
బ్రెజిల్: జమ్మూ కశ్మీర్‌పై భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని యూరోపియన్ పార్లమెంట్ కొనియాడింది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని, తామెప్పుడూ వారికి అండగా ఉంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన యూరోపియన్ పార్లమెంట్ ప్లీనరీ సమావేశంలో సభ్యులు రిస్జార్డ్ జార్నెక్కి, ఫుల్వియో మార్టుసిఎల్లో ఉగ్రవాదంపై సుధీర్ఘ ప్రసంగం చేశారు. భారత్‌లోకి ఉద్రవాదులు సరిహద్దు దేశం నుంచే ప్రవేశిస్తున్నారని, చంద్రుడి మీద నుంచి కాదని పరోక్షంగా పాక్‌పై మండిపడ్డారు.
సమావేశంలో వారు మాట్లాడుతూ..‘ప్రపంచంలో భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కశ్మీర్‌లో గతకొంత కాలంగా ఉగ్రవాదులు పాల్పడుతున్న ఆకృత్యాలను తాము చూస్తూనే ఉన్నాం. వారంతా భారత్ సరిహద్దు దేశం (పాక్) నుంచే ప్రవేశిస్తున్నారు. చంద్రుడి నుంచి కాదు. ఉగ్రవాదాన్ని అణచివేసే అంశంలో తామెప్పుడూ భారత్‌కు అండగా నిలుస్తాం’ అని వ్యాఖ్యానించారు. కాగా కశ్మీర్ విషయంలో భారత్‌కు అనుకూలంగా ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాకిస్తాన్ అసత్య ప్రచారం చేస్తున్నప్పటికీ అంతర్జాతీయ వేదికలపై అవేవీ చెల్లుబాటుకాలేదు. తాజాగా భారత్‌కు మద్దతుగా యూరోపియన్ యూనియన్ కూడా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment