బెర్లిన్/బ్రసెల్స్: రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే దిశగా జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల కోసం ఏకంగా 113 బిలియన్ డాలర్లు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ప్రకటించారు. దేశ స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రక్షణపై పెట్టుబడులను మరింతగా పెంచాల్సిన అవసరముందని ఆదివారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చెప్పారు.
తాజా ప్రకటనతో రక్షణపై పెట్టుబడులు దేశ జీడీపీలో 2 శాతాన్ని మించాయి. ఉక్రెయిన్‌కు సాయంగా 500 స్టింగర్ మిసైళ్లు, 1,000 యాంటీ ట్యాంక్ వెపన్స్, ఇతర ఆయుధాలు, సామగ్రిని పంపుతున్నట్టు శనివారం రాత్రి జర్మనీ ప్రకటించడం తెలిసిందే. రష్యాపై ఉక్రెయిన్ దాడి యూరప్‌లో రక్షణ విధానాలను తిరగ రాస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జర్మనీ తాజా నిర్ణయమే ఇందుకు నిదర్శనమంటున్నారు. రక్షణపై సరైన మొత్తంలో నిధులు వెచ్చించడం లేదంటూ అమెరికా, నాటో దేశాలు కొంతకాలంగా జర్మనీని విమర్శిస్తూ వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment