సిరి ధాన్యాలను ఎందుకు తినాలి? | Why do ye eat grains? | Sakshi
Sakshi News home page

సిరి ధాన్యాలను ఎందుకు తినాలి?

Published Sun, Dec 30 2018 12:00 AM | Last Updated on Sun, Dec 30 2018 12:00 AM

Why do ye eat grains? - Sakshi

ఆధునిక రోగాల నివారణలో సిరిధాన్యాలు ఎంతో కీలక పాత్ర వహిస్తున్నాయి. మనకు, మన ముందు తరాల వారికీ, మన భూములకూ,  వాతావరణానికి, మన ఆరోగ్యాలకూ ఇవి ఒక వరం. ప్రపంచానికే మార్గదర్శకంగా తిరిగి పరిచయం అవుతున్నాయి ఈ సిరిధాన్యాలు. 

సిరి ధాన్యాలు ఎందుకు తినాలి ...
తరతరాల సంకరం తర్వాత వరి, గోధుమ పంటల్లో పీచు పదార్థం(ఫైబర్‌)  తక్కువైపోయింది. ఎరువులూ, పురుగు మందులూ లేని వరి అన్నం, గోధుమలూ కరవయ్యాయి. వాటికి తోడు విషపూరితమైన కలుపు మందుల వాడకం  పెరిగిపోయింది. మన ఆహారంలో ఉన్న సహజపీచు పదార్థమే (డైటరీ ఫైబర్‌)  ఆహారం నుంచి రక్తంలోకి గ్లూకోజ్‌ విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుంది. ఒకేసారిగా అధిక మొత్తంలో గ్లూకోజ్‌ను విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుంది. ఒకేసారిగా అధిక మొత్తంలో గ్లూకోజ్‌ను విడుదల చేయాలా లేదా చిన్న మొత్తాలలో కొద్దిగంటల పాటు విడుదల చేయాలా అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది.ప్రస్తుతం వరి, గోధుమ ఆహారపదార్థాలలో పీచు పదార్థం  0.25 శాతం– 0.5 శాతానికి తగ్గిపోయింది. అందుకే ఇవి తిన్న 15–35 నిమిషాలలో గ్లూకోజ్‌ (చక్కెరగా–అంటే జీర్ణమైన ఆహారానికి చివరి స్థితిగా)గా మారిపోయి, 100 గ్రాముల ఆహారం తింటే 70 గ్రాముల గ్లూకోజ్‌ (చక్కెర)గా ఒక్కసారిగా రక్తంలోకి వచ్చి చేరుతోంది. ఇలా రోజుకి మూడు, నాలుగు సార్లు జరిగితే ఎలా? వీటికి తోడుగా స్వీట్లు తింటే? బర్గర్, పిజ్జాలు మైదాతో చేసిన నాన్‌ రొట్టె కూడా తోడైతే? అధిక మొత్తాలలో గ్లూకోజు ఒకేసారిగా రక్తంలోకి చేరుకొని చేటు చేస్తుంది. కొవ్వు పెంచుతుంది. చక్కెర వ్యాధి ఉన్న వాళ్లని కష్టపెడుతుంది. అనేక రోగాలకు దారి తీస్తుంది.

మైదాతో చేసిన పదార్థాలు మరీ ఘోరంగా 10 నిమిషాలలో గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తాయి. మైదా తయారీలో వాడే రసాయనాలు కూడా మన క్లోమ గ్రంధికి ఎంతో హానికరం. మన దేహంలోని రక్తంలో ఉండే గ్లూకోజ్‌ 6–7 గ్రాములే. ఆహారం తిన్న తరువాత అది జీర్ణమై, చివరికి గ్లూకోజ్‌గా మారి, రక్తంలోకి  రావటం, దేహమంతా సరఫరా అవటం మామూలే. కానీ ఒక్కసారిగా 10 నిమిషాల్లో లేదా 30–40 నిమిషాలలో అధిక మొత్తంలో రావటం ఎవరి ఆరోగ్యానికీ మంచిది కాదు. పెద్దలకూ, మధుమేహం ఉన్న వారికీ, ఇతర రోగగ్రస్తులకూ (మలబద్దకం, ఫిట్స్, మొలలు, మూల శంక, ట్రైగ్లిసరైడ్స్, అధిక రక్తపీడనం అంటే బీపీ, మూత్రపిండాల రోగులు, హృద్రోగులు వగైరా అందరికీ) మరింత చేటు.అందుకే పీచు తక్కువగా ఉన్న లేదా పీచు అసలు లేని మైదా వంటి వాటిని దూరం పెట్టాలి. సిరిధాన్యాలు అలవాటు చేసుకోవాలి. ఇవి 5 నుంచి 7 గంటల పాటు కొద్ది కొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోజ్‌ను రక్తంలోకి వదులుతుంటాయి. కొర్ర బియ్యం, అరిక బియ్యం, ఊద బియ్యం, సామ బియ్యం, అండు కొర్ర బియ్యం 8 నుంచి 12 శాతం పీచు పదార్థం కలిగినవి. పూర్తిగా సేంద్రియమైనవి. ఈ ఐదూ ‘పంచరత్న సిరి ధాన్యాలు’గా  ‘పాలిష్‌ చేయబడనివి’గా మరింత శ్రేష్ఠమైనవి. వీటితో అన్నం వండుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోస, బిర్యానీ, బిసిబేళ బాత్‌ కూడా చేసుకోవచ్చు.

సిరి ధాన్యాలు ఎందుకు తినాలి ...
 మూడు పూటలా తిన్నప్పుడు ఆ రోజుకు మనిషికి అవసరమైన 25–30 గ్రాముల ఫైబర్‌ (ప్రతి మానవుడికీ రోజుకు 38 గ్రాముల ఫైబర్‌ కావాలి) ఈ ధాన్యాల నుంచే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములూ కూరగాయల నుండి, ఆకుల కూరల నుంచి పొందవచ్చు.ఒక్కొక్క సిరిధాన్యం కొన్ని రకాల దేహపు అవసరాలనూ, ప్రత్యేకమైన రోగనిర్మూలన శక్తినీ కలిగి ఉన్నాయి. వరి, గోధుములలో పీచు పదార్థం 0.2 నుంచి 1.2 వరకూ ఉన్నప్పటికీ, అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పాలిష్‌ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలతో పీచుపదార్థం లేదా ఫైబర్‌ ధాన్యపు కేంద్రం నుండి బయటి వరకూ, పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తి దోహదం చేస్తాయి. ఉదాహరణకి కొర్ర బియ్యం– సమతుల్యమైన ఆహారం. 8 శాతం ఫైబర్‌తో పాటు 12 శాతం ప్రోటీన్‌ కూడా కలిగి ఉంది. గర్భిణులకు సరైన ఆహారంగా సూచించవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగొట్టే సరైన ధాన్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్ఛలు వస్తాయి. వాటిని పోగొట్టగలిగే లక్షణం, నరాల సంబంధమైన బలహీనతకు  సరైన ఆహారం కొర్ర బియ్యం. కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, ఉదర క్యాన్సర్‌ ,పార్కిన్సన్, ఆస్తమాను నివారించడంలో కూడా కొర్రబియ్యం దోహదపడుతుంది.పాశ్చాత్య దేశాల్లో, వారి ఆహారంలో ఫైబర్‌ లేదని గ్రహించి, 2–3 ఫైబర్‌ టాబ్లెట్‌లను నీటిలో వేసుకుని సేవిస్తూ ఉంటారు. అది శాస్త్రీయమైనది కాదు. సహజంగా ఆహారంలోనే ఫైబర్‌ ఇమిడి ఉండటం మాత్రమే రక్తంలోకి గ్లూకోజు విడుదలని సమర్థవంతంగా నియంత్రించగలదు.ఇలాగే  అరికలు బియ్యం.... రక్త శుద్ధికీ, ఎముకల మజ్జ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకూ, అస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేటు, రక్త క్యాన్సర్, ప్రేగులు, థైరాయిడ్, గొంతు క్లోమ గ్రంధుల, కాలేయపు క్యాన్సర్‌లూ తగ్గించుకోవడానికి అరికలు ఎంతో మేలు చేస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్, వైరస్‌ జ్వరం వగైరాల తర్వాత నీరసించిన వారి రక్త శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికలు.

సామ బియ్యం
మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులను బాగుచేస్తాయి. ఆడవారిలో pఛిౌఛీ తగ్గించుకోవచ్చు. మగ వారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. ఇవి కాక మానవుడి లింఫు మండలపు శుద్ధికి సామలు ఎంతో పనికి వస్తాయి.

ఊద బియ్యం
 థైరాయిడ్, క్లోమ గ్రంధులకు మంచివి. చక్కెర వ్యాధిని పారదోలుతాయి. కాలేయం, మూత్రాశయం, గాల్‌ బ్లాడర్‌ శుద్ధికి కూడా ఇవి పనిచేస్తాయి. కామెర్లను తగ్గించడానికి, వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయం, గర్భాశయ క్యాన్సర్‌లను తగ్గించడానికి  పనిచేస్తాయి.

ఊద బియ్యం
జీర్ణ మండలంలోని కష్టాలను తీసివేస్తాయి. మొలలూ, భగన్దరం, మూల శంక, జజీటటuట్ఛటఅల్సర్‌లు, మెదడు, రక్త, స్తనాలు, ఎముకల, ఉదర, ప్రేగుల, చర్మ సంబంధమైన క్యాన్సర్‌... మొదలైన సమస్యలను పోగొట్టడంలో తమ పాత్రను అద్భుతంగా పోషిస్తాయి.
(మరింత సమాచారం లోపలి పేజీల్లో)
డాక్టర్‌ ఖాదర్‌ వలి
ఆరోగ్య–ఆహార నిపుణులు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement