948 నుంచి నాగాలు చేస్తున్న పోరాటానికి తెర పడింది. ఎన్ఎస్సీఎన్ (నేషనలిస్టు సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్) లోని రెండు ప్రధాన వర్గాల్లో అతి బలీయమైన టి. ముయివా వర్గంతో కేంద్రం నాగా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్ఎస్సీఎన్లోని రెండో వర్గమైన ఖప్లాంగ్ వర్గం మీద ఇటీవలే బర్మాలో భారత సైన్యం దాడి చేసి, ఆ వర్గాన్ని దాదాపుగా నిర్మూలించింది. దాంతో ముయివా వర్గంతో ఒప్పందం సాధ్యమైంది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ల సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి రవికుమార్ ఈ మేరకు టి.ముయివాతో ఒప్పంద పత్రాలు పంచుకున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో చర్చలు మొదలయ్యాయని ఈ సందర్భంగా టి. ముయివా పేర్కొన్నారు. తర్వాత మాజీ ప్రధాని వాజ్పేయి పరిపాలనా దక్షత కూడా కొంతవరకు ఈ చర్చల ప్రక్రియకు మేలు చేసిందన్నారు.