బ్రస్సెల్స్: మరో నాలుగు గెలీలియో ఉపగ్రహాలను ఈ ఏడాది చివరిలోగా నింగిలోని కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) భావిస్తోంది. వీటన్నింటిని కూడా నావిగేషన్ కోసం ఉపయోగించనుంది. ఇప్పటికే గత వారంలో రెండు నావిగేషన్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఈయూ చాలా ఉత్సాహంతో కనిపిస్తోంది. సెప్టెంబర్ 2015న నాలుగు గెలీలియో నావిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగిస్తామని, అవి 2016న తాత్కలిక సేవలను ప్రారంభించి 2020 నుంచి పూర్తిస్థాయిలో సేవలను అందిస్తాయని యూరోపియన్ కమిషన్ తెలిపింది.
ఈయూకు చెందిన గెలీలియో శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ జాబితాలో తాజాగా ప్రవేశపెట్టిన రెండు శాటిలైట్స్తో కలిపి మొత్తం ఎనిమిదికి చేరాయి. 2014లో ప్రవేశపెట్టిన రెండు ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి కాకుండా మరో కక్ష్యలోకి వెళ్లడంతో తాజాగా వాటి స్థానంలో కొత్తవాటితో భర్తీ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
నింగిలోకి మరో నాలుగు గెలీలియో శాటిలైట్స్
Published Mon, Mar 30 2015 8:35 AM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM
Advertisement