ఆసియా అండర్–14 టెన్నిస్ చాంపియన్‌గా హైదరాబాద్ కుర్రాడు
సాక్షి, హైదరాబాద్: అంచనాలకు మించి రాణించి... తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను ఓడించి... హైదరాబాద్ కుర్రాడు హృతిక్ కటకం ఆసియా అండర్–14 టెన్నిస్ చాంపియన్íÙప్ బాలుర సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. కంబోడియాలో జరిగిన ఈ టోర్నీలో హృతిక్ టైటిల్ గెలిచే క్రమంలో టాప్ సీడ్, రెండో సీడ్, మూడో సీడ్ క్రీడాకారులను ఓడించడమే కాకుండా... తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం.
ఫైనల్లో హృతిక్ 6–3, 7–5తో రెండో సీడ్ డాంగ్‌జే కిమ్ (దక్షిణ కొరియా)ను ఓడించి టైటిల్ దక్కించుకున్నాడు. తొలి రౌండ్‌లో హృతిక్ 6–0, 6–0తో యితియన్ లూ (చైనా)పై, క్వార్టర్ ఫైనల్లో 6–1, 6–1తో మూడో సీడ్ రమ్తిన్ రఫీ»ొరుజెని (ఇరాన్)పై, సెమీఫైనల్లో 6–3, 6–4తో టాప్ సీడ్ ధర్మ పాంతారాటోర్న్ (థాయ్‌లాండ్)పై గెలుపొందాడు. హైదరాబాద్‌కే చెందిన డేవిస్‌కప్ ప్లేయర్, లండన్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ విష్ణువర్ధన్ దిశానిర్దేశనంలో హృతిక్ ముందుకు సాగుతున్నాడు.
హైదరాబాద్ హబ్సిగూడలోని ట్రినిటీ చాలెంజర్స్ టెన్నిస్ అకాడమీలో కోచ్‌లు హెన్రీ ప్రవీణ్, రామకృష్ణ వద్ద హృతిక్ శిక్షణ తీసుకుంటున్నాడు. పుణేలోని ఆర్యన్ పంప్స్‌కు చెందిన ప్రశాంత్ సుతార్ హృతిక్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఆసియా టైటిల్‌తో హృతిక్ ఈ ఏడాది డిసెంబర్‌లో అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగే ప్రతిష్టాత్మక ఎడ్డీ హెర్, ఆరెంజ్ బౌల్ చాంపియన్íÙప్ పోటీలకు కూడా అర్హత సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment