సాక్షి, హైదరాబాద్: ఐస్‌క్రీం అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో వీటికున్న క్రేజ్ వేరు. రోడ్లపై ఐస్‌క్రీం కనపడితే కొనిచ్చేంత వరకు పిల్లలు మారాం చేస్తుంటారు. ఇక వేసవి వచ్చిందంటే చాలు.. హాట్ హాట్ సమ్మర్‌లో కూల్ కూల్‌గా ఐస్‌క్రీం తినాలనిపిస్తుంది. అందుకు ఈ సీజన్‌లో ఐస్‌క్రీంలకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది.
అయితే కొందరు వ్యాపారులు దీన్నే క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. హానికరమైన రసాయనాలతో ఐస్‌క్రీంలను తయారీ, నకిలీ ఐస్‌క్రీంలపై బ్రాండెడ్ స్టిక్కర్లతో అమ్మకాలు జరుపుతున్నారు. ప్రజలు ప్రాణాల పణంగా, లాభాలే ప్రధాన అజెండాగా వ్యాపారం చేస్తున్నారు. భారీగా లాభాలు ఆర్జించేందుకు కల్తీ దారిని ఎంచుకుంటున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
తాజాగా చిన్న పిల్లలు తినే ఐస్ క్రీం ను కూడా కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడో వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్ లోని చందానగర్‌లో వెలుగులోకి వచ్చింది. హానికరమైన రసాయనాలతో నకిలీ ఐస్‌క్రీమ్‌లను తయారుచేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న ముఠా గుట్టు రట్టైంది. పోలీసులు జరిపిన దాడిలో బ్రాండెడ్ పేర్లతో నకిలీ ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో షాపులోని సరుకు సీజ్ చేసి నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తస్మాత్ జాగ్రత్త భాగ్యనగర ప్రజలారా!
Comments
Please login to add a commentAdd a comment