వియత్నాం వ్యవసాయం
ఆకలి తీర్చే ఆహారం ఆర్గానిక్ పద్ధతిలో పండించినది అయితే బావుంటుందని అంటోంది ప్రపంచం. ధర ఎక్కువే అయినా క్రిమిసంహారకాలు ఇతర రసాయనాలు వాడకుండా సహజసాగుతో పండించిన కాయగూరలకు, పండ్లకు గిరాకీ పెరుగుతోంది. దీంతో ఆర్గానిక్ ఫార్మింగ్ విస్తృతమవుతోంది. వియత్నాంలోని హనోయ్ శివార్లలోని సేంద్రియ వ్యవసాయ క్షేత్రాల్లో ఇది ఒకటి.