ఈయూ సభ్యులకు థెరిస్సా గట్టి వార్నింగ్ | Theresa May warns EU she will walk away from a 'bad deal' for Britain | Sakshi
Sakshi News home page

ఈయూ సభ్యులకు థెరిస్సా గట్టి వార్నింగ్

Published Tue, Jan 17 2017 7:19 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

ఈయూ సభ్యులకు థెరిస్సా గట్టి వార్నింగ్

ఈయూ సభ్యులకు థెరిస్సా గట్టి వార్నింగ్

బ్రిటిన్ ప్రధాని థెరిస్సా మే, యూరోపియన్ యూనియన్ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీచేశారు. బ్రిటన్ నిష్క్రమణ సందర్భంగా తమ దేశాన్ని పనికిమాలిన ఒప్పందంలోకి నెట్టాలని చూస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరించారు.  బ్రిటన్కు పనికిమాలిన ఒప్పందం కంటే, ఎలాంటి డీల్ లేకపోవడమే మంచిదని తెలిపారు. డైవర్స్ చర్చల ప్రారంభం కాబోతున్న తరుణంలో మొదటిసారి తమ దగ్గరున్న ప్రణాళికలను థెరిస్సా మే మీడియాకు వివరించారు.
 
బ్రెగ్జిట్ ప్లాన్స్లో థెరిస్సా చెప్పిన కీలక విషయాలు:
  • యూరోపియన్ సింగిల్ మార్కెట్ నుంచి యూకే వైదొలగుతుంది. అయితే అగ్రిమెంట్లో ఉన్న వెసులుబాటు ప్రకారం గూడ్స్ అండ్ సర్వీసుల్లో బ్రిటన్, ఈయూ సభ్య దేశాలకు మధ్య ఉచిత వాణిజ్యం చేసుకునే అవకాశముంటుంది. ఇది బ్రిటన్ కంపెనీలకు యూరోపియన్ మార్కెట్లో ఉచిత వాణిజ్యం చేసుకునేందుకు అవసరమైనంత స్వేచ్ఛను ఇ‍స్తుంది.
  • ఈయూ బడ్జెట్లో యూకే పాలుపంచుకోదు. సింగిల్ మార్కెట్లో తాము సభ్యులం కాకపోవడంతో బడ్జెట్లో కూడా తాము ఎలాంటి మొత్తాన్ని వెచ్చిచం. 
  • పాక్షిక, అసోసియేట్ సభ్యత్వాన్ని తాము కోరడం లేదని థెరిస్సా చెప్పారు. సగం లోపల, సగం బయటం ఉండటం తమకు ఇష్టం లేదు. యూరోపియన్ యూనియన్ నుంచి పూర్తిగా తాము బయటికి వచ్చేస్తాం. స్వతంత్రంగా, స్వీయపాలనతో కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటాం. 
  • బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చే ముందు యూకే పార్లమెంట్ ఫైనల్ డీల్పై ఓటింగ్ నిర్వహిస్తోంది.
  • అయితే ఒకవేళ పార్లమెంట్ బ్రెగ్జిట్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఓటింగ్ నమోదైతే, పరిస్థితి ఏమిటన్నది థెరిస్సా వివరించలేదు. ఆ సమయంలో బ్రెగ్జిట్ ప్రక్రియకు వ్యతిరేకంగా వెళ్లడం కూడా కష్టం. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement