార్లియెర్ సెడ్రిక్ (49వ ని.) చెరో గోల్ చేశారు. నేడు భారత్ మళ్లీ బెల్జియంతోనే తలపడుతుంది. మిక్స్డ్ టీమ్ ఫైనల్లో జ్యోతి సురేఖ జోడీయెచోన్ (దక్షిణ కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోరీ్నలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రెండో స్వర్ణంపై గురి పెట్టింది. ఇప్పటికే మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో ఫైనల్ చేరిన జ్యోతి సురేఖ... మిక్స్డ్ టీమ్ కేటగిరీలో ప్రియాంశ్‌తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ రెండు ఫైనల్స్ నేడు జరుగుతాయి. శుక్రవారం జరిగిన మిక్స్డ్ టీమ్ ఈవెంట్ సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–ప్రియాంశ్ (భారత్) ద్వయం 158–157తో హాన్ సెంగ్యోన్–యాంగ్ జేవన్ (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో ఒలివియా డీన్–సాయెర్ (అమెరికా)లతో జ్యోతి సురేఖ–ప్రియాంశ్ తలపడతారు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్ దీపిక కుమారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో దీపిక 6–4తో ఎలిఫ్ బెరా గొకిర్ (టరీ్క)పై గెలిచింది. ఇవి చదవండి: SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్: కమిన్స్ -
తొలి రౌండ్లోనే సుమిత్ ఓటమి..!
నెల రోజుల తర్వాత పాల్గొన్న తొలి టోర్నీలో భారత టెన్నిస్ నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్లో జరుగుతున్న బీఎన్పీ పరిబా ప్రైమ్రోజ్ ఏటీపీ–175 చాలెంజర్ టోర్నీలో సుమిత్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు.ప్రపంచ 93వ ర్యాంకర్ సుమిత్ 2–6, 2–6తో ప్రపంచ 130వ ర్యాంకర్ హరోల్డ్ మయోట్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సరీ్వస్‌ను ఐదుసార్లు కోల్పోయాడు.ఇవి చదవండి: అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు..! -
నిష్క్రమించిన దిగ్గజం
బరిలోకి దిగిన ప్రతిసారీ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలకబోతున్నట్టు చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ అభిమానులను దిగ్భ్రాంతి పరిచింది. వచ్చేవారం లండన్‌లో జరిగే లేవర్ కప్‌తో ఇక గ్రౌండ్‌నుంచి నిష్క్రమించబోతున్నానని ఆ ప్రకటన సారాంశం. నిజానికి ఇది ఊహిం చని పరిణామ మేమీ కాదు. ఆయన రేపో, మాపో ఆటకు గుడ్‌బై చెబుతాడని మూడు నాలుగేళ్లుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అభిమానులను కలవరపెడుతూనే ఉన్నాయి. వింబుల్డన్, ఆస్టేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లలో ఫెదరర్‌కు గాయాలూ, శస్త్ర చికిత్సలూ రివాజయ్యాయి. పర్యవసానంగా అప్పుడప్పుడు ఆటకు విరామం ప్రకటించక తప్పలేదు. వాస్తవానికి నిరుడు జూలైకి ముందు 14 నెలలుగా అతను ఆడింది లేదు. ఆ నెలలో జరిగిన వింబుల్డన్ క్వార్టర్స్‌లో దారుణమైన ఓటమి చవిచూశాడు. అందుకే ఫెదరర్ ఏం చెబుతాడోనన్న సందేహం అభిమానులను నిత్యం వేధించేది. అలాగని టెన్నిస్‌లో అతనేమీ అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన మేటి ఆటగాడు కాదు. టెన్నిస్ దిగ్గజ త్రయంలో ఫెదరర్తోపాటున్న రాఫెల్ నాదల్, జోకోవిచ్లిద్దరూ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ రేస్‌లో అతన్నెప్పుడో అధిగమించారు. ఆ త్రయంలో అతనిది మూడో స్థానమే. కానీ ఎప్పుడూ అంకెలే వీక్షకుల్ని చకితుల్ని చేయలేవు. తన ఆటకు సృజనాత్మకతను జోడించడం, అందరూ కొట్టే షాట్లే అయినా ప్రతిసారీ తన ప్రత్యేకతను ప్రదర్శించడం, చురుకైన తన కదలికలతో వీక్షకుల్ని కట్టిపడేయడం ఫెదరర్‌కే సాధ్యం. ఆ కదలికల్లో ఒక్కటైనా అనవసరమైనది కనబడదు. తనవైపు దూసుకొచ్చిన బంతిని ప్రత్యర్థి అంచనాకు అందని రీతిలో కొట్టి వారితో తప్పులు చేయించడం, పాయింట్ సాధించడం అతనికి అలవోకగా అబ్బిన విద్య. బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్లు రెండింటికీ అతనే కేరాఫ్ అడ్రస్. ఫుట్‌వర్క్, అటాకింగ్ గేమ్ అతనికే సొంతం. ఒక్కోసారి కొన్ని షాట్లు విఫలం కావొచ్చుగాక... గెలుపోటములతో నిమిత్తం లేకుండా అవి మళ్లీ మళ్లీ నెమరేసుకునే దృశ్యాలుగానే ఎప్పటికీ మిగిలాయి. అందుకే ఆటలో ప్రత్యేక ప్రతిభ తన సొంతమని అతను చేసిన ప్రకటన ఎవరికీ అతిశయోక్తి అనిపించలేదు. 2002లోనే అతను టాప్–50 ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించాడు. ఈ ఏడాది జూన్ వరకూ చెక్కు చెదరకుండా అక్కడే నిలిచాడు. పురుషుల టెన్నిస్‌లో 2004లో నంబర్ వన్ ప్లేయర్ అయ్యాడు. 2008 వరకూ నిరంతరాయంగా కొనసాగాడు. అనేకసార్లు మళ్లీ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో పనిచేయడం, ఎదురయ్యే అవరోధాలను అధిగ మించేందుకు ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉండటం ఫెదరర్ ఆటలో కనబడుతుంది. ఈ లక్షణమే అతన్ని ఇప్పటికీ యోధుడిగా నిలిపింది. ఓడిన సందర్భాల్లో సైతం క్రీడాభిమానులు అతనికి నీరాజనాలు పట్టేలా చేసింది. 41 ఏళ్ల వయసంటే... దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవమంటే... 1,500కు మించిన మ్యాచ్‌లంటే ఏ క్రీడాకారుడికైనా నిష్క్రమించక తప్పని సమయమని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు సరికొత్త తారలు దూసుకొస్తుంటాయి. ఆటను కొత్తపుంతలు తొక్కిస్తుంటాయి. నాదల్, జోకోవిచ్ల సంగతలా ఉంచి హ్యూబర్ట్ హుర్కజ్లాంటి సరికొత్త మెరుపు ముందు ఫెదరర్ తలవంచక తప్పని సందర్భమూ వచ్చింది. అందుకే కావొచ్చు... తన శరీర సామర్థ్యంపై మదింపు వేసుకున్నాడు. తన పరిమితులేమిటో తెలుసుకున్నాడు. ఫెదరర్ వదిలిపోతున్న వారసత్వం అత్యుత్తమమైనది. ఒక ఆటగాడు వ్యక్తిగా ఎలా ఉండాలో, ఎలాంటి ప్రమాణాలు పాటించాలో తన సద్వర్తన ద్వారా అతను చూపాడు. ఓటమి ఎదురైతే ప్రత్యర్థులపై నిప్పులు కక్కడం ఏ ఆటలోనైనా ఇప్పుడు రివాజు. గెలుపు సాధించినవారు విర్రవీగుతున్న ఉదంతాలూ లేకపోలేదు. ఇక టెన్నిస్‌లో ఓటమి ఎదురైతే సహనం కోల్పోయి రాకెట్లు విరగ్గొడుతున్నవారూ ఉంటున్నారు. ఎన్నడో కెరీర్ మొదట్లో ఫెదరర్ కూడా సహనం కోల్పోయిన సందర్భాలున్నాయి. కానీ అతి త్వరలోనే తన ప్రవర్తన మార్చుకున్నాడు. ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఆడితే సత్ఫలితం సాధించడం సాధ్యమేనని తెలుసుకున్నాడు. సేవా కార్యక్రమాల్లో సైతం ఎందరికో ఆదర్శప్రాయుడయ్యాడు. తన పేరిట ఉన్న ఫౌండేషన్ ద్వారా చదువుల్లో రాణించే నిస్సహాయ పిల్లలకు చేయూతనందించడం, ప్రకృతి వైపరీత్యాలు విరుచుకు పడినప్పుడు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లతో విరాళాలు సేకరించి ఆపన్న హస్తం అందించడం అతని ప్రత్యేకత. ఆటాడుతున్నప్పుడు నాదల్, జొకోవిచ్‌లతో నువ్వా నేనా అన్న రీతిలో తలపడటం షరా మామూలే అయినా ఎప్పుడూ అవి వ్యక్తిగత వివాదాలుగా ముదరలేదు. చెప్పాలంటే ఆ ముగ్గురూ కలిసి టెన్నిస్‌కు కనీవినీ ఎరుగని జనాదరణను తెచ్చారు. ఆ ఆట స్థాయిని పెంచారు. జోకోవిచ్‌పై ఒక సందర్భంలో డోపింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు వ్యాక్సిన్ వేయించుకోని కారణంగా ఆటంకాలెదురయ్యాయి. ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతున్నప్పుడు కాలికి సమస్య ఏర్పడటంతో కొన్ని ఇంజెక్షన్లు తీసుకున్నానని నాదల్ ప్రకటించి వివాదంలో చిక్కుకున్నాడు. కానీ ఇలాంటి వివాదాలేవీ ఫెదరర్‌కు ఎదురుకాలేదు. టెన్నిస్ ప్రపంచంలో చివరంటా ధ్రువతారగా కొనసాగిన ఫెదరర్ మిగిల్చిన జ్ఞాపకాలు ఎన్నటికీ చెక్కుచెదరనివి. అభిమానులకు ఎప్పటికీ అపురూపమైనవి. -
33వ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌కు చేరువలో నాదల్
పురుషుల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ కెరీర్లో 33వ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. కెనడాలోని టొరంటోలో జరుగుతున్న రోజర్స్ కప్ టోర్నీలో ఈ స్పెయిన్ స్టార్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో టాప్ సీడ్ నాదల్ 7–6 (7/3), 6–4తో కరెన్ ఖచనోవ్ (రష్యా)పై గెలుపొందాడు. ఫైనల్లో స్టెఫానో సిట్సిపాస్ (గ్రీస్)తో నాదల్ ఆడతాడు. మరో సెమీఫైనల్లో సిట్సిపాస్ 6–7 (4/7), 6–4, 7–6 (9/7)తో వింబుల్డన్ టోర్నీ రన్నరప్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. -
కెరీర్లో మరిచిపోలేని విజయం...
కాలిఫోర్నియా : ప్రముఖ భారత టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ తన కెరీర్లోనే మరిచిపోలేని అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. టెన్నిస్‌లో ప్రపంచ నంబర్ 12 ఫ్రెంచ్ క్రీడాకారుడు లూకాస్ పౌల్లెను ఓడించి చరిత్ర సృష్టించాడు. 110వ ర్యాంక్‌లో ఉన్న యూకీ ఈ విజయంతో టెన్నిస్ లోకాన్ని ఆశ్చర్యంలో ముంచేశాడు. సోమవారం జరిగిన ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సెకండ్ రౌండ్లో 6-4, 6-4 తేడాతో లూకాస్ పౌల్లెపై విజయ దుందుభి మోగించాడు. ఈ విజయంతో బాంబ్రీకి 40 ర్యాంకింగ్ పాయింట్లతో పాటు 47 వేల డాలర్ల నజరానా లభించనుంది. మూడో రౌండ్లో అమెరికాకు చెందిన పొడగరి, ప్రపంచ 21 ర్యాంకర్ శామ్ క్వెర్రితో బాంబ్రీ తలపడనున్నాడు. 2017లో జరిగిన సిటీ ఓపెన్ డిఫెండింగ్ చాంపియన్ షిప్లో ప్రపంచ 22 ర్యాంకర్ గేల్ మాన్లిస్ను ఓడించి ఔరా అనిపించిన విషయం తెలిసిందే. 2014లో జరిగిన చెన్నై ఓపెన్‌లో ప్రపంచ 16వ ర్యాంకర్ ఫాబియో ఫోగ్నిని ఓడించి సత్తా చాటాడు. -
టెన్నిస్ లో మరో యువ కెరటం
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ చరిత్రలో మరో యువ కెరటం వచ్చి చేరింది. ఫెనెస్టా ఓపెన్ లో భాగంగా ఇక్కడ ఆర్కే ఖన్నా స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఎన్ శ్రీరామ్ బాలాజీ సరికొత్త జాతీయ చాంపియన్ గా అవతరించాడు. టాప్ సీడ్ గా బరిలోకి దిగిన బాలాజీ తుది పోరులో సెకెండ్ సీడ్ విష్ణు వర్ధన్ ను బోల్తా కొట్టించాడు. హోరాహోరీగా సాగిన పోరులో బాలాజీ 7-5, 6-3 తేడాతో విష్ణు వర్ధన్ పై గెలిచాడు. దీంతో 2016 లో జరిగే ఢిల్లీ ఓపెన్ లో బాలాజీకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. గత ఆరు సంవత్సరాల నుంచి జాతీయస్థాయిలో ఆడుతున్న బాలాజీ చాంపియన్ గా నిలవాలన్న కలను ఎట్టకేలకు సాకారం చేసుకున్నాడు. ఇప్పటికే తన సహచరుడు వీఎమ్ రంజిత్ తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ ను సాధించిన బాలాజీ.. సింగిల్స్ లో కూడా తన సత్తాను నిరూపించుకున్నాడు. ఇదిలా ఉండగా మహిళల సింగిల్స్ టైటిల్ ను డిఫెండింగ్ చాంపియన్ పెర్నా బాంబ్రీ నిలబెట్టుకుంది. తుది సమరంలో సమితా సాయి చమర్తిని కంగుతినిపించి టైటిల్ ను కాపాడుకుంది.