
బ్రస్సెల్స్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగాక ఈయూ, బ్రిటన్ మధ్య సంబంధాలపై చర్చలు జరిపేందుకు ఇరువర్గాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. బ్రిటన్ ప్రధాని థెరెసా బ్రస్సెల్స్‌లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్‌క్లాడ్ జంకర్‌తో చర్చలు జరిపారు.
బ్రిటన్ అధీనంలో ఉన్న ఉత్తర ఐర్లాండ్, ఈయూలో భాగమైన ఐర్లాండ్‌ల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, బ్రిటన్ వైదొలగడానికి సంబంధించిన బిల్లు, పౌరుల హక్కులు తదితరాలపై ఒప్పందానికి వచ్చారు. కాగా, భవిష్యత్తులో మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ అన్నారు. బ్రిటన్, ఈయూ వాణిజ్యానికి సంబంధించిన చర్చలను ప్రారంభించాల్సిందిగా సభ్య దేశాలను కోరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment