defence academy
-
భారత్ ‘తరంగ్ శక్తి’ యుద్ధవిన్యాసాలు (ఫోటోలు)
-
నాకు ఎలాంటి సంబంధం లేదు.. కానీ నాకు అతనితో పరిచయం ఉంది
-
రక్షణకు 113 బిలియన్ డాలర్లు కేటాయించిన జర్మనీ
బెర్లిన్/బ్రసెల్స్: రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే దిశగా జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల కోసం ఏకంగా 113 బిలియన్ డాలర్లు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ప్రకటించారు. దేశ స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రక్షణపై పెట్టుబడులను మరింతగా పెంచాల్సిన అవసరముందని ఆదివారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చెప్పారు. తాజా ప్రకటనతో రక్షణపై పెట్టుబడులు దేశ జీడీపీలో 2 శాతాన్ని మించాయి. ఉక్రెయిన్‌కు సాయంగా 500 స్టింగర్ మిసైళ్లు, 1,000 యాంటీ ట్యాంక్ వెపన్స్, ఇతర ఆయుధాలు, సామగ్రిని పంపుతున్నట్టు శనివారం రాత్రి జర్మనీ ప్రకటించడం తెలిసిందే. రష్యాపై ఉక్రెయిన్ దాడి యూరప్‌లో రక్షణ విధానాలను తిరగ రాస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జర్మనీ తాజా నిర్ణయమే ఇందుకు నిదర్శనమంటున్నారు. రక్షణపై సరైన మొత్తంలో నిధులు వెచ్చించడం లేదంటూ అమెరికా, నాటో దేశాలు కొంతకాలంగా జర్మనీని విమర్శిస్తూ వస్తున్నాయి. -
‘ఇది ఎమ్మెల్యే కాలేజీ.. దిక్కున్నచోట చెప్పుకోండి’
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. విద్యార్థి టీసీ ఇచ్చేందుకు సొమ్ములు డిమాండ్ చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారంటూ బాధితులు విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన మారెడ్డి మణికంఠారెడ్డి విశాఖ నగరం 104 ఏరియాలో ప్రియదర్శిని జూనియర్ కాలేజీగా రిజిస్టరైన వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదివాడు. సబ్జెక్టులు చాలా మిగిలిపోవడంతోపాటు సరైన విద్యా ప్రమాణాలు లేవని, హాస్టల్ వసతి కూడా సరిగ్గా లేదని భావించిన మణికంఠ కుటుంబ సభ్యులు కాలేజీ నుంచి టీసీ తీసుకోవాలని భావించారు. విశాఖ నగరం 104 ఏరియాలోని వైజాగ్ డిఫెన్స్ అకాడమీ కళాశాల ప్రిన్సిపాల్ మంగళవాణిని సంప్రదించిన విద్యార్థి తల్లి మారెడ్డి ఆదిలక్ష్మి తన కుమారుడి టీసీ ఇవ్వాలని కోరారు. టీసీ ఇవ్వాలంటే రూ.30 వేలు చెల్లించాలని ప్రిన్సిపాల్ డిమాండ్ చేశారు. ఫస్టియర్ ఫీజు మొత్తం రూ.1.50 లక్షలు చెల్లించామని, టీసీ కోసం మళ్లీ రూ.30 వేలు అడగటం ఏమిటని ఆదిలక్ష్మి ప్రశ్నించారు. అంతమొత్తం చెల్లించలేమని స్పష్టం చేశారు. దీంతో కళాశాల సిబ్బంది ఒక్కసారిగా జులుం ప్రదర్శించారు. ‘డబ్బు కట్టకపోతే టీసీ ఇచ్చేది లేదు. బయటకు పొండి’ అంటూ బలవంతంగా గెంటివేశారు. ఇదేమిటని ఎదురు తిరిగిన వారిపై ‘ఇది ఎమ్మెల్యే గారి కాలేజీ. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి. మమ్మల్ని ఎవ్వరూ పీకలేరు. ఎక్కువ మాట్లాడితే మీరు గుంటూరు కూడా వెళ్లలేరు’ అని బెదిరింపులకు దిగారు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆదిలక్ష్మి వెంటనే ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రిన్సిపాల్, మేనేజ్మెంట్పై ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఫొటోతో ఉన్న అకాడమీ బోర్డు కేసు దర్యాప్తు చేస్తున్నాం ప్రియదర్శిని కాలేజీగా రిజిస్టరైన వైజాగ్ డిఫెన్స్ అకాడమీపై ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్‌కుమార్ శనివారం తెలిపారు. ఆదిలక్ష్మితో పాటు మరో ముగ్గురు విద్యార్థుల తల్లితండ్రులు కూడా తమపై కళాశాల ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడినట్టు చెప్పారన్నారు. అయితే వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేదని పేర్కొన్నారు. గతంలోనూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన విద్యార్థుల నుంచి ఇదే మాదిరి ఫిర్యాదులు సదరు అకాడమీపై అందాయని, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చెప్పారు. -
తేజస్ డిఫెన్స్ ఆకాడమీ విద్యార్థుల అద్భుత ప్రతిభ
-
ఆర్మీ రిక్రూట్మెంట్: ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల ప్రతిభ
-
రక్షణ రంగంలో ‘బ్రహ్మోస్’ ఫార్ములా
మాస్కో: రష్యా సహకారంతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణుల విజయసూత్రాన్ని భారత రక్షణ రంగంలో మరిన్ని వేదికలకు విస్తరింపజేస్తామని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఇరు దేశాల ఉమ్మడి భాగస్వామ్యంతో రక్షణ పరికరాలు తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రష్యాలో ఐదు రోజుల పర్యటన నిమిత్తం గురువారం రాష్ట్రపతి ప్రణబ్ మాస్కో చేరుకున్నారు. ఈ సందర్భంగా రష్యా వార్తాసంస్థ ‘ఇటార్ టాస్’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య రక్షణ సహకారం ఎంతో ముందుకు వెళ్లిందని ప్రణబ్ వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధంలో విజయానికి సూచికగా రష్యా నిర్వహించనున్న 70వ ‘విక్టరీ డే’ ఉత్సవాల్లో ప్రణబ్ పాల్గొంటారు. శనివారం మాస్కోలో జరగనున్న ఈ వేడుకల్లో 75 మందితో కూడిన భారత సైనిక దళం కూడా పాల్గొననుంది.