సాధారణంగా షేర్లలోనూ, షేర్ల ఆధారిత ఫండ్స్‌లోనూ పెట్టుబడులంటే అధిక రాబడులకు అవకాశాలు ఉన్నా అందుకు తగ్గ స్థాయిలో రిస్కులూ ఉంటాయి. ఇక పెట్టుబడులకు పెద్ద రిస్కులు లేని సురక్షితమైన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేద్దామంటే ఫండ్స్ వైపు చూద్దామంటే రాబడులు ఓ మోస్తరు స్థాయిలోనే ఉంటాయి. అలా కాకుండా ఇటు అధిక రాబడులివ్వగలిగే ఈక్విటీలు, అటు సురక్షితమైన డెట్ సాధనాల ప్రయోజనాలను మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పొందాలనుకునే వారికి అనువైనవి హైబ్రీడ్ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ ఆధారిత ఫండ్లు ప్రధానంగా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే.. డెట్ ఆధారిత ఫండ్స్ ప్రధానంగా డెట్ సెక్యూరిటీలు, మనీ మార్కెట్ ఇస్ట్రుమెంట్స్, ట్రెజరీ బిల్లులు, కార్పొరేట్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ రెండు అసెట్స్ ప్రయోజనాలను ఒకే సాధనం ద్వారా అందించగలిగే హైబ్రీడ్ ఫండ్స్‌పై అవగాహన పెంచేదే ఈ కథనం.
హైబ్రీడ్ ఫండ్స్ స్వరూపం ఇదీ..
పెట్టుబడుల కేటాయింపు విధానం, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేష ద్వారా హైబ్రీడ్ ఫండ్స్ తక్కువ నష్టభయంతో ఎక్కువ ఫలితం పొందేందుకు అవకాశం కల్పిస్తాయి. తన కార్పస్ ఫండ్‌లో 65 శాతం నిధులను ఈక్విటీల్లోనూ, మిగతా మొత్తాన్ని డెట్ సాధనాల్లోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్‌ను ఈక్విటీ ఆధారిత హైబ్రీడ్ మ్యూచువల్ ఫండ్‌గా వ్యవహరిస్తారు. దీనికి భిన్నంగా 65 శాతం భాగాన్ని డెట్ సాధనాల్లోనూ, మిగతా మొత్తాన్ని ఈక్విటీల్లోనూ ఇన్వెస్ట్ చేసే ఫండ్‌ను డెట్ ఆధారిత హైబ్రీడ్ మ్యూచువల్ ఫండ్‌గా వ్యవహరిస్తారు. వీటినీ మరికొన్ని రకాలుగా వర్గీకరించారు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి.. సంప్రదాయ హైబ్రీడ్ ఫండ్స్ (10–25 శాతం ఈక్విటీల్లోను, మిగతాది డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేవి), బ్యాలె¯Œ ్సడ్ హైబ్రీడ్ ఫండ్స్ (40–60 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేవి), అగ్రెసివ్ హైబ్రీడ్ ఫండ్స్ (65–80 శాతం షేర్లలో ఇన్వెస్ట్ చేసేవి) మొదలైనవి వీటిలో ఉన్నాయి.
ఈ ఫండ్స్ ఎందుకంటే..
కొత్తగా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామనుకుంటున్న వారు ఇలాంటి ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. మిగతా వాటితో పోలిస్తే పెట్టుబడికి కొంత ఎక్కువ భరోసానివ్వగలిగే హైబ్రీడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో వివిధ రకాల ఫండ్స్ ఉన్నందున తమ రిస్కు సామర్థ్యాన్ని బట్టి అనువైన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఆ అనుభవంతో ఫండ్స్‌లో పెట్టుబడులపై అవగాహన తెచ్చుకోవచ్చు. ఒకవేళ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే.. ఈక్విటీలకు అధిక కేటాయింపులు జరిపే ఫండ్స్ అనువైనవిగా ఉంటాయి. ఈక్విటీల్లో కనీసం 65 శాతం దాకా ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్నులపరమైన ప్రయోజనాలు కూడా లభించవచ్చు. కొత్త ఇన్వెస్టర్లకు, సమయానుకూలంగా ఇన్వెస్ట్ చేసేవారికి ఇవి అనువైనవిగా ఉంటాయి. కాగా ఆయా అంశాలపై మరింత అవగాహనకు అవసరమైతే నిపుణులను సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment