కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడులు ఐదో రోజు కొనసాగుతున్నాయి. మరోవైపు బెలారస్‌లోని ఫ్యాఫిట్ వేదికగా ఉక్రెయిన్-రష్యా బృందాల మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలకు ఉక్రెయిన్ నుంచి ఆ దేశ రక్షణశాఖ మంత్రి హాజరయ్యారు. ఈ చర్చల్లో ఇరు వర్గాలు పలు డిమాండ్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. యూరోపియన్ యూనియన్ ఎదుట కీలక ప్రతిపాదనను ఉంచారు. సోమవారం జెలెన్ స్కీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియోలో తమ దేశానికి వెంటనే యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని జెలెన్‌స్కీ అభ్యర్థించారు. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది తమ లక్ష్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ న్యాయమైన హక్కు అని తాను అనుకుంటున్నానని, ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు పంపాలని యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఉక్రెయిన్‌కు ఫైటర్ జెట్లను అందించాలని నిర్ణయించినట్టు ఈయూ కూటమి విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ తెలిపారు. దీంతో రష్యాపై దాడులను తీవ్రతరం చేసేందుకు ఉక్రెయిన్‌కు ఊహించని మద్దుతు తోడైంది.
Comments
Please login to add a commentAdd a comment