grains
-
50 లక్షల టన్నుల సన్నాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కోసం పౌర సరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. దసరా పండుగ తర్వాత వరి కోతలు మొదల య్యే అవకాశమున్న నేపథ్యంలో.. జిల్లాల్లోని పౌర సరఫరాల శాఖ, కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అదనపు కలెక్టర్ల నేతృత్వంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ డిసెంబర్ నెలాఖరు వరకు సాగనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో (హైదరాబాద్ మినహా) 7,185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ శాఖ వివరాల ఆధారంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో 60.8 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. మొత్తంగా 146.70 లక్షల మెట్రిక్ టన్నులు (ఎంఎల్టీ) దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 91 లక్షల టన్నుల మేర కొనుగోలు కేంద్రాలకు వస్తుందని.. అందులో 50 లక్షల టన్నుల మేర సన్న ధాన్యం వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ నుంచి ఆయా వివరాలు తీసుకొని జిల్లాల వారీగా సన్నాల కోసం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. మొత్తంగా 7,185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. ఇందులో సగానికిపైగా సన్న ధాన్యం సేకరణ మాత్రమే చేస్తాయని ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు.వ్యవసాయ శాఖ లెక్కల ఆధారంగా జిల్లా కలెక్టర్లే సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఐకేపీ, పీఏసీఎస్‌తోపాటు ఇతర సహకార సంఘాల నేతృత్వంలో కొనుగోలు కేంద్రాలు ఉంటాయన్నారు. ఎంపిక చేసిన రకాలు, కొలతలతో.. ‘బోనస్’ రాష్ట్రంలో పండించే ధాన్యానికి కనీస మద్ధతు ధర గ్రేడ్–ఏ రకాలకు రూ.2,320 సాధారణ రకాలకు రూ.2,300గా నిర్ణయించారు. సన్నరకాలకు రూ. 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఆయా రకాల ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 2,800 చొప్పున చెల్లించనున్నారు. వ్యవసాయ శాఖ ఇప్పటికే 33 రకాలను సన్నాలుగా గుర్తించింది. బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్– 15048, హెచ్ఎంటీ, సో నా, జైశ్రీరాం తదితర రకాలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇవేకాకుండా.. బియ్యం గింజ పొడ వు 6 మిల్లీమీటర్లు, వెడల్పు 2 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉన్న ఇతర రకాలను కూడా సన్నాలుగా గుర్తిస్తారు. బియ్యం గింజ పరిమాణాన్ని గుర్తించడానికి ‘గ్రెయిన్ కాలిపర్’యంత్రాలను వినియోగిస్తా రు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల కోసం అవసరమైన గ్రెయిన్ కాలిపర్లను కొనుగోలు చేసినట్లు ప్రొ క్యూర్‌మెంట్ విభాగం అధికారి ఒకరు తెలిపారు. పెరిగిన సన్నాల సాగు..సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. చాలా జిల్లాల్లో సన్నాల సాగు పెరిగింది. వ్యవసాయ శాఖ నిర్దేశించిన 33 రకాల్లో మేలిమి రకమైన హెచ్ఎంటీ, జైశ్రీరాం వంటివాటితోపాటు ఎక్కువ దిగుబడి ఇచ్చే బీపీటీ లోని పలు వెరైటీలను రైతులు భారీ ఎత్తున సాగు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో వరి వేసిన 45 వేల ఎకరాల్లో పూర్తిస్థాయిలో సన్నాల సాగే జరగగా.. పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, మహబూ బాబాద్, మంచిర్యాల జిల్లాల్లోనూ సన్నాల సాగు ఎక్కువగా జరిగింది. జనవరి నుంచే రేషన్ దుకాణాలకు ఇవ్వాలని భావిస్తున్న సన్న బియ్యానికి అవసరమైన ధాన్యం సమకూరుతుందని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది. -
పొట్ట రాకూడదా? పొట్టు తియ్యద్దు మరి!
పొట్టు తీయని ధాన్యాల (హోల్ గ్రేయిన్స్)లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయన్నది తెలిసిందే. ఈ పొట్టు కారణంగానే అవి చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంటాయి. అందుకే వాటిల్లోంచి వచ్చే కార్బోహైడ్రేట్లు రక్తంలో నెమ్మదిగా కలుస్తుంటాయి. ఫలితంగా ఒంట్లోకి విడుదలయ్యే చక్కెర మోతాదులూ ఆలస్యమవుతాయి. పొట్టుతీయని వరి విషయంలో ముడి బియ్యం మాదిరిగానే పొట్టు తీయని ఓట్స్, గోధుమ, బార్లీ వంటి వాటిని అలాగే తీసుకోవడం వల్ల పొట్టుతీసిన వాటితో పోలిస్తే తక్కువగా బరువు పెరుగుతారని, అందువల్ల ఇన్సులిన్ విడుదల యంత్రాంగం కూడా నియంత్రితంగా పనిచేస్తూ పూర్తిస్థాయి ఆరోగ్యకరంగా ఉంటుందంటున్నారు పరిశోధకులు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ప్రచురితమైంది. ∙ఇలా తినడం వల్ల ఊబకాయం తగ్గడంతో ΄ాటు స్థూలకాయంతో వచ్చే అనేక అనర్థాలనూ తగ్గించుకోవచ్చన్నది పరిశోధకుల మాట. -
మిల్లెట్స్‌ను ప్రోత్సహిస్తే.. లాభాలు మెండు!
తెలంగాణ దక్కను పీఠభూమిప్రాంతంలో వర్షాధారంగా వ్యవసాయం చేసే సన్న, చిన్నకారు రైతులు సంఘంగా ఏర్పడటం.. సేంద్రియ సేద్య పద్ధతిని అనుసరించటం.. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు తదితర పంటలను కలిపి సాగు చేయటం.. సంఘటితంగా మార్కెటింగ్ చేసుకోవటం నిస్సందేహంగా బహువిధాలా లాభదాయకమే! సంఘటితమైన చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు తాము పండిస్తున్న పౌష్టికాహారాన్ని తింటూ.. మిగతా దిగుబడులు విక్రయిస్తూ మంచి నికరాదాయం కూడా పొందగలుగుతున్నారని, పనిలో పనిగా భూసారాన్ని కూడా పెంపొందించుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెస్’ జరిపిన తాజా అధ్యయనం చెబుతోంది.డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)ప్రోత్సాహంతో మహిళా రైతుల స్వయం సహాయక సంఘాలు అనుసరిస్తున్న సేంద్రియ సేద్య నమూనా సాధిస్తున్న విజయాలపై ‘సెస్’ ఇటీవలే అధ్యయనం చేసింది. సహకార స్ఫూర్తిని చాటిచెబుతున్న ఈ అధ్యయన వివరాలు..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత గ్రామాల్లో డీడీఎస్ చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల మిశ్రమ సాగును చాలాకాలంగాప్రోత్సహిస్తోంది. సాగులో అడుగడుగునా ఈ మహిళా రైతులకు తోడుగా ఉండటంతో పాటు మార్కెట్లో మద్దతు ధరకు తానే సేకరించి, ్రపాసెస్ చేసి ఏడాది పొడవునా హైదరాబాద్, జహీరాబాద్ప్రాంతాల్లో ప్రజలకు విక్రయిస్తోంది డీడీఎస్. సంఘటిత శక్తి వల్ల ఈ రైతులు ఎకరానికి రూ. 6 వేలకుపైగా నికరాదాయం పొందుతున్నారు.అయితే, కొందరు రైతులు డీడీఎస్‌తో సంబంధం లేకుండా చిరుధాన్యాలను పండించి వ్యక్తిగతంగా మార్కెట్లో అమ్ముకుంటూ నష్టాల పాలవుతున్నారని హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ సైన్సెస్ (సెస్) ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది.సెస్ సంచాలకురాలు ఇ. రేవతి, అసోసియేట్ ప్రొఫెసర్ బి.సురేశ్ రెడ్డి, అసిస్టెంట్‌ప్రొఫెసర్ పెద్ది దయాకర్‌ల బృందం 2024 జనవరిలో జహీరాబాద్, ఝరాసంగం, కోహిర్, న్యాల్కల్, మొగడంపల్లె మండలాల్లోని 34 గ్రామాల్లో 1,100 మంది రైతుల వ్యవసాయ అనుభవాలపై ఇంటింటి సర్వే చేసింది. ఈ అధ్యయనంలో గుర్తించిన అంశాలతో ‘సెస్’ పరిశోధనా నివేదికను వెలువరించింది.సర్వే జరిగిన గ్రామాల్లో ప్రధానంగా వర్షాధారంగానే పంటలు సాగు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు చిరుధాన్యాలు తదితర పంటలను రసాయనిక పద్ధతిలో కాకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, ఊదలు వంటి చిరుధాన్యాలతో పాటు కందులు, పెసలు, మినుములు, ఉలవలు, సోయా, మిరప, మొక్కజొన్న, అల్లం, పత్తి, పసుపు వంటి పంటలను సాగు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో 80% మంది రైతులు తమ చిన్న చిన్న కమతాల్లో ఏదో ఒక పంటను కాకుండా కనీసం 8 రకాల పంటలు కలిపి పండిస్తున్నారు.డీడీఎస్‌తో సంబంధం లేకుండా చిరుధాన్యాలను సాగు చేసే రైతులకు ఎకరానికి అయిన ఖర్చు రూ. 11,893. అయితే, డీడీఎస్ సహకార సంఘాల సభ్యులైన మహిళా రైతులకు చిరుధాన్యాలు తదితర కలిపి పంటల సాగుకు ఎకరానికి అయిన ఖర్చు రూ. 10,218 మాత్రమే. చిరుధాన్యాలు తదితర పంటలు కలిపి పండించిన రైతులకు మొత్తం ఖర్చులో 70% కూలీల ఖర్చే. చిరుధాన్యేతర పంటల రైతులకు అయిన కూలీల ఖర్చు 39% మాత్రమే.చిరుధాన్యేతర పంటల సాగు ఖర్చులో 43% విత్తనానికి అవుతుంది. రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఖర్చు అదనం. డీడీఎస్‌తో సంబంధం లేకుండా చిరుధాన్య పంటలు సాగు చేసే రైతులు విత్తనాలకు 12% ఖర్చు పెడుతున్నారు.డీడీఎస్ సంఘాల్లో రైతులు విత్తనాలకు 10% ఖర్చు చేస్తున్నారు. వీరు సేంద్రియ ఎరువుల కోసం మొత్తం ఖర్చులో 15% వెచ్చిస్తున్నారు. బోరాన్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలను భూమికి అందిస్తున్నారు. రసాయనిక వ్యవసాయంలో చిరుధాన్యాలు సాగు చేస్తున్న సంఘటితం కాని రైతులకు మార్కెట్లో సరైన ధర రాక ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువ అవుతుండటం గమనార్హం.అయితే, డీడీఎస్ సహకార సంఘాల్లో ఉన్న సేంద్రియ రైతులకు మాత్రం డీడీఎస్ సంస్థాగత తోడ్పాటు.. మార్కెటింగ్ మద్దతు, వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి వల్లే రైతులకు అధికాదాయం వస్తోందని సెస్ నివేదిక తెలిపింది. ఇదిలా ఉండగా, ‘చిరుధాన్యేతర’ (పత్తి తదితర) పంటలను సాగు చేసే రైతులకు అన్నీ అనుకూలిస్తే రూ. 12 వేలకు పైగా నికారదాయం వస్తోంది. అను కూలించకపోతే ఏకపంటలు సాగు చేసే ఈ రైతులకు పెట్టుబడి నష్టం ఎక్కువగా ఉంటుంది.చిరుధాన్యాల రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి..వర్షాధారంగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలను పండించే చిన్న, పెద్ద రైతులు సమజానికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. వాతావరణ మార్పుల్ని తట్టుకుంటూ భూసారాన్ని పెంపొందిస్తున్నారు. పర్యావరణానికీ మేలు చేస్తున్నారు.ఈ మెట్ట రైతుల విశేష కృషికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చే విధంగా బలమైన విధాన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రైతులకు ఎకరానికి కనీసం రూ. 2–3 వేలు ప్రత్యేకప్రోత్సాహకంగా ఇవ్వాలి. అన్ని రకాల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలకు కనీస మద్దతు ధరలు ప్రకటించాలి. మిల్లెట్ రైతుల ఎఫ్పిఓలు, సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలకు ప్రత్యేక సుదుపాయాలు ఇవ్వటం ద్వారా ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి.నీటిపారుదల రైతులతో పోల్చితే వీరికి అధిక ్రపాధాన్యం ఇచ్చేలా గట్టి చట్టాలు తేవాలి. ఈ చర్యలతో చిరుధాన్యాల, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగి, ప్రజలకు మరింత సరసమైన ధరలకు లభిస్తాయి. – డా. బి.సురేశ్ రెడ్డి (95505 58158), అసోసియేట్ ప్రొఫెసర్, సెస్, హైదరాబాద్ -
నవధాన్యాలతో జవసత్వాలు
పిఠాపురం: అధునాతన వ్యవసాయంలో మితిమీరిన రసాయనాలు వాడడం వల్ల పసిడి పంటలు పండే భూములు సహజ శక్తిని కోల్పోయాయి. అలాంటి పరిస్థితుల్లో నేలలను పునరుజ్జీవింప చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూములను సారవంతం చేసే దిశగా అడుగులు వేయాలని, ఎరువులు.. పురుగు మందులకు చెక్ పెట్టి ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.దీంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూసారం సాధించే దిశగా నవ ధాన్యాల సాగుకు ప్రభుత్వం తోడ్పాటు ఇచ్చే చర్యలు తీసుకుంది. పచ్చి రొట్ట సాగుతో పచ్చని పంటలు పండే విధంగా ప్రకృతి వ్యవసాయంపై అధికారులు రైతుల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. నవ ధాన్యాల సాగుతో భూసారం పెంపువివిధ కారణాలతో క్రమంగా భూములు తమ బలాన్ని కోల్పోతున్నాయి. దీంతో సూక్ష్మ పోషక లోపాలు బయటపడుతున్నాయి. ఫలితంగా భారీ పెట్టుబడులు పెట్టినా ఆశించిన దిగుబడులు రాని పరిస్థితి నెలకొంది. పెట్టుబడులు పెరిగి గిట్టుబాటు కాక రైతులు నష్టపోతున్నారు. రానున్న రోజుల్లో భూసారం లేక ఏ పంటలు వేసినా పండని పరిస్థితులు నెలకొననున్నాయి. వాటిని అధిగమించడానికి నవ ధాన్యాల సాగు చేపట్టారు. వీటిని సాగు చేసి భూమిలో కలియ దున్నడం వల్ల భూమిలో సూక్ష్మ పోషక విలువలు వృద్ధి చెంది, భూసారం పెరిగి ఏది సాగు చేసినా బాగా పండుతుంది.భూమి సారవంతంగా ఉండేందుకు దోహద పడే సూక్ష్మ జీవులు వృద్ధి చెంది నత్రజని స్థిరీకరణ జరిగి మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరిగి భూసారాన్ని మరింత పెంచుతాయి. చౌడు సమస్యను నివారించడంతో పాటు నేల నుంచి వచ్చే తెగుళ్లను సైతం ఈ పైర్లు అరికడతాయి. నవ ధాన్యాలు సాగు చేసి దున్నిన భూమిలో పండించిన ధాన్యంలో పోషకాల విలువలు పెరిగినట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో నిర్ధారించారు. నవ ధాన్యాల సాగునవ ధాన్యాలు అంటే నవగ్రహాల పూజలకు వాడే ధాన్యాలుగానే చాలామందికి తెలుసు. కేవలం దైవ పూజలకు మాత్రమే వాడే నవ ధాన్యాలు ఇప్పుడు రైతుకు వరంగా మారాయి. గోధుమలు, వరి, కందులు, పెసలు, మినుములు, శనగలు, బొబ్బర్లు, నువ్వులు, ఉలవలు వంటి తొమ్మిది రకాల నవ ధాన్యాలు ఇప్పుడు భూసార పెంపులో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. వీటితో పాటు మరో 22 రకాల ధాన్యం రకాల విత్తనాలను ప్రభుత్వం రైతులకు పంపిణీ చేస్తోంది.పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు తదితర సహజంగా లభించే ఎరువులు సామాన్య రైతుకు లభ్యం కావడం భారంగా మారింది. వాటి స్థానంలో ప్రతీ రైతుకు అందుబాటులో ఉండే సహజ సిద్ధ ఎరువుల తయారీకి నవ ధాన్యాల సాగు ఒక వరంగా మారింది. జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చి రొట్ట సాగుతో పాటు నవ ధాన్యాల సాగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తొమ్మిది రకాల ధాన్యాలను రబీకి చివరిలో జల్లుకుని కోతలు పూర్తయ్యాక వాటిని కలియదున్నడం ద్వారా భూసారాన్ని పెంచుకోవచ్చు. ఈ విషయంలో అధికారుల సూచనలు, సలహాలతో రైతులు నవ ధాన్యాల సాగు చేపట్టారు.కాకినాడ జిల్లాలో నవ ధాన్యాల సాగు లక్ష్యం– 53,253 ఎకరాలుసాగు చేయడానికి నిర్ణయించిన రైతుల సంఖ్య– 49,895 ఇప్పటి వరకు సాగయిన భూములు – 26,846 ఎకరాలువిత్తనాలు తీసుకున్న రైతులు – 26,680 మందిపంపిణీ చేసిన విత్తనాలు – 26 టన్నులుసాగు చేసిన రైతులు – 26,564 మంది పంపిణీ చేస్తున్న విత్తనాలు – 31 రకాలుమంచి ఫలితాలు కనిపిస్తున్నాయిగత ఏడాది అధికారులు ఇచ్చిన విత్తనాలు చల్లి కలియ దున్నడం వల్ల చాలా వరకు ఎరువుల వాడకం తగ్గింది. పూర్వం పశువుల పెంటతో పాటు పచ్చిరొట్ట ఎరువులు వాడే వారు. రానురాను వాటిని మానేసి రసాయనిక ఎరువులు వాడడం ప్రారంభించాక పెట్టుబడులు పెరిగిపోయాయి. మళ్లీ ఇప్పుడు నవధాన్యాలు నాటి దున్నడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయంలో ప్రభుత్వం రైతులకు మంచి అవకాశాలు కల్పిస్తోంది.నవ ధాన్యాల సాగు రైతులకు చాలా మంచిది. వీటి వల్ల పెట్టుబడులు తగ్గడంతో పాటు రసాయనిక ఎరువులు లేని పంటలు అందుబాటులోకి వస్తాయి. నేను రెండు ఎకరాల్లో నవ ధాన్యాల సాగు చేశాను. ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు ఇవ్వడంతో పాటు ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇవి సాగు చేయడం వల్ల భూమి సారవంతం కావడంతో ఎరువులు పెద్దగా వేయాల్సిన అవసరం లేకుండా తక్కువ పెట్టుబడితో నాణ్యత గల పంటలు వస్తున్నాయి. – వారణాశి కామేశ్వరశర్మ, నర్శింగపురం, పిఠాపురం మండలంజిల్లాలో 53 వేల ఎకరాల్లో నవ ధాన్యాల సాగు లక్ష్యంజిల్లాలో ఈ ఏడాది సుమారు 53 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ శాఖ ద్వారా నవ ధాన్యాల సాగుకు లక్ష్యంగా నిర్ణయించాం. ఇప్పటికే 26 టన్నుల విత్తనాలు పంపిణీ చేయగా 26 వేల మంది రైతులు తమ పొలాల్లో 25 వేల ఎకరాల్లో విత్తనాలు వేసుకుని నవ ధాన్యాల సాగు చేపట్టారు. రబీ పంట చివరిలో నవ ధాన్యాలను చల్లి మొక్కలు ఏపుగా పెరిగిన తరువాత ఖరీఫ్‌కు ముందు కలియ దున్నడం వల్ల భూముల్లో పోషక విలువలు వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. తద్వారా రసాయనిక ఎరువుల వాడకం తగ్గడంతో పాటు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంటలు పండించగలుగుతారు.ఇలా నాలుగు సంవత్సరాలు నవ ధాన్యాలు సాగు చేసి దున్నడం వల్ల భూసారం సహజ సిద్ధంగా పెరిగి రసాయనిక ఎరువుల అవసరం లేకుండా పంటలు పండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అన్ని గ్రామాల్లోను రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా చైతన్యం తీసుకువచ్చాం. ప్రభుత్వం విత్తనాల పంపిణీ చేస్తుండడంతో రైతుల ముందుకు వస్తున్నారు. త్వరలోనే లక్ష్యం పూర్తి చేస్తాం. ఎకరానికి 10 కేజీల చొప్పున విత్తనాలు రైతులకు పంపిణీ చేస్తున్నాం. – ఎలియాజరు, జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి, కాకినాడ -
రోజూ మిల్లెట్స్ తింటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి
తెలుగు రాష్ట్రాలు వేగంగా మిల్లెట్స్ గొడుగు కిందకు చేరుతున్నాయి. ఇది అన్ని ట్రెండ్స్‌లా ఇలాగ వచ్చి అలాగ వెళ్లిపోరాదు.ఎన్నో వసంతాల పాటు మనతో పాటు చిగురించాలి. మిల్లెట్స్ ఆహారంలో భాగమవుతున్నంత వేగంగా కనుమరుగయ్యే ప్రమాదమూ ఉంది. ఎందుకంటే మనం మిల్లెట్స్ వాడకంలో చూపిస్తున్న అత్యుత్సాహం వాటిని అర్థం చేసుకోవడంలో చూపించడం లేదంటున్నారు ఇక్రిశాట్లో అగ్రానమిస్ట్గా ఉద్యోగవిరమణ చేసి, హైదరాబాద్, బోయిన్పల్లి, ఇక్రిశాట్ కాలనీలో విశ్రాంత జీవనం గడుపుతున్నసీనియర్ సైంటిస్ట్ మేకా రామ్మోహన్ రావు. ఇదీ నా పరిచయం! మాది కృష్ణాజిల్లా, పాగోలు గ్రామం పరిధిలోని మేకావారి పాలెం. బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్‌లో ఏజీ బీఎస్సీ. హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీ రంగా (ఇప్పుడది ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ) అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో వ్యవసాయ పద్ధతుల మీద పరిశోధన చేశాను. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇక్రిశాట్లో ఒకడినయ్యాను. ఒక మోస్తరు వ్యవసాయ కుటుంబం మాది. మా కుటుంబంలో తొలితరం విద్యావంతుడిని కావడంతో ఏ కోర్సులు చదివితే ఎలాంటి ఉన్నత స్థితికి చేరవచ్చని మార్గదర్శనం చేయగలిగిన వాళ్లెవరూ లేరు. ఢిల్లీకి వెళ్లి పీహెచ్డీ చేయడం కూడా మా ప్రొఫెసర్ గారి సూచనతోనే. మా నాన్న చెప్పిన మాట నాకిప్పటికీ గుర్తే. కాలేజ్ ఖర్చులు భరించి చదివించగలనంతే. డొనేషన్లు కట్టి చదివించాలని కోరుకోవద్దు’ అన్నారాయన. ఆ మాట గుర్తు పెట్టుకుని విస్తరణకు ఉన్న అవకాశాలను వెతుక్కుంటూ సాగిపోయాను. నా ప్రాథమిక విద్య ఏ మాత్రం స్థిరంగా సాగలేదంటే నమ్ముతారా! ఐదవ తరగతి లోపు మూడుసార్లు స్కూళ్లు మారాను. హైస్కూల్ కూడా అంతే. చల్లపల్లి స్కూల్లో పన్నెండవ తరగతి వరకు చదివాను. జాతీయ పతాక ఆవిష్కర్త పింగళి వెంకయ్యగారు కూడా చల్లపల్లి స్కూల్లోనే చదివారు. – మేకా రామ్మోహన్రావు, సీనియర్ సైంటిస్ట్ (రిటైర్డ్), ఇక్రిశాట్ జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకున్నాం! ‘‘ఇప్పుడు నేను చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం గురించి పని చేస్తున్నాను. కానీ నా అసలు వృత్తి చిరుధాన్యాల సాగు. పటాన్చెరులో మా పరిశోధన క్షేత్రం. మనదేశంలో వర్షాధార నేలలను సమర్థంగా సాగులోకి తీసుకురావడానికి మిల్లెట్స్ మీద విస్తృతంగా పరిశోధనలు చేశాను. ఆ తర్వాత కామెరూన్, బ్రెజిల్, నైజీరియా, కెన్యాల్లో పని చేశాను. ప్రధాన పంటతో పాటు అంతర పంటగా మిల్లెట్స్‌ను సాగు చేయడం, అలాగే మిశ్రమ సాగు విధానాన్ని వాళ్లకు అలవాటు చేశాం. మన మిల్లెట్స్‌ని ఆయా దేశాలకు పరిచయం చేశాం. ఆ దేశాలు సమర్థంగా అనుసరిస్తున్నాయి. ఇన్ని దేశాలూ తిరిగి మన జ్ఞానాన్ని వాళ్లకు పంచి, వాళ్ల నుంచి నేర్చుకోవాల్సిన మెళకువలను మనదేశానికి తీసుకు వచ్చిన తర్వాత పరిశీలిస్తే... మనదేశంలో వ్యవసాయం సరికొత్త రూపు సంతరించుకుని ఉంది. ఒకప్పుడు పాడి–పంట కలగలిసి సమాంతరంగా సాగుతుండేవి. పంట సాగు చేసే రైతు ఇంట్లో పాడి కూడా ఉండేది. ఆ పశువుల ఎరువుతో సాగు చేసుకుంటూ అవసరానికి కొంత మేర పై నుంచి రసాయన ఎరువులను వాడేవాళ్లు. ఇప్పుడు పాడి రైతు వేరు, పంట రైతు వేరయ్యారు. దాంతో పంట సాగు ఆరోగ్యంగా లేదు, పాడి రైతు కూడా సౌకర్యంగా లేడు. జరిగిన పొరపాటును సరి చేసుకోవడానికి సేంద్రియ సాగును వెనక్కి తెచ్చుకుంటున్నాం. అలాగే ఆహారంలో కూడా ఇప్పుడు మిల్లెట్స్ రూపంలో ఆరోగ్యాన్ని వెతుక్కుంటున్నాం. చిరుధాన్యాలు, వరిధాన్యం తగు పాళ్లలో తీసుకునే రోజుల నుంచి జొన్నలు, రాగులను పూర్తిగా మర్చిపోయాం. ఇప్పుడు చిరుధాన్యాల పరుగులో వరిధాన్యాన్ని వదిలేస్తున్నారు. మిల్లెట్ మెనూ ప్రాక్టీస్‌లో మనవాళ్లు చేస్తున్న పొరపాట్లు చూస్తుంటే వాటిని అలవాటు చేసుకున్న నెల రోజుల్లోనే మిల్లెట్స్‌కు దూరమైపోతారేమోననే ఆందోళన కూడా కలుగుతోంది. అందుకే అవగాహన కల్పించే బాధ్యతను నాకు చేతనైనంత చేస్తున్నాను. టేబుల్ మార్చినంత సులువు కాదు! పుట్టినప్పటి నుంచి కొన్ని దశాబ్దాలుగా అన్నం తినడానికి అలవాటు పడిన దేహాన్ని ఒక్కసారిగా మారమంటే సాధ్యం కాదు. మనం డైనింగ్ టేబుల్ మీద పదార్థాలను మార్చేసినంత సులువుగా మన జీర్ణవ్యవస్థ మారదు, మారలేదు కూడా. అందుకే మొదటగా రోజులో ఒక ఆహారంలో మాత్రమే మిల్లెట్స్ తీసుకోవాలి. జొన్న ఇడ్లీ లేదా రాగి ఇడ్లీతో మొదలు పెట్టాలి. ఒక పూట అన్నం తప్పకుండా తినాలి. రాత్రికి రొట్టె లేదా సంగటి రూపంలో మిల్లెట్స్ అలవాటు చేసుకుంటే ఈ తరహా జీవనశైలిని కలకాలం కొనసాగించడం సాధ్యమవుతుంది. దేహం మొదట మిల్లెట్స్‌ను అడాప్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత వాటిని అబ్జార్బ్ చేసుకోవడం మొదలవుతుంది. దేహానికి ఆ టైమ్ కూడా ఇవ్వకుండా ఆవకాయతో అన్న్రప్రాశన చేసినట్లు మెనూ మొత్తం మార్చేస్తే ఓ నెల తర్వాత ఆ ఇంటి టేబుల్ మీద మిల్లెట్స్ మాయమవుతాయనడం లో సందేహం లేదు. మరో విషయం... వరి అన్నం తీసుకున్నంత మోతాదులో మిల్లెట్ ఆహారాన్ని తీసుకోకూడదు. పావు వంతుతో సరిపెట్టాలి. అలాగే అరవై దాటిన వాళ్లు జావ రూపంలో అలవాటు చేసుకోవాలి. సాయంత్రం మిల్లెట్ బిస్కట్లను తీసుకోవాలి. ఇక అనారోగ్యానికి గురయిన వాళ్లు తిరిగి కోలుకునే వరకు మిల్లెట్స్‌కి దూరంగా ఉండడమే మంచిది. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ అనుభవాన్నే ఉదాహరిస్తాను. గట్టి ఆహారం తీసుకునే పంజాబీ కుటుంబంలో పుట్టిన ఆయన వార్ధక్యంలో ‘దక్షిణాది ఆహారం సులువుగా జీర్ణమవుతోందని, ఇడ్లీ, అన్నానికి మారినట్లు’ రాసుకున్నారు. మిల్లెట్స్ మనదేహానికి సమగ్రమైన ఆరోగ్యాన్ని చేకూరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. నిదానంగా జీర్ణమవుతూ, నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. ఊబకాయం సమస్య ఉండదు. ఈ వివరాలన్నీ చెబుతూ మెనూతో పాటు మోతాదును కూడా గమనింపులో పెట్టుకోవాలని మహిళలకు వివరిస్తున్నాను. వాళ్లకు చక్కగా అర్థమైతే చాలు, ఇక ఆ వంటగది నుంచి మిల్లెట్ ఎప్పటికీ దూరం కాదు’’ అన్నారు రామ్మోహన్రావు. రోజూ ఓ గంటసేపు నడక, పాలిష్ చేయని బియ్యంతో అన్నం, మిల్లెట్ బిస్కట్ తీసుకుంటారు. ‘మిల్లెట్స్‌తో ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చో వివరించడానికి కాలనీల్లో మిల్లెట్ మేళాలు నిర్వహిస్తుంటాం. కానీ నేను మాత్రం వాటిలో ఒక్క రకమే తింటాను’’ అన్నారాయన నవ్వుతూ. – వాకా మంజులారెడ్డి, ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
మిల్లెట్స్ తింటే ఏమవుతుంది? బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తుందా?
కొర్రలు.. సామలు.. అండుకొర్రలు.. అరికెలు.. ఊదలు.. వరిగ.. ఈ పేర్లు ఒకప్పుడు ప్రతి ఇంట్లో వినిపించినా, కొన్నేళ్ల క్రితం కనుమరుగయ్యాయి. ఆధునిక జీవనశైలితో ఈ పంటలు ఎక్కడో కానీ కనిపించని పరిస్థితి. ఉరుకులు పరుగుల జీవితంలో వ్యాధులు చుట్టుముట్టడంతో జీవితం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మారిన వాతావరణం, పరిస్థితుల్లో ఆరోగ్యం, ఆహార అలవాట్లపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో సంప్రదాయ పంటలకు ఇప్పుడిప్పుడే ప్రాధాన్యత పెరుగుతోంది. అనారోగ్య సమస్యలను అడ్డుకునేందుకు సరిధాన్యాల వాడకం అధికమవుతోంది. ప్రభుత్వం కూడా సాగును ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తుండటం విశేషం. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మిల్లెట్ సాగుకు ప్రోత్సాహం, చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించడం విశేషం. అందులో భాగంగా గత ఏడాది ఖరీఫ్‌లో 7,012 ఎకరాల్లో చిరుధాన్యాల పంటలు సాగయ్యాయి. 2023 ఖరీఫ్‌లో చిరుధాన్యాల సాగు 21,825 ఎకరాలకు పెరిగినట్లు తెలుస్తోంది. ధర లేనప్పుడు రైతులు నష్టపోకుండా ప్రభుత్వం మద్దతు ధర కూడా నిర్ణయిస్తోంది. సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేస్తోంది. రాయితీతో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. పదేళ్ల క్రితం చిరుధాన్యాల వినియోగం 10 శాతం వరకు ఉండగా.. మారుతున్న పరిస్థితులతో వీటి వినియోగం 40–50 శాతం పైగా పెరిగింది. చిరుధాన్యాల సాగుకు చేయూత ∙ ఆహార, పోషక భద్రత(ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ సెక్యూరిటీ) కింద కొర్ర, సజ్జ, జొన్న, వరిగ సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 3,450 ఎకరాలకు ప్రభుత్వం రూ.82.80 లక్షల విలువైన ఇన్పుట్స్ సరఫరా చేస్తోంది. ∙ రూ.1.25 లక్షల సబ్సిడీతో ఏడు మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి అదనంగా వర్షాధార ప్రాంత అభివృద్ధి కింద రూ.2 లక్షల సబ్సిడీతో దాదాపు 15 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాల్లో ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు కావడం విశేషం. షాపింగ్ మాల్స్ సిరిధ్యాన్యాలను ప్రత్యేకంగా విక్రయిస్తున్నాయి. వరి బియ్యంతో పోలిస్తే మిల్లెట్ రైస్ ధరలు కూడా ఎక్కువే. కిలో అండుకొర్రల(వాక్యుమ్ ప్యాకింగ్) ధర రూ.289 పలుకుతోంది. మిల్లెట్ కేఫ్‌కు విశేష స్పందన సిరిధాన్యాలు పోషకాలను అందించడమే కాకుండా రోగ కారకాలను శరీరంలో నుంచి తొలగించి దేహాన్ని శుద్ధి చేస్తాయి. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం ఏర్పాటు చేసిన మిల్లెట్ కేప్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. రోజు 160 మందికిపైగా మిల్లెట్ కేఫ్‌ను సందర్శిస్తున్నారు. ఇక్కడ చిరుధాన్యాల అన్నం, మిక్చర్, మురుకులు, లడ్డు, బిస్కెట్లు, చిరుధాన్యాల ఇడ్లీరవ్వ లభిస్తాయి. చిరుధాన్యాల బ్రెడ్‌కు ప్రత్యేక ఆదరణ ఉంటోంది. సిరిధాన్యాల విశిష్టత తక్కువ నీటితో రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం లేకుండా పండగలిగిన అత్యుత్తమ పోషక విలువలు కలిగిన పంటలు సిరిధాన్యాలు. మూడుపూటలా తిన్నప్పుడు, ఆ రోజుకు మనిషికి అవసరమైన పీచుపదార్థం ( ప్రతి ఒక్కరికి రోజుకు 38 గ్రాముల పీచుపదార్థం కావాలి) ఈ ధాన్యాల నుంచే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములు కూరగాయలు, ఆకు కూరల నుంచి పొందవచ్చు. 25 ఎకరాల్లో చిరుధాన్యాల సాగు చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘాన్ని ఏర్పాటు చేశాం. కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు 25 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసు చేసున్నాం. పంటను ఆంధ్రప్రదేశ్ విత్తన రైతు సేవా సంఘం ద్వారా కొనుగోలు చేస్తాం. ఇప్పటికి చిరుధాన్యాల ప్రాసెసింగ్ సెంటర్ కూడ ఏర్పాటు చేశాం. కలెక్టరేట్ ప్రాంగణంలో మిల్లెట్ కేఫ్ కూడా నిర్వహిస్తున్నాం. – వేణుబాబు, చిరుధాన్యాల రైతు బీపీ, షుగర్ తగ్గాయి నాకు 79 ఏళ్లు. గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. బీపీ, షుగర్ కూడా ఉండింది. బరువు 65 కిలోలు. ఏడాదిన్నరగా కేవలం సిరిధాన్యాలైన సామలు, అరికలు, అప్పుడప్పుడు ఊదల ఆహారం తీసుకుంటున్నా. వీటికి తోడు జొన్న రొట్టె తింటున్నా. ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. బీపీ, షుగర్ కంట్రోల్లో ఉన్నాయి. – పిచ్చిరెడ్డి, విశ్రాంత ఏడీఏ, వెంకటరమణ కాలనీ, కర్నూలు చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాలకు మద్దతు ధర ప్రకటించింది. ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. ఈ పంటల సాగులో పెట్టుబడి వ్యయం తక్కువగా ఉంటుంది. రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు. డయాబెటిస్ తదితర వ్యాధులకు చిరుధాన్యల ఆహారం దివ్య ఔషధం. గతంతో పోలిస్తే ఈ ఏడాది మిల్లెట్ సాగు భారీగా పెరుగుతోంది. – పీఎల్ వరలక్ష్మి, డీఏఓ, కర్నూలు -
అప్పటి దాకా ధాన్యం ఒప్పందం ఉండదు
మాస్కో: యుద్ధం కొనసాగుతున్న వేళ నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్ ధాన్యం రవాణా కారిడార్‌ను పునరుద్ధరించాలంటే పశ్చిమ దేశాలు ముందుగా తమ డిమాండ్లను అంగీకరించాల్సిందేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. దీంతో, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియా దేశాలకు ఎంతో కీలకమైన ఆహార ధాన్యాల సరఫరాపై నీలినీడలు అలుముకున్నాయి. టర్కీ, ఐరాస మధ్యవర్తిత్వంతో కుదిరిన ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందం నుంచి జూలైలో వైదొలిగింది. ఈ ఒప్పందం పునరుద్ధరణపై చర్చించేందుకు సోమవారం రష్యాలోని సోచిలో తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్‌తో ఆయన సమావేశమయ్యారు. రష్యా నుంచి ఆహారధాన్యాలు, ఎరువుల ఎగుమతులకు గల అవరోధాలను తొలగిస్తామన్న వాగ్దానాలను పశ్చిమదేశాలు నిర్లక్ష్యం చేశాయని ఈ సందర్భంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది వరకు రికార్డు స్థాయిలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం ఓడల రాకపోకలు, బీమాకు సంబంధించిన అవరోధాల కారణంగా తీవ్రంగా దెబ్బతిందన్నారు. పశి్చమదేశాలు ఇచి్చన వాగ్దానాలను నెరవేర్చిన పక్షంలో కొద్ది రోజుల్లోనే ఒప్పందంపై సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో త్వరలోనే పురోగతి సాధిస్తామని ఎర్డోగన్ చెప్పారు. -
చిరు ధాన్యాలతో బిస్కెట్స్.... మహిళలకు ఊహించని ఆదాయం
-
ధాన్యం నమోదులో దగా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్ వేసంగిలో 104 బస్తాల ధాన్యం తూకం వేశాడు. మిల్లు వద్ద ట్రక్‌షీట్‌లో 104 బస్తాలుగానే నమోదు చేశారని భావించాడు. కింద 104 మైనస్ 4 అని రాసినట్టుగా గమనించలేదు. తీరా 100 బస్తాలకు మాత్రమే నగదు జమ కావడంతో అవాక్కయ్యాడు. ఇది ఒక్క కరీంనగర్‌లోనే కాదని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో మిల్లర్లు రైతుల కష్టాన్ని యథేచ్ఛగా దోచేశారని తెలుస్తోంది. మొన్నటిదాకా తాలు పేరిట కొనుగోలు కేంద్రాల్లో, నాణ్యత లేదని రైస్‌మిల్లులో క్వింటాలుకు 9 నుంచి 11 కిలోల వరకు కోతపెట్టారు. వీటికి తోడు తాజాగా మరో కొత్త తరహా దోపిడీకి మిల్లర్లు తెరతీసినట్లు.. శ్రీనివాస్ తరహా ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. రూ.వందల కోట్ల విలువైన ధాన్యానికి ఎసరు గతేడాది 50.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. అయితే ఈసారి అకాల వర్షాలు ఇబ్బంది పెట్టినా దిగుబడి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 7,037 కొనుగోలు కేంద్రాల్లో 11,39,597 మంది రైతుల నుంచి ఇప్పటివరకూ 66.49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఈ మొత్తం ధాన్యం విలువ రూ.12,011 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇందులో దాదాపు రూ.1,500 కోట్లు మినహా మొత్తం ధాన్యం డబ్బులు ప్రభుత్వం చెప్పిన విధంగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. వాస్తవానికి ప్రతి క్వింటాలుకు సగటున 10 కిలోల చొప్పున లెక్కలు వేసుకుంటే.. వేలాది క్వింటాళ్ల వరకు ధాన్యం కోతకు గురైంది. సాధారణ తరుగుతోనే రూ.కోట్లు వెనకేసుకున్న మిల్లర్లు ట్రక్ïÙట్ల మాయాజాలం కుంభకోణంతో రూ.వందల కోట్ల విలువైన ధాన్యాన్ని పోగు చేసుకున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. మొత్తం 21 బస్తాలకు కోత..! పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న»ొంకురుకి చెందిన రైతులు 10 మంది స్థానిక పీఏసీఎస్‌లో ధాన్యం అమ్ముకున్నారు. ధాన్యం కాంట వేస్తున్నప్పుడే తరుగు పేరుతో 2 కిలోలు కోత విధించారు. 10 మంది రైతులకు చెందిన 625 బస్తాల ధాన్యం లారీలో లోడ్ చేసి మిల్లుకు తరలించారు. అయితే రైతులకు తెలియకుండానే మిల్లుల్లో సైతం మరోసారి కటింగ్ పెట్టారు. తర్వాత ట్రక్ షీట్ మాయాజాలంతో కేవలం 604 బస్తాలకే లెక్కగట్టారు. ఆ మేరకే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో తమకు ధాన్యం డబ్బులు తక్కువపడ్డాయని రైతులు వాపోతున్నారు. ఎంతలేదన్నా వీరి వద్దనుంచి 9 క్వింటాళ్ల వరకు ధాన్యం దోపిడీకి గురైంది. 11 బస్తాలు కొట్టేశారు వేసంగి ధాన్యాన్ని మహమ్మదాబాద్‌లోని కొను గోలు కేంద్రం ద్వారా విక్రయించాం. నాతో పాటు మరో ఇద్దరు రైతుల బస్తాలు కలిపి మొ త్తం 383 బ్యాగులు తూకం వేశారు. తొలుత కొనుగోలు కేంద్రంలోనే తరుగు పెట్టారు. మళ్లీ మిల్లు వద్దకు వెళ్లాక మొత్తం మీద 372 బస్తాలుగా ట్రక్ïÙటులో నమోదు చేశారు. – ఎండీ ఆలీ, కంచన్‌పల్లి, మహబూబ్‌నగర్ తేమ, తాలు పేరుతో కట్ చేశారు.. యాసంగి సీజన్లో పండించిన ధాన్యాన్ని ఇప్పగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్‌కు తీసుకెళ్లా. కాంటా పూర్తయిన తర్వాత, 439 బస్తాలు ఉన్నట్లు లెక్కవేసి రైస్ మిల్లుకు పంపించారు. ధాన్యం బస్తాలు మిల్లుకు వెళ్లిన తర్వాత తేమ, తాలు పేరిట కొన్ని బస్తాలు కట్ చేశారు. మొత్తం మీద 428 బస్తాలనే బిల్లులో చూపించారు. –జి.వెంకటయ్య, ఇప్పగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్ రైతుల ఇష్టం మేరకే తరుగు ఎడతెరిపిలేని వర్షాల వల్ల ధాన్యం డామేజ్ వచి్చంది. దానివల్ల రైతుల ఇష్టం మేరకే మిల్లర్లు తరుగు తీశారు. ధాన్యం ఆరబెట్టడం, మళ్ళీ వర్షం పడటం పక్షం రోజులు అదే పరిస్థితి. కానీ ఒకసారి తరుగు తీశాక మళ్ళీ తీయడం ఉండదు. – అన్నమనేని సుధాకర్‌రావు, రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి మొత్తం డబ్బులు పడలేదు మా ఊరిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మిన. అప్పుడు తరుగుతో 142 బస్తాలు లెక్క గట్టారు. తీరా ఇప్పుడు 138 బస్తాలకే డబ్బులు పడ్డాయి. సెంటర్ వాళ్ళను అడిగితే.. మాకేమీ తెలియదు మిల్లు వాళ్ళను అడగమంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. –ప్రశాంత్, కౌలు రైతు, చిన్న బొంకూర్, సుల్తానాబాద్ 4.4 క్వింటాళ్ల కోత.. రూ.9,800 నష్టం కొనుగోలు కేంద్రం నుంచి మొత్తం 303 బస్తాలు తూకం వేశారు. ఒకలారీలో 199 బస్తాలు పోగా.. ఆరు బ్యాగులు కట్ చేశారు. మరో దాంట్లో 104 బ్యాగులు పోయినయి.. ఐదు బ్యాగులు కట్ చేశారు. మొత్తంగా 4.4 క్వింటాళ్లు కోతతో మొత్తం రూ.9,800 నష్టం జరిగింది. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. – విష్ణువర్ధన్, కరీంనగర్ -
అకాల వర్షంతో అల్లాడుతున్న రైతులకు అండగా ఏపీ సర్కార్
-
అన్నదాతల తెలివికి ప్రతీక ఇది.. భూదేవి ఒడిలో ధాన్యలక్ష్మి
ఊరి దారులు రహస్యంగా దాచుకున్న కథలు కోకొల్లలు. నల్లటి తారు కప్పుకున్న రోడ్లు, తెల్లటి సిమెంటు రంగేసుకున్న బాటలు.. నిజానికి రహదారులు మాత్రమే కావు.. వేల జ్ఞాపకాలకు ద్వారాలు. పల్లెల్లో మట్టి రోడ్ల రోజులు గతించిపోతూ కొన్ని అలవాట్లను తమతో ఉంచేసుకున్నాయి. అలా నిన్నటి కాలం తనతో ఉంచేసుకున్న కథ ‘పాతర’. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఆరు కాలాల పాటు నిల్వ ఉంచడానికి భూమి కడుపును ఆశ్రయించిన అన్నదాతల తెలివికి ప్రతీక ఇది. ధాన్యలక్ష్మి బాధ్యతను భూదేవికే అప్పగించారు. ఇచ్ఛాపురంలోని సరిహద్దు గ్రామాల్లో అక్కడక్కడా ఈ పాతర్లు ఇంకా దర్శనమిస్తున్నాయి. ధాన్యం నిల్వ ఉంచడానికి ఈరోజు అనేక పద్ధతులు ఉండవచ్చు. కానీ సాంకేతికత అనేదే లేని రోజుల్లో నెలల తరబడి ధాన్యం నిల్వ చేయడానికి మన పూర్వీకులు కనిపెట్టిన ఈ విధానం వారి విజ్ఞానానికి ఓ నిదర్శనం. ఇచ్ఛాపురం రూరల్(శ్రీకాకుళం జిల్లా): పల్లె ఒడిలో పెరిగి పెద్దయిన వారికి.. గ్రామాల్లో బాల్యం గడిపిన వారికి పాతర్లు పరిచయమే. కానీ పట్టణీకరణ పెరిగి మట్టికి దూరమైపోతున్న ఈ తరానికి మాత్రం పాతర గురించి కచ్చితంగా తెలియాలి. పాతర వేయడం అంటే భూమిలో గొయ్యి తీసి దాచిపెట్టడం. ఒకప్పుడు ధాన్యం నిల్వ ఉంచడానికి ఎలాంటి సాధనం లేని రోజుల్లో భూమిలో ధాన్యం ఉంచే పద్ధతిని మన పూర్వీకులు అనుసరించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఆంధ్రా–ఒడిశా సరిహద్దు పల్లెల్లో ఇప్పటికీ ఇవి కనిపిస్తున్నాయి. అంత సులభం కాదు.. ∙ఈ ధాన్యాన్ని పాతర వేయడం అంటే అనుకున్నంత సులువేం కాదు. ∙పాతర వేయడానికి రైతుల ఇళ్ల ముందు వీధిలో ఉండే ఖాళీ స్థలాన్ని ఎంచుకొని వృత్తాకారంలో, దీర్ఘ చతురస్త్రాకారంలో నిల్వ చేయాల్సిన ధాన్యం రాశి పరిమాణానికి తగినట్లుగా గోతిని తవ్వుతారు. ∙గోతిని కనీసం ఆరు అడుగుల లోతులో తవ్వడం పూర్తయ్యాక, వరి నూర్పులు సమయంలో వచ్చిన ఎండు గడ్డిని జడలా అల్లుతూ ‘బెంటు’ను తయారు చేస్తారు. ∙దాన్ని గోతిలో పేర్చి, అడుగు భాగంలో కొంటి గడ్డిని పొరలు పొరలుగా అమర్చుతారు. ∙భారీ వర్షాలు కురిసినా నీరు గోతిలో చేరకుండా చాకచక్యంగా పై వరకు అమర్చుతారు. ∙అందులో టార్పాలిన్లు గానీ, వలను గానీ వేసి ధాన్యంను వేస్తారు. ∙అనంతరం ధాన్యంపై ఎండు గడ్డిని వేసి, దానిపై మట్టితో కప్పి ఆవు పేడతో శుభ్రంగా అలుకుతారు. రక్షణ కోసం.. ఒక్కసారి పాతర వేశాక.. ధాన్యం పోతుందన్న దిగులు రైతులకు ఇక ఉండదు. వానలు, దొంగలు, అగ్ని ప్రమాదాలు ఇలా ఏ వైపరీత్యం వచ్చినా పాతరే పంటను కాపాడుకుంటుంది. చాలా ఇళ్లలో ఈ పాతర్లకు ప్రతి గురువారం ప్రత్యేక పూజలు కూడా చేసేవారు. ఎప్పటికప్పుడు శుభ్రంగా పేడతో అలికి ముగ్గులు పెట్టి మురిపెంగా చూసుకునేవారు. బియ్యం కావాల్సిన సమయంలో తీసి మిల్లు చేసుకోవడమో దంచుకోవడమో చేసుకునేవారు. పాతర ధాన్యం తిన్న పిల్లలు పుష్టిగా ఉంటారని గ్రామీణ ప్రాంతాల్లో నానుడి ఉంది. పూర్వం గ్రామాల్లో ఉండే భూస్వాములు రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించేవారు. పంట దిగుబడి తనకే అధికంగా వచ్చిందనడానికి ప్రతీకగా తమ ఇళ్లముందు పాతర్ల రూపంలో తోటి రైతులకు తెలియజెప్పేందుకు వేసేవారని చెబుతారు. పుష్కలంగా పోషకాలు.. పాతర్లలో నిల్వ చేసిన ధాన్యంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ధాన్యం పరిమాణంలో కూడా తేడా వస్తుంది. పాతర్లలో నెలల తరబడి ఉండటంతో ధాన్యం భూగర్భంలో బాగా ముక్కుతాయి. ఇలాం ధాన్యం మిల్లులో వేసి బియ్యం చేయడం కన్నా, ఎండలో వేసి రోట్లో వేసి దంచిన తర్వాత వచ్చిన బియ్యాన్ని ఉపయోగిస్తే మరింత రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. బియ్యంతో తయారైన ఆహారం తినడం వల్ల రక్తహీనత సమస్యలు దరికి చేరవు. ఇచ్ఛాపురం మండలంలో చాలా గ్రామాల్లో పాతర్ల పద్ధతిని కొనసాగిస్తుండటం గమనార్హం. – పిరియా శ్రీదేవి, వ్యవసాయాధికారి, ఇచ్ఛాపురం మండలం గ్రామంలో సిమ్మెంట్ రోడ్లు వచ్చినా.. తరతరాలుగా వస్తున్న పాతర సంప్రదాయాన్ని ఇప్పటికీ మేము కొనసాగిస్తూనే వస్తున్నాం. రైతుల ఇళ్ల ముందు వేసిన పాతర ఎంత ఎత్తులో ఉంటే యజమాని ఎన్ని ఎకరాల భూస్వామిగా అప్పట్లో నిర్ధారించేవారు. అప్పట్లో రైతుకు మానసికంగా ఎన్ని కష్టాలు వచ్చి నా, ఈ ధాన్యం పాతర చేసి కష్టాలను మరచిపోయేవారు. దొంగల భయం నుంచి, అగ్ని భయం నుంచి సురక్షితంగా ధాన్యం సంరక్షించుకునేందుకు చక్కని అవకాశం ఈ పాతర్లు. – కొణతాల కనకయ్య, రైతు, తేలుకుంచి, ఇచ్ఛాపురం మండలం -
Telangana: ‘వరి’పరి విధాలు!
సాక్షి, నిజామాబాద్: ఎరుపు రంగులోని వడ్లు.. లోపల నల్లటి బియ్యం.. సాధారణంగా కనిపించే ధాన్యం.. లోపల ఎర్రని బియ్యం.. ఇలా ఎన్నో రకాలు. కొన్నింటిలో పోషకాలు చాలా ఎక్కువ. మరికొన్నింటి దిగుబడి ఎక్కువ. బాగా చిన్నగా ఉండేవి కొన్ని, గుండ్రంగా ధనియాల్లా కనిపించే బియ్యం రకాలు ఇంకొన్ని.. ఇవన్నీ ఎక్కడెక్కడో కాదు. ఒకేచోట పండుతున్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరుకు చెందిన నాగుల చిన్నగంగారాం పూర్తి సేంద్రియ విధానంలో వీటిని పండిస్తున్నారు. పొలాన్నే ప్రయోగశాలగా మార్చి.. ఒక యోగా గురువు వద్ద సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యత గురించి తెలుసుకున్న చిన్న గంగారాం.. 2007లో సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టారు. ఏకంగా 110 రకాల వరి విత్తనాలను సేకరించి సాగుచేస్తున్నారు. ఇందులో మన దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు పలు ఇతర దేశాల వరి రకాలు కూడా ఉండటం గమనార్హం. తాను సాగు చేసిన వివిధ రకాల వరి విత్తనాలను ఇప్పటికే 8 రాష్ట్రాలకు చెందిన 570 మంది రైతులకు అందించారు. బియ్యం నుంచి మొలకలు తెప్పించి.. సాధారణంగా ధాన్యం నుంచే మొలకలు వస్తాయి. కానీ గంగారాం బియ్యం నుంచి మొలకలు తెప్పించి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా చేశారు. అమెరికా నుంచి తెచ్చిన కాలిఫోర్నియా రైస్, ఇటలీ నుంచి తెచ్చిన రిసోట రకం బియ్యం నుంచి మొలకలు వచ్చేలా చేసి సాగు చేశారు. రోజుకో రకం బియ్యం తింటూ.. మన దేశంలో వందేళ్ల క్రితం 40వేల రకాల వరి విత్తనాలు ఉండేవని, వాటిలో 30 వేల రకాలు కనుమరుగయ్యాయని గంగారాం చెప్పారు. మిగతా రకాలను ఔత్సాహిక రైతులు కాపాడుతూ వస్తున్నారని తెలిపారు. అందులో కొన్ని దేశవాళీ రకాలు ఎంతో ప్రత్యేకమైనవని వెల్లడించారు. తనవద్ద ఉన్న 110 రకాల్లో 30 రకాలను రోజూ ఒక రకం బియ్యం అన్నం తింటున్నానని తెలిపారు. ఇన్ని రకాల వరిసాగును ఆయన నాలుగు ఎకరాల్లో చేస్తున్నారు. గంగారాం వద్ద ఉన్న వరి విత్తనాల్లో ప్రత్యేకమైన కొన్ని.. కృష్ణవీహి: ధాన్యం ఎర్రరంగులో, బియ్యం నల్లరంగులో ఉంటాయి. రెండు అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. రామ్‌లక్ష్మణ్: ఈ రకం వరిలో రెండు బియ్యం గింజలు ఉంటాయి. ధాన్యం తెల్లగా, బియ్యం గోధుమ రంగులో ఉంటుంది. కాలజీర: పరమాన్నం (పాయసం) స్పెషల్. పైరు ఏకంగా 5 అడుగుల ఎత్తు పెరుగుతుంది. విష్ణుభోగ్: గింజ బాగా చిన్నగా ఉంటుంది. 135 రోజుల పంట. చిన్నపొన్ను: తమిళనాడు రకం. ధనియాల మాదిరిగా ఉంటాయి. పైరు 2 అడుగుల వరకు పెరుగుతుంది. గంగాగోల్డెన్ బ్రౌన్‌రైస్: అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి గోల్డెన్ బ్రౌన్‌రైస్ (బియ్యం) తీసుకొచ్చి వాటి నుంచి మొలకెత్తించారు. ఇది ఒక అడుగు ఎత్తు మాత్రమే పెరిగే రకం. గంగా స్వీట్ బ్రౌన్‌రైస్: ఇది ఒక అడుగు మాత్రమే పెరుగుతుంది. నష్టం తక్కువ. గింజలు త్వరగా రాలిపడవు. మెడిసినల్ రెడ్‌రైస్: ధాన్యం సాధారణ రంగులో ఉన్నా.. బియ్యం ఎరుపురంగులో ఉంటాయి. ఈ బియ్యంలో 18 రకాల పోషకాలు ఉంటాయి. ఐదేళ్లు దాటినా ఈ ధాన్యం బూజు, దుబ్బ, పురుగు పట్టదు. ఇది దేశవాళీ రకం. కుంకుమ బంతులు (బుడుమ వడ్లు): తెలంగాణలోని నల్లగొండ ప్రాంతానికి చెందినవి. దిగుబడి తక్కువ అయినా బలం ఎక్కువ. గంగా గ్రీన్ బ్లాక్ రైస్: ఇది జపాన్ నాటురకం. ధాన్యం, బియ్యం నల్లగా ఉంటాయి. దిగుబడి ఎక్కువగా వస్తుంది. రిసోట రైస్: ఇది ఇటలీ రకం. ధాన్యం లావుగా గుగ్గిళ్లలా ఉంటుంది. ప్రతి గింజకు ముల్లు ఉంటుంది. రత్నాచోళి: పోషకాలు ఉన్న ఈ బియ్యం తింటే కండరాలు గట్టి పడతాయని చెప్తారు. మాపిళ్లై సాంబ: ఈ బియ్యం తింటే వీర్య కణాలు, అండకణాలు పెరుగుతాయని గంగారాం చెబుతున్నారు. గంగా జపనీ గ్రీన్ బ్లాక్‌రైస్: ఇది 110 రోజుల పంట. ధాన్యం, బియ్యం నల్లగా ఉంటాయి. కర్పూకౌని: ఈ బియ్యం తింటే శరీరంలోని పనికిరాని కొవ్వు కరిగి బరువు తగ్గుతారని చెప్తారు. గంగా రూబీ రెడ్‌రైస్: వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ బియ్యం చిరుధాన్యాలతో సమానం. ఫర్బిడెన్ రైస్: ఇది చైనా రకం. ఈ బియ్యం నీళ్లల్లో వేస్తే వండే పని లేకుండా రెండుగంటల్లో అన్నం అవుతుంది. -
జొన్నలకు పులి కాపలా!
తుంగతుర్తి: కోతుల బెడద తీవ్రమవుతుండటంతో రైతులు విసిగిపోతున్నారు. తమ పంటను కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి ఎక్స్‌రోడ్ తండా వద్ద ఓ రైతు తాను పండించిన జొన్నలను ఆరుబయట ఆరబోసి కోతుల బెడద నుంచి ధాన్యాన్ని రక్షించుకోవడానికి పులి బొమ్మను ఏర్పాటు చేశాడు. కోతులు ఈ పులి బొమ్మను చూసి దరిదాపుల్లోకి రాకుండా పోతున్నాయని రైతు తెలిపాడు. -
ఇంకా ఎదురుచూపులే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుందనుకున్నా.. మొదలు కాలేదు. దీంతో రైతులకు ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. వరికోతలు ప్రారంభమై పదిరోజులు కావడంతో కొను గోళ్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఇటీవలే ఆ మోదం తెలిపింది. కొనుగోళ్ల ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని, రైతులకు ఇబ్బందులు కలగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులను ఆదేశించింది. అయితే ప్రభుత్వం నుంచి ఆమోదం లభించి మూడు రోజులు అవుతున్నా జిల్లాల్లో కొనుగోళ్లకు సం బంధించిన ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తూ నే ఉన్నారు. సోమవారమే సమీక్షలు ప్రారంభించిన నేపథ్యంలో కొనుగోళ్లు ప్రారంభించేందుకు మరో ఐదారు రోజుల సమయం పట్టేలా ఉంది. 4 జిల్లాల నుంచే 40% కంటే ఎక్కువ దిగుబడి నల్లగొండ, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరి కోతలు ప్రారంభమై కల్లాలకు ధాన్యం పది రోజుల నుంచే వస్తుండటంతో, ఆయా జిల్లాల్లో సోమవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. కానీ యంత్రాంగం అందుకు పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంతో ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో 1.35 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 6,500కు పైగా కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 26 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రానుంది. నిజామాబాద్‌లో 9,63,652 మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 6.5 లక్షల మెట్రిక్ టన్నులు, ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో 11 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రానుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ధాన్యంలో 40 శాతం కంటే ఎక్కువ దిగుబడి ఈ నాలుగు జిల్లాల నుంచే రానుంది. పరిస్థితులు, ఏర్పాట్లను బట్టి సేకరణ జిల్లాల్లో పరిస్థితులు, ఏర్పాట్లను బట్టి ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు ధాన్యం సేకరణ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వారం చివరలో సేకరణను ప్రారంభించి వచ్చే నెల మొదటి వారం వరకు అన్ని జిల్లాల్లో ధాన్యం సేకరణను ప్రారంభించనున్నారు. సోమవారం నల్లగొండ, నిజామాబాద్, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ధాన్యం సేకరణపై అ«ధికారులు సమీక్షలు నిర్వహించారు. నల్లగొండ జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో ఈ వారం చివరలో, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో నెలాఖరులో ధాన్యం కొనుగోలు ప్రారంభించే అవకాశం ఉంది. 6,545 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు గతేడాది తరహాలోనే ఈ వర్షాకాలంలో పండిన ధాన్యాన్ని సేకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ధాన్యం సేకరణపై సీఎం సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. గత సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,545 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఈ ఏడాది కూడా ఈ కేంద్రాలన్నింటి ద్వారా యధావిధిగా ధాన్యం సేకరణ జరపాలని పౌర సరఫరాల శాఖాధికారులను సీఎం ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎంఓ అధి కారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
తృణధాన్యాలతో మధుమేహానికి చెక్!
సాక్షి, హైదరాబాద్: మధుమేహంతో బాధపడుతున్న వారికి శుభవార్త. కొర్రలు, జొన్నలు, రాగుల వంటి తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటే టైప్–2 మధుమేహాన్ని నియంత్రించొచ్చని ఇక్రిశాట్ (మెట్టప్రాంత పంటల పరిశోధన కేంద్రం)తో పాటు అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. మధుమేహం బారినపడని వారికి కూడా ప్రయోజనమేనని 11 దేశాల్లో జరిగిన పరిశోధనల ఆధారంగా జరిగిన ఈ అధ్యయనంలో తేలింది. ఫ్రాంటీయర్స్ ఇన్ న్యూట్రీషన్ జర్నల్ సంచికలో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. 15 శాతం తగ్గుదల: తృణ ధాన్యాలను ఆహారం గా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ శాతం 12 నుంచి 15 శాతం వరకు (భోజనానికి ముందు, తర్వాత) తగ్గుతుందని తెలి సింది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు డయాబెటిస్ వచ్చినప్పటి కంటే రాకముందు స్థాయికి తగ్గిపోయినట్టు గుర్తించారు. ప్రీ డయాబెటిక్‌లో ఉన్నవారి హెచ్‌బీఏ1 సీ (హీమోగ్లోబిన్‌కు అతుక్కున్న గ్లూకోజ్) మోతాదుల్లోనూ 17 శాతం తగ్గుదల నమోదైందని చెబుతున్నారు. 80 అధ్యయనాల సారాంశం: మధుమేహంపై తృణధాన్యాల ప్రభావాన్ని మదింపు చేసేందుకు ఈ అధ్యయనాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రచురితమైన 80 అధ్యయనాలను పరిశీలించారు. ‘తృణధాన్యాల ప్రభావం మధుమేహంపై ఎలా ఉంటుందో ఇప్పటివరకు ఎవరూ శాస్త్రీయంగా పరి శోధించలేదు. ఈ నేపథ్యంలో పద్ధ తి ప్రకారం అన్ని అధ్యయనాలను సమీక్షించాలని తాజాగా ఈ ప్రయత్నం చేశాం’అని ఇక్రిశాట్ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ ఎస్.అనిత తెలిపారు. తృణధాన్యాలే పరిష్కారం ‘అనారోగ్యం, పోషకాల లోపం వంటి సమ స్యలకు తృణధాన్యాలను ఆహారంగా తీసుకోవడమే పరిష్కారం. ఆహారం ద్వారా మరిన్ని పోషకాలు అందించేందుకు పరిశోధనలు చేపట్టాల్సి ఉంది. స్మార్ట్‌ఫుడ్ పేరుతో ఇక్రిశాట్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ అధ్యయ నాన్ని నిర్వహించాం. మధుమేహం మాత్రమే కాకుండా.. రక్తహీనత, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, కాల్షియం లోపాల వంటి అనేక సమస్యలకు తృణధాన్యాలకు ఉన్న సంబంధాన్ని ఈ ఏడాదే విడుదల చేస్తాం’ –జాక్వెలిన్ హ్యూగ్స్, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ -
Telangana: తడిచె.. మొలకెత్తే..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: ఈ ఏడాది దిగుబడి బాగుందన్న రైతుల సంతోషాన్ని అకాల వర్షాలు, రవాణా కష్టాలు ఆవిరి చేస్తున్నా యి. నెల రోజులుగా తరచూ కురుస్తున్న వానలతో ఇబ్బందులు నెలకొన్నాయి. ధాన్యం తడిసి రంగు మారిందని, మొలకెత్తిందని, తేమ ఎక్కువ ఉందంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు పెడ్తున్న కొర్రీలతో రైతులు కన్నీళ్లు పెట్టాల్సి వస్తోంది. మరోవైపు ధాన్యం తూకం వేసినా.. దానిని మిల్లులకు తరలించేందుకు లారీలు లేక మరో సమస్య ఎదురవుతోంది. కొనుగోళ్లు లేక, కొన్నా మిల్లులకు తరలించలేక.. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుండటంతో రైతులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. కాంటాలు వేసిన తర్వాత కూడా బస్తాలు మిల్లుకు చేరితేనే రైతులు ధాన్యం అమ్మినట్టు రశీదులిస్తున్నారు. అప్పటిదాకా రైతులదే బాధ్యత అని స్పష్టం చేస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్దే రైతులు పడిగాపులు పడుతున్నారు. 20 లక్షల టన్నులు ఆరుబయటే.. రాష్ట్రంలో ఈ ఏడాది వరిసాగు ఎక్కువగా జరిగింది. సుమారు కోటీ 30 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రావొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో 80 లక్షల టన్నుల మేర సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే 76 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరణ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా కొనుగోళ్లు సాగుతున్నాయని, అంచనా వేసుకున్న 80 లక్షల టన్నులకన్నా మరో 5లక్షల టన్నులు అధికంగా రావొచ్చని ఇటీవల పౌర సరఫరాల సంస్థ అంచనా వేసింది. కానీ జిల్లాల నుంచి వస్తున్న సమాచారం మేరకు.. ఇంకా 20 లక్షల టన్నులకుపైగా ధాన్యం కల్లాల్లో, సేకరణ కేంద్రాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వరి సాగు ఆలస్యంగా మొదలైన ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, గద్వాల, వికారాబాద్, వనపర్తి తదితర జిల్లాల్లో ధాన్యం భారీగా ఉంది. నెల రోజుల నుంచి పడిగాపులే.. ఎకరం వరి వేశాను. 30 క్వింటాళ్ల వడ్లు వచ్చాయి. ఎండలో బాగా ఆరబెట్టి నెల రోజుల కింద కొనుగోలు కేంద్రానికి తెచి్చన. వానలకు నాలుగుసార్లు తడిసిపోయాయి. ప్రతిసారీ ఆరబెట్టుకుంటూ వచ్చిన, వారం కింద ధాన్యాన్ని కాంటా వేశారు. ఇంకా మిల్లుకు పంపలేదు. అధికారులను అడిగితే లారీలు రావట్లేదని చెప్తున్నారు. ధాన్యం మిల్లుకు చేరేదాకా మా బాధ్యతే అంటున్నారు. కొద్దిరోజులుగా వానలు పడుతుండటంతో కొనుగోలు కేంద్రం వద్దే ఉంటూ చూసుకోవాల్సి వస్తోంది. – కాలసాని వెంకటరెడ్డి, రైతు, కురవి, మహబూబాబాద్ జిల్లా ఎక్కడ చూసినా అదే పరిస్థితి.. ►ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, వ్యవసాయ మార్కెట్లు కలిపి మొత్తం 306 కొనుగోలు కేంద్రాలను తెరిచారు. నాలుగున్నర లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం పెట్టుకున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోళ్లు మొదలయ్యాయి. ఈ నెల 2 వరకు కూడా 3,17,520 టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఇంకా భారీగా ధాన్యం కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉంది. పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెలన్నర రోజులు అవుతున్నా.. తూకం వేయక, వేసినా మిల్లులకు తరలించక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ►మహబూబాబాద్ జిల్లా కురవిలోని ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సం ఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఈ నెల 2వ తేదీ నాటికి 42 వేల బస్తాల ధాన్యంరాగా.. 32,588 బస్తాలు కాంటా అయింది. ఇందులో 19,315 బస్తాలు మాత్రమే మిల్లులకు పంపగలిగారు. అంటే తూకం వేసిన ధాన్యమే 13,273 బస్తాలు ఉండగా.. తూకం వేయనిది మరో 9,500 బస్తాల వరకు ఉంటుం దని అధికారులే చెబుతున్నారు. చాలా కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు నామ శ్రీను. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామం. మూడెకరాల్లో వరి వేస్తే 200 బస్తాల దిగుబడి వచ్చింది. ఏప్రిల్‌లోనే గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రానికి ధాన్యం తెచ్చాడు. ఇంతవరకు కొనుగోలు చేయలేదు. ధాన్యం రాశిపై పట్టా కప్పి పెట్టాడు. రెండు నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ‘‘ఇప్పటికే పలుమార్లు ధాన్యం తడిసింది. కొంత మేర మొలకలు వచ్చింది. గురువారం మళ్లీ తడిసిపోయింది. ఇప్పుడీ ధాన్యాన్ని కొంటారా లేదా తెలియడం లేదు. వానాకాలం సీజన్ మొదలైంది. వ్యవసాయ పనులు చేసుకోవాలి. ధాన్యం అమ్మితే తప్ప పెట్టుబడికి డబ్బులు లేవు. త్వరగా ధాన్యం కొంటే మా కష్టాలు తీరు తాయి..’’ అని శ్రీను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వానలకు తడవడంతో ధాన్యం బస్తాల నుంచి వచ్చిన మొలకలివి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లికి చెందిన రైతు కాటం రమేశ్.. 45 రోజుల కింద మండల కేంద్రం లోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చాడు. 10 రోజుల కింద 150 బస్తాలు తూకం వేశారు. ఇంకా మిల్లుకు పంపలేదు. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలతో ధాన్యం తడిసి మొలకెత్తింది. కొనుగోలు కేంద్రంలో తూకం వేసినా మిల్లులకు తరలించేదాకా రైతులదే బాధ్యత అని చెప్పారు. మిల్లులు మొలకెత్తిన ధాన్యం తీసుకుంటారా లేదా అన్నది అనుమానమేనని.. ఎంత తరుగు తీస్తారో అర్థం కావడం లేదని రమేశ్ ఆందోళన చెందుతున్నారు. ఈ ఫొటోలోని రైతు బత్తుల బాలయ్య. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్షి్మపురం. గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో 224 బస్తాల ధాన్యం తూకం వేసి నెలన్నర దాటింది. మిల్లుకు తరలించడానికి లారీలు రాకపోవడంతో రోజూ ధాన్యం వద్ద కాపలా ఉండాల్సి వస్తోంది. వానలకు ధాన్యం తడుస్తోంది. చీడపీడల నుంచి కాపాడుకున్న పంట చివరకు ఇలా ఆగమవుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నామని బాలయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వాన.. దెబ్బకొట్టింది వాన పడిన ప్రతిసారీ ధాన్యాన్ని ఆరబెట్టాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లో నీళ్లు నిలుస్తుండటంతో.. ధాన్యం రాశుల అడుగున మొలకలు వస్తున్నాయి. ధాన్యం రంగు మారుతోంది. తేమ ఎక్కువగా ఉంటోంది. తేమ శాతం తగ్గేందుకు ధాన్యాన్ని ఆరబెడితే.. మళ్లీ వానలు కురిసి తడిసిపోతోంది. మార్కెట్.. కడుపుకొట్టింది రైతులు ధాన్యాన్ని తీసుకెళ్తే తేమ ఎక్కువగా ఉందని, రంగు మారిందని చెప్తూ కొనుగోలు చేయడం లేదు. దీంతో రోజులకు రోజులు అక్కడే ఎదురుచూడాల్సి వస్తోంది. ఒకవేళ తూకం వేసినా మిల్లులకు తరలించేందుకు లారీల కొరత వేధిస్తోంది. లారీ దొరికి ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్లినా తేమ, రంగు, తాలు అంటూ కొర్రీలు పెట్టి తిప్పి పంపుతున్నారు. తీసుకుంటే.. బస్తాకు కిలో నుంచి మూడు కిలోల దాకా కోత పెడుతున్నారు. చివరికి.. మట్టి మిగిలింది వానలకు కొట్టుకుపోయి, ఆరబెట్టి ఎత్తినప్పుడల్లా కొంత ధాన్యం పోతోంది. కొనుగోలు కేంద్రాల్లో, మిల్లుల్లో ఏదో ఓ కారణం చెప్పి కోత పెడుతుండటంతో రైతులు మరింత నష్టపోతున్నారు. ఇంతా జరిగి సొమ్ము చేతికొచ్చేసరికి జాప్యం జరుగుతోంది. ఆలోగా పెట్టుబడికోసం చేసిన అప్పులపై మిత్తీలు పెరిగిపోతున్నాయి. చివరికి రైతుకు మట్టే మిగులుతోంది. ఇన్నితిప్పలు ఎప్పుడూ పడలే... నాలుగెకరాల్లో వరి వేసిన. కోతలు అయినంక నెలన్నర కిందనే ఊరిలోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచి్చన. 15 రోజుల కిందనే కాంటా వేశారు. లారీలు లేవని మిల్లుకు పంపడం లేదు. వానలతో ధాన్యం తడిచిపోతూనే ఉంది. బస్తాల్లో కింది నుంచి మొలకెత్తుతోంది. ధాన్యం మిల్లుకు చేరితేనే కొనుగోలు చేసినట్టు రసీదు ఇస్తున్నరు. ఇట్లా మిల్లుకు వెళ్తే ఒక్కో బస్తాకు ఎంత తరుగు తీస్తారో. ఇన్ని తిప్పలు ఎప్పుడూ పడలే.. – ఈర్ల కాటయ్య, ముత్యాలగూడెం, ఖమ్మం జిల్లా ఎన్నడూ లేనంతగా ధాన్యం కొన్నాం.. ఈసారి ధాన్యం కొనుగోలు లక్ష్యం 80 లక్షల టన్నులైతే.. ఇప్పటికే 76 లక్షల టన్నులు సేకరించాం. లక్ష్యానికి మించి 85 లక్షల టన్నుల వరకు సేకరించేందుకూ ఏర్పాట్లు చేశాం. ఇందుకోసం రూ. వెయ్యి కోట్ల రుణం కోసం బ్యాంకులతో మాట్లాడుతున్నాం. ఎన్నడూ లేనట్టు రికార్డు స్థాయిలో ధాన్యం కొన్నాం. – మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పాత తూకం యంత్రంతో రైతులకు భారీ టోకరా
రామాయంపేట (మెదక్): మండలంలోని కాట్రియాల గ్రామంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో భారీ అవినీతి చోటు చేసుకుంది. దీంతో రైతులు రూ.లక్షలు నష్టపోయారు. ఎల్రక్టానిక్ తూకం యంత్రానికి బదులుగా పాత తూకం యంత్రం వినియోగించి దోపిడీకి పాల్పడ్డారు. ప్రతీ తూకానికి 40 కిలోలకు బదులుగా 48 నుంచి 50 కిలోల వరకు అక్రమంగా తూకం చేసుకొని రైతులను మోసగించారు. కాగా రైతులకు తెలియకుండానే ఒక్కో తూకం (40 కిలోలు)లో ఎనిమిది నుంచి పది కిలోల మేర మోసానికి పాల్పడ్డారు. ఈ కేంద్రంలో ఇప్పటివరకు పదివేల బ్యాగుల వరకు తూకం వేయగా, ఇందులో సుమారుగా ఐదు వేల బ్యాగులను పాత కాంటాపై తూకం చేశారు. ఈ లెక్కన రైతులు రూ.లక్షలు నష్టపోయారు. కాగా ఎవరి ప్రోద్బలంతో తూకం వేసిన హమాలీలు ఈ మోసానికి పాల్పడ్డారో తెలియాల్సి ఉంది. బయటపడింది ఇలా.. సాయంత్రం మ్యాన్యువల్ కాంటాతో ధాన్యం బస్తాలను తూకం వేస్తున్న క్రమంలో అనుమానించిన కొందరు రైతులు ఈ కాంటాతో తూకం వేసిన బస్తాలను కొన్నింటిని ఎల్రక్టానిక్ తూకం యంత్రంపై తూకం వేయగా, ఈ మోసం బయటపడింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు వందలాది మంది కేంద్రం వద్ద నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకొని వచి్చన పోలీసులు రైతులను శాంతపర్చారు. చదవండి: సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో రోడ్డెక్కిన రైతన్న -
పొట్టు తీయని ధాన్యంతో బరువు పెరుగుతారా?
పొట్టు తీయని ధాన్యాలను (హోల్ గ్రేయిన్స్‌ను) ఆహారంగా తీసుకుంటే అందులోని పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య కారకాలన్న విషయం తెలిసిందే. ఇక ఇదే అంశం ఆరోగ్యానికి మరో అనుకూలమైన అంశంగా నిరూపితమైందని చెబుతున్నారు పరిధకులు. పొట్టు ఉన్న కారణంగా హోల్ గ్రెయిన్స్ జీర్ణమయ్యే వేగం చాలా నెమ్మదిగా కొనసాగుతుంటుందట. అందువల్లనే ఒంట్లోకి చక్కెర విడుదలు సైతం ఆలస్యమవుతుంటాయి. ఫలితంగా ఇన్సులిన్ విడుదల యంత్రాంగం మంచి నియంత్రితంగా ఉంటుందంటున్నారు పరిశోధకులు. ఇక వరి, ఓట్స్, గోధుమ, బార్లీ వంటి వాటిని పొట్టుతో తినడం వల్ల బరువు పెరగకుండా ఉండే మరో ప్రయోజనమూ ఉంటుందట. ఉదాహరణకు వరిని ముడిబియ్యంగా తినడం వల్ల, పొట్టుతీసిన వాటితో పోలిస్తే తక్కువ బరువు పెరుగుతారట. దాంతో స్థూలకాయంతో వచ్చే అనర్థాలనూ తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. నిరూపితమైన ఈ అధ్యయన ఫలితాలను ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ప్రచురించారు. చదవండి: ఆ ఒక్కటీ.. ఒక్కటంటే కూడా ప్రమాదకరమే! -
అటు పని..ఇటు మనీ!
సాక్షి, సిద్దిపేట: ఒక ఐడియా.. రైతులకు మనీ, మహిళలకు పని కల్పించింది. పంటను అమ్ముకోవడానికి పడిన కష్టం.. డబ్బులు చేతికొచ్చే సమయంలో కొర్రీలను చూసిన సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి రైతుల కుటుంబాల్లోని మహిళలు ఫుడ్ ప్రాసెసింగ్ ఆలోచనకు వచ్చారు. పప్పుమిల్లులు కొనుగోలు చేసి ముందుగా తమ ఇళ్లలో ఉన్న కందులను పప్పుగా మార్చి విక్రయాలు మొదలుపెట్టారు. మిట్టపల్లి ఇప్పుడు రెడ్‌గ్రామ్‌కు చిరునామాగా మారింది. ఆలోచన పుట్టిందిలా.. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలని ఓ రోజు మహిళాసంఘాల సభ్యులు మిట్టపల్లి గ్రామపెద్దలను కోరారు. కందులు అమ్ముడు పోవట్లేదని, కావాలంటే వాటిని పప్పుగా మార్చి అమ్ముకోవాలని పలువురు రైతులు సూచించారు. ఈ సలహాలనే ఆచరణ రూపం దాల్చింది. వెంటనే మహిళా సంఘం సభ్యులు 20 మంది రూ.2 లక్షలు జమ చేశారు. సర్పంచ్ వంగ లక్ష్మి రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. మంత్రి హరీశ్‌రావు బ్యాంకర్లతో మాట్లాడి రూ.10 లక్షల రుణం ఇప్పించారు. ఇలా మొత్తం రూ.13 లక్షల్లో ముందుగా రూ.3 లక్షలు పెట్టి కందులను పప్పుగా మార్చే మిషన్లు, ప్యాకింగ్ కవర్లు, ఇతర పనిముట్లు కొనుగోలు చేశారు. మిగిలిన డబ్బుతో గ్రామంలోని రైతుల వద్ద కందులను క్వింటాల్‌కు రూ.5,800 చెల్లించి కొనుగోలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో కందులు కొనుగోలు చేయడం ప్రారంభించారు. మంత్రి హరీశ్ మార్క్‌ఫెడ్ వారితో మాట్లాడి క్వింటాల్‌కు రూ.4,100 చొప్పున సబ్సిడీపై కందులు ఇప్పించారు. ఇలా గతేడాదిలో మొత్తం రూ.21 లక్షల విలువ చేసే 40 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేశారు. ఈ కందులను మిల్లింగ్ చేయగా 28 టన్నుల పప్పు వచ్చింది. ఈ పప్పును ముందుగా కిలో రూ.80కి విక్రయించగా.. తర్వాత డిమాండ్ పెరగడంతో రూ.100కు పెంచారు. ఇలా మొత్తం రూ.26 లక్షల మేర డబ్బు వచ్చిందని మహిళలు తెలిపారు. ఈ ఏడాది 50 మెట్రిక్ టన్నుల కందులు అధికంగా కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వీళ్ల పప్పులకు.. వాళ్ల చిరుధాన్యాలు మిట్లపల్లి శ్రీవల్లి మహిళా సమాఖ్య తయారు చేసిన పప్పులకు రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోంది. కల్తీ లేని పప్పు తక్కువ ధరకు అమ్మడమే ఇందుకు కారణం. దీంతో జిల్లాలోనే కాకుండా హైదరాబాద్, నాచారం ప్రాంతాలకు కందిపప్పు సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి చిరుధాన్యాలు తెచ్చి సిద్దిపేటలో అమ్ముతున్నారు. సిద్దిపేట జిల్లాలో 17 వేల మహిళాసంఘాలు ఉండగా.. వాటిలో 1.8 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వీరికి ప్రతి ఒక్కరికీ నెలకు ఒక కిలో చొప్పున కంది పప్పు సరఫరా చేయాలని ఆలోచిస్తున్నారు. మెచ్చుకున్న సీఎం కేసీఆర్.. డిసెంబర్ 10న మిట్టపల్లిలో రైతు వేదిక సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మహిళలు కందులను పప్పుగా మార్చి అమ్మకాలు చేస్తున్న విషయాన్ని మంత్రి హరీశ్ సీఎంకు తెలపగా వారిని మెచ్చుకున్నారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఇతర అధికారులను పిలిచి రూ.3 కోట్లతో పప్పుతోపాటు పసుపు, కారం, వెల్లుల్లి మిశ్రమం, చిరుధాన్యాలు, నూనెల తయారీని ప్రోత్సహించాలని ఆదేశించారు. చేతి నిండా పని దొరికింది ‘మా గ్రామంలో వ్యవసాయం చేసుకుని బతికేవారు ఎక్కువ. కందులను పప్పుగా మార్చి అమ్మా లనే ఆలోచన కలిగింది. మంత్రి హరీశ్‌రావు సహకారంతో పనిమొదలు పెట్టాం. చేతి నిండా పని దొరికింది’. – లక్ష్మి, శ్రీవల్లి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సమష్టిగా పని చేసుకుంటున్నారు ‘రైతులు పండించిన కందులను మార్కెట్‌కు తీసుకెళ్లకుండా మా గ్రామంలోనే మహిళలు పప్పుగా తయారు చేసి అమ్ముతున్నారు. సిద్దిపేట, హైదరాబాద్ ప్రాంతాల వారు కూడా ఈ పప్పులను కొంటున్నారు. మార్కెట్లో దొరికే పప్పుకన్నా రుచిగా ఉంటోంది.’ – వంగ లక్ష్మి, సర్పంచ్, మిట్టపల్లి మహిళల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలకు ప్రోత్సాహమిస్తే మంచి ఫలితాలు సాధిస్తారని మిట్టపల్లి మహిళలు రుజువు చేశారు. పొదుపు డబ్బులతో నా దగ్గరకు వచ్చినప్పుడే వారిలో పట్టు దల కనిపించింది. ఇలా ప్రతి సం ఘం స్వయం సమృద్ధి సాధించాలి.’ – హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి -
జయ జయ ధ్వాన్యాలు
జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం. ప్రజలందరూ భరతమాతకు జయ జయ ధ్వానాలు అర్పించే రోజు. మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని మనం సమర్పించుకున్నాం. మరి... మన ఆహార విధానాలకు కూడా ఒక రాజ్యాంగం ఉండాలి కదా! ఈ ఆహార రాజ్యాంగంలో మొదట తారసపడేది సిరి ధాన్యాలే. దేశం చేవగా ఉండాలన్నా, దేహం దారుఢ్యంగా ఉండాలన్నా సిరి ధాన్యాలను స్వీకరించాల్సిందే! వీటిని చేసుకొని భుజించండి. జయ జయ ధాన్యాలు కొట్టండి. జొన్న సంగటి కావలసినవి: జొన్న రవ్వ – ఒక కప్పు; జొన్న పిండి – ఒక కప్పు; ఉప్పు – తగినంత. తయారీ: ►ఒక పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ►ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి ►జొన్న రవ్వను నిదానంగా వేస్తూ, ఆపకుండా కలుపుతుండాలి ►జొన్న పిండి కూడా వేసి కలియబెట్టి, మూత పెట్టి బాగా ఉడికించాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి) ►బాగా ఉడికిన తరవాత దింపేయాలి ►కొద్దిగా చల్లారాక గుండ్రటి ముద్దలు చేయాలి ►ఉల్లితరుగు, పచ్చిమిర్చి, సాంబారుతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. జొన్న ఇడ్లీ కావలసినవి: జొన్న రవ్వ – 3 కప్పులు; మినప్పప్పు – ఒక కప్పు; నూనె – తగినంత; ఉప్పు – తగినంత. తయారీ: ►మినప్పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు మూడు గంటలసేపు నానబెట్టాలి ►జొన్నరవ్వకు తగినన్ని నీళ్లు జత చేసి మూడు గంటలసేపు నానబెట్టాలి ►మినప్పప్పులో నీళ్లు వడగట్టేసి, పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►రవ్వలో నీటిని గట్టిగా పిండి తీసేసి, రుబ్బిన పిండిలో కలుపుకోవాలి ►తగినంత ఉప్పు జత చేసి ఆరేడు గంటలు నానబెట్టాలి ►ఇడ్లీ రేకులకు నూనె పూసి, ఒక్కో గుంటలో గరిటెడు పిండి వేసి, ఇడ్లీ రేకులను కుకర్‌లో ఉంచి, స్టౌ మీద పెట్టి, ఆవిరి మీద ఉడికించాలి ►వేడి వేడి ఇడ్లీలను చట్నీతో అందించాలి. జొన్న కిచిడీ కావలసినవి: పెసరపప్పు – అర కప్పు; జొన్న రవ్వ – ఒక కప్పు; ఉప్పు – తగినంత; ఆవాలు – ఒక టీ స్పూను; తరిగిన ఉల్లిపాయ – 1; అల్లం తురుము – అర టీ స్పూను; వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను; తరిగిన టొమాటో – 1; కరివేపాకు – రెండు రెమ్మలు; పసుపు – కొద్దిగా; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; క్యారట్ తరుగు – పావు కప్పు; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ►జొన్న రవ్వను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంట సేపు నానబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ►ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, టొమాటో తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ►కరివేపాకు, పసుపు వేసి కలియబెట్టాలి ►ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి, తగినంత ఉప్పు జత చేసి స్టౌ మీద ఉంచి, నీళ్లను మరిగించాలి ►పెసర పప్పు, జొన్న రవ్వ వేసి కలియబెట్టాలి ►మంట బాగా తగ్గించి గిన్నె మీద మూత పెట్టి, మెత్తగా అయ్యేవరకు ఉడికించి దింపేయాలి (అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి) ►కొత్తిమీరతో అలంకరించి, అందించాలి. రాగి ఉల్లిపాయల చపాతీ కావలసినవి: రాగి పిండి – ఒక కప్పు; తరిగిన ఉల్లిపాయ – ఒకటి; ఉప్పు – తగినంత; సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 3; పెరుగు – 2 చెంచాలు; కొత్తిమీర – అర కప్పు; నూనె – తగినంత. తయారీ: ►వెడల్పాటి పాత్రలో రాగి పిండి, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, పెరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి ►చిన్న చిన్న ఉండలు చేసి, చపాతీలా ఒత్తాలి (రాగి చపాతీ తొందరగా విరిగిపోతుంది కనుక చేతికి నూనె పూసుకుని, చేతితోనే ఒత్తాలి) ►స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేయాలి ►ఒత్తి ఉంచుకున్న రాగి చపాతీ వేసి రెండు వైపులా జాగ్రత్తగా కాల్చి తీసేయాలి ►పెరుగు, టొమాటో సాస్‌లతో తింటే రుచిగా ఉంటుంది. రాగి సేమ్యా ఖీర్ కావలసినవి: రాగి సేమ్యా – అర కప్పు; పాలు – 2 కప్పులు, కొబ్బరి తురుము – పావు కప్పు; పంచదార – అర కప్పు; ఏలకుల పొడి – చిటికెడు; జీడి పప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – తగినంత. తయారీ: ►ఒక పెద్ద గిన్నెలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ►స్టౌ మీద పాన్‌లో నెయ్యి వేసి కరిగించాక, జీడిపప్పు పలుకులను వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి ►రాగి సేమ్యా వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాక, మరుగుతున్న పాలలో వేసి కలియబెట్టాలి ►సేమ్యా ఉడికిన తరవాత పంచదార, కొబ్బరి తురుము వేసి కలిపి, బాగా ఉడుకుతుండగా ఏలకుల పొడి, జీడిపప్పు పలుకులు వేసి, ఒకసారి కలిపి స్టౌ మీద నుంచి దింపేసి, వేడివేడిగా అందించాలి. సజ్జ పరాఠా కావలసినవి: సజ్జ పిండి – ఒకటిన్నర కప్పులు; గోధుమ పిండి – అర కప్పు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; మెంతి పొడి – చిటికెడు; పచ్చి మిర్చి + అల్లం + వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; కొత్తిమీర – 2 టీ స్పూన్లు; పంచదార పొడి – ఒక టీ స్పూను; పెరుగు – పిండి కలపడానికి తగినంత. తయారీ: ►ఒక పెద్ద గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, నీళ్లు మరుగుతుండగా ఉప్పు జత చేయాలి ►ఒక పాత్రలో గోధుమ పిండి, సజ్జ పిండి, మెంతి పొడి, పంచదార పొడి వేసి కలపాలి ►వేడి నీళ్లు జత చేస్తూ పిండిని కలపాలి ∙పెరుగు జత చేస్తూ చపాతీ పిండిలా గట్టిగా కలపాలి ►పరాఠాలుగా ఒత్తాలి ►స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాగాక, పరాఠాను పెనం మీద వేసి, రెండు వైపులా దోరగా కాల్చి తీసేయాలి. సజ్జ పెసరట్టు కావలసినవి: సజ్జలు – ఒక కప్పు; పెసలు – ఒక కప్పు; బియ్యం – గుప్పెడు; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; పచ్చి మిర్చి – 4; అల్లం – చిన్న ముక్క; ఉప్పు – తగినంత; నూనె లేదా నెయ్యి – తగినంత తయారీ: ►ఒక పాత్రలో సజ్జలు, పెసలు, బియ్యం వేసి శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటలపాటు నానబెట్టాక, నీరు ఒంపేయాలి ►అన్నిటినీ గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ►అల్లం, పచ్చి మిర్చి, ఇంగువ జత చేసి మరోమారు రుబ్బి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►ఉప్పు, జీలకర్ర జత చేసి, మూత పెట్టి, గంటసేపు నాననివ్వాలి ►స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేయాలి ►గరిటెడు పిండి తీసుకుని, పెనం మీద సమానంగా పరచాలి ►రెండు వైపులా నెయ్యి వేసి దోరగా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి ►కొబ్బరి చట్నీ, అల్లం చట్నీలతో తింటే రుచిగా ఉంటాయి. సజ్జ పకోడీ కావలసినవి: సజ్జ పిండి – అర కప్పు; సెనగ పిండి – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; క్యారట్ తురుము – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►ఒక పాత్రలో సజ్జ పిండి, సెనగ పిండి, ఉల్లి తరుగు, క్యారట్ తురుము, పచ్చి మిర్చి తరుగు, మిరప కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి పకోడీల పిండి మాదిరిగా కలిపి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలి లో నూనె కాగాక, కలిపి ఉంచుకున్న పిండిని పకోడీలుగా వేయాలి ►బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►టొమాటో సాస్, చిల్లీ సాస్‌లతో తింటే రుచిగా ఉంటాయి. నిర్వహణ: వైజయంతి పురాణపండ -
సిరి ధాన్యాలను ఎందుకు తినాలి?
ఆధునిక రోగాల నివారణలో సిరిధాన్యాలు ఎంతో కీలక పాత్ర వహిస్తున్నాయి. మనకు, మన ముందు తరాల వారికీ, మన భూములకూ, వాతావరణానికి, మన ఆరోగ్యాలకూ ఇవి ఒక వరం. ప్రపంచానికే మార్గదర్శకంగా తిరిగి పరిచయం అవుతున్నాయి ఈ సిరిధాన్యాలు. సిరి ధాన్యాలు ఎందుకు తినాలి ... తరతరాల సంకరం తర్వాత వరి, గోధుమ పంటల్లో పీచు పదార్థం(ఫైబర్) తక్కువైపోయింది. ఎరువులూ, పురుగు మందులూ లేని వరి అన్నం, గోధుమలూ కరవయ్యాయి. వాటికి తోడు విషపూరితమైన కలుపు మందుల వాడకం పెరిగిపోయింది. మన ఆహారంలో ఉన్న సహజపీచు పదార్థమే (డైటరీ ఫైబర్) ఆహారం నుంచి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుంది. ఒకేసారిగా అధిక మొత్తంలో గ్లూకోజ్‌ను విడుదల జరిగే ప్రక్రియను నియంత్రిస్తుంది. ఒకేసారిగా అధిక మొత్తంలో గ్లూకోజ్‌ను విడుదల చేయాలా లేదా చిన్న మొత్తాలలో కొద్దిగంటల పాటు విడుదల చేయాలా అనేది ఆహారపు ధాన్యంలో ఇమిడి ఉన్న పీచు పదార్థమే నిర్ణయిస్తుంది.ప్రస్తుతం వరి, గోధుమ ఆహారపదార్థాలలో పీచు పదార్థం 0.25 శాతం– 0.5 శాతానికి తగ్గిపోయింది. అందుకే ఇవి తిన్న 15–35 నిమిషాలలో గ్లూకోజ్ (చక్కెరగా–అంటే జీర్ణమైన ఆహారానికి చివరి స్థితిగా)గా మారిపోయి, 100 గ్రాముల ఆహారం తింటే 70 గ్రాముల గ్లూకోజ్ (చక్కెర)గా ఒక్కసారిగా రక్తంలోకి వచ్చి చేరుతోంది. ఇలా రోజుకి మూడు, నాలుగు సార్లు జరిగితే ఎలా? వీటికి తోడుగా స్వీట్లు తింటే? బర్గర్, పిజ్జాలు మైదాతో చేసిన నాన్ రొట్టె కూడా తోడైతే? అధిక మొత్తాలలో గ్లూకోజు ఒకేసారిగా రక్తంలోకి చేరుకొని చేటు చేస్తుంది. కొవ్వు పెంచుతుంది. చక్కెర వ్యాధి ఉన్న వాళ్లని కష్టపెడుతుంది. అనేక రోగాలకు దారి తీస్తుంది. మైదాతో చేసిన పదార్థాలు మరీ ఘోరంగా 10 నిమిషాలలో గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తాయి. మైదా తయారీలో వాడే రసాయనాలు కూడా మన క్లోమ గ్రంధికి ఎంతో హానికరం. మన దేహంలోని రక్తంలో ఉండే గ్లూకోజ్ 6–7 గ్రాములే. ఆహారం తిన్న తరువాత అది జీర్ణమై, చివరికి గ్లూకోజ్‌గా మారి, రక్తంలోకి రావటం, దేహమంతా సరఫరా అవటం మామూలే. కానీ ఒక్కసారిగా 10 నిమిషాల్లో లేదా 30–40 నిమిషాలలో అధిక మొత్తంలో రావటం ఎవరి ఆరోగ్యానికీ మంచిది కాదు. పెద్దలకూ, మధుమేహం ఉన్న వారికీ, ఇతర రోగగ్రస్తులకూ (మలబద్దకం, ఫిట్స్, మొలలు, మూల శంక, ట్రైగ్లిసరైడ్స్, అధిక రక్తపీడనం అంటే బీపీ, మూత్రపిండాల రోగులు, హృద్రోగులు వగైరా అందరికీ) మరింత చేటు.అందుకే పీచు తక్కువగా ఉన్న లేదా పీచు అసలు లేని మైదా వంటి వాటిని దూరం పెట్టాలి. సిరిధాన్యాలు అలవాటు చేసుకోవాలి. ఇవి 5 నుంచి 7 గంటల పాటు కొద్ది కొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోజ్‌ను రక్తంలోకి వదులుతుంటాయి. కొర్ర బియ్యం, అరిక బియ్యం, ఊద బియ్యం, సామ బియ్యం, అండు కొర్ర బియ్యం 8 నుంచి 12 శాతం పీచు పదార్థం కలిగినవి. పూర్తిగా సేంద్రియమైనవి. ఈ ఐదూ ‘పంచరత్న సిరి ధాన్యాలు’గా ‘పాలిష్ చేయబడనివి’గా మరింత శ్రేష్ఠమైనవి. వీటితో అన్నం వండుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోస, బిర్యానీ, బిసిబేళ బాత్ కూడా చేసుకోవచ్చు. సిరి ధాన్యాలు ఎందుకు తినాలి ... మూడు పూటలా తిన్నప్పుడు ఆ రోజుకు మనిషికి అవసరమైన 25–30 గ్రాముల ఫైబర్ (ప్రతి మానవుడికీ రోజుకు 38 గ్రాముల ఫైబర్ కావాలి) ఈ ధాన్యాల నుంచే లభిస్తుంది. తక్కిన 10 గ్రాములూ కూరగాయల నుండి, ఆకుల కూరల నుంచి పొందవచ్చు.ఒక్కొక్క సిరిధాన్యం కొన్ని రకాల దేహపు అవసరాలనూ, ప్రత్యేకమైన రోగనిర్మూలన శక్తినీ కలిగి ఉన్నాయి. వరి, గోధుములలో పీచు పదార్థం 0.2 నుంచి 1.2 వరకూ ఉన్నప్పటికీ, అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పాలిష్ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలతో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపు కేంద్రం నుండి బయటి వరకూ, పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తి దోహదం చేస్తాయి. ఉదాహరణకి కొర్ర బియ్యం– సమతుల్యమైన ఆహారం. 8 శాతం ఫైబర్‌తో పాటు 12 శాతం ప్రోటీన్ కూడా కలిగి ఉంది. గర్భిణులకు సరైన ఆహారంగా సూచించవచ్చు. కడుపులో శిశువు పెరుగుతున్నప్పుడు సహజంగా స్త్రీలలో వచ్చే మలబద్దకాన్ని కూడా పోగొట్టే సరైన ధాన్యమిది. పిల్లల్లో ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు మూర్ఛలు వస్తాయి. వాటిని పోగొట్టగలిగే లక్షణం, నరాల సంబంధమైన బలహీనతకు సరైన ఆహారం కొర్ర బియ్యం. కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి క్యాన్సర్, ఊపిరి తిత్తుల క్యాన్సర్, ఉదర క్యాన్సర్ ,పార్కిన్సన్, ఆస్తమాను నివారించడంలో కూడా కొర్రబియ్యం దోహదపడుతుంది.పాశ్చాత్య దేశాల్లో, వారి ఆహారంలో ఫైబర్ లేదని గ్రహించి, 2–3 ఫైబర్ టాబ్లెట్లను నీటిలో వేసుకుని సేవిస్తూ ఉంటారు. అది శాస్త్రీయమైనది కాదు. సహజంగా ఆహారంలోనే ఫైబర్ ఇమిడి ఉండటం మాత్రమే రక్తంలోకి గ్లూకోజు విడుదలని సమర్థవంతంగా నియంత్రించగలదు.ఇలాగే అరికలు బియ్యం.... రక్త శుద్ధికీ, ఎముకల మజ్జ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చూసేందుకూ, అస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేటు, రక్త క్యాన్సర్, ప్రేగులు, థైరాయిడ్, గొంతు క్లోమ గ్రంధుల, కాలేయపు క్యాన్సర్లూ తగ్గించుకోవడానికి అరికలు ఎంతో మేలు చేస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్, వైరస్ జ్వరం వగైరాల తర్వాత నీరసించిన వారి రక్త శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి అరికలు. సామ బియ్యం మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులను బాగుచేస్తాయి. ఆడవారిలో pఛిౌఛీ తగ్గించుకోవచ్చు. మగ వారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. ఇవి కాక మానవుడి లింఫు మండలపు శుద్ధికి సామలు ఎంతో పనికి వస్తాయి. ఊద బియ్యం థైరాయిడ్, క్లోమ గ్రంధులకు మంచివి. చక్కెర వ్యాధిని పారదోలుతాయి. కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్ధికి కూడా ఇవి పనిచేస్తాయి. కామెర్లను తగ్గించడానికి, వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయం, గర్భాశయ క్యాన్సర్లను తగ్గించడానికి పనిచేస్తాయి. ఊద బియ్యం జీర్ణ మండలంలోని కష్టాలను తీసివేస్తాయి. మొలలూ, భగన్దరం, మూల శంక, జజీటటuట్ఛటఅల్సర్లు, మెదడు, రక్త, స్తనాలు, ఎముకల, ఉదర, ప్రేగుల, చర్మ సంబంధమైన క్యాన్సర్... మొదలైన సమస్యలను పోగొట్టడంలో తమ పాత్రను అద్భుతంగా పోషిస్తాయి. (మరింత సమాచారం లోపలి పేజీల్లో) డాక్టర్ ఖాదర్ వలి ఆరోగ్య–ఆహార నిపుణులు -
'రైతుల పరిస్థితి బిచ్చగాళ్ల కంటే అధ్వానం'
నల్లగొండ: నల్లగొండ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి బుధవారం పర్యటించారు. మార్కెట్ లో ఉన్న ధాన్యం నిల్వలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో రైతుల పరిస్థితి బిచ్చగాళ్ల కంటే అధ్వానంగా మారిందని విమర్శించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీతాలు పెంచడం అవసరమా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వు...
ఈ భూభాగంలో అత్యంత ఆకర్షణీయమైనది, అద్భుత ఔషధ గుణాలు కలిగిది, సుగంధ ద్రవ్యాలలో అత్యంత ఖరీదైనది కుంకుమపువ్వు. ఈ పేరు వినగానే మనకు వెంటనే కాశ్మీర్ గుర్తుకు వస్తుంది. నిజానికి కుంకుమపువ్వు స్వస్థలం దక్షిణ ఐరోపా! అక్కడ నుంచే వివిధ దేశాలకు విస్తరించింది. గ్రీసు, స్పెయిన్, ఇరాక్, ఇటలీ, సిసిలీ, టర్కీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లోనూ దీన్ని ఎక్కువగా పండిస్తారు. అయితే, అన్నింటిలోకి కాశ్మీరీ కుంకుమపువ్వు నాణ్యమైనది. క్రీ.పూ. 500 సంవత్సరాలకు ముందే మన దగ్గర దీని ప్రస్తావన ఉంది. వేదకాలపు సంస్కృతిలోనూ ప్రముఖమైన సౌందర్యపోషణ ద్రవ్యమిది. వంటకాలకు ప్రత్యేకమైన రంగు, రుచిని ఇస్తుంది. నాటి రాచరిక కాలపు దర్పణానికి చిహ్నం ఈ కుంకుమ పువ్వు. ఈ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా, కొద్దిగా తియ్యగా ఉంటుంది. కుంకుమపువ్వు అందించే మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు. పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారుచేస్తారు. ఒక కిలో కుంకుమపువ్వు తయారుచేయాలంటే కనీసం రెండు లక్షల పూలు అవసరమవుతాయి. తిండి గోల -
పప్పులకు పురుగు పట్టకుండా ఉండాలంటే...
పప్పులు, తృణ ధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో కొన్ని వేపాకులను పెడితే చాలు. వంట చేసేటప్పుడు స్టవ్ మీద పడిన మరకలు అంత సులువుగా పోవు. అలాంటప్పుడు పెద్ద సైజు టొమాటో ముక్కను తీసుకొని దాన్ని ఉప్పులో ముంచి మరకలపై రుద్దాలి. ఇలా చేస్తే ఎలాంటి మరకలైనా త్వరగా పోతాయి. అంతే కాకుండా ఎన్నేళ్ల స్టవ్ అయినా కొత్తదానిలా మిలమిలా మెరుస్తుంది. పచ్చి బటానీలు ఉడికిస్తున్నప్పుడు వాటి రంగు మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఆ నీళ్లలో కొద్దిగా పంచదార వేస్తే చాలు.కాఫీ మరింత రుచిగా ఉండాలంటే, డికాషిన్‌లో కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. ఇంటిప్స్ -
ధాన్యానికి మద్దతు ధర చెల్లించండి
ధాన్యానికి మద్దతు ధర చెల్లించండి ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : జిల్లాలో ఖరీఫ్‌లో పండిన ప్రతి ధాన్యం బస్తాకు గిట్టుబాటు ధర అందించి రైతులను ఆదుకోవాలని రైస్ మిల్లర్లను కలెక్టర్ సిద్ధార్థ జైన్ కోరారు. కలెక్టరేట్లో మంగళవారం రాత్రి నిర్వహించిన రైస్‌మిల్లర్లు, మార్కెటింగ్, సహకార శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చించారు. కలెక్టర్ మాట్టాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు సందిగ్ధంలో ఉన్నారని, ఇటువంటి స్థితిలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకన్నా ఎక్కువకే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలబడాలని మిల్లర్లను కోరారు. జిల్లా రైస్‌మిల్లర్ల సంఘ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ జిల్లాలో రైతుల దగ్గర కనీస మద్దతు ధరకన్నా రూ.70 నుంచి 100 వరకూ ఎక్కువకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. ఎఫ్సీఐకు 8 కిలోమీలర్ల పైబడి దూరం నుంచి లేవీ తోలేటప్పుడు రవాణా ఛార్జీలు ఇవ్వడం లేదన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో జేసీ బాబూరావు నాయుడు, ఎప్సీఐ డెప్యూటీ జీఎం రాజు, డీఎస్వో శివశంకర్‌రెడ్డి, డీసీవో రామ్మెహన్, మార్కెటింగ్ ఏడీ శర్మ, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు ఉన్నమట్ల కబర్థి, బూరుగుపల్లి వీర రాఘవులు, నర్సిరెడ్డి, టి.లక్ష్మణరావు, వానపల్లి బాబూరావు పాల్లొన్నారు. 27,134 మందికి రేషన్ కూపన్ల పంపిణీ జిల్లాలో ఇప్పటివరకూ 34 మండలాలు, మునిసిపాలిటీలలో రచ్చబండ కార్యక్రమం ద్వారా 27,134 మంది లబ్ధిదారులకు రేషన్ కూపన్లను అందించామని కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం వారం రోజుల్లో 41,510 దరఖాస్తులు రాగా, రేషన్ కార్డులలో మార్పుల కోసం 388 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇప్పటివరకూ 15,729 మందికి పింఛన్లు అందించినట్టు చెప్పారు. 2,267 మంది వికలాంగులకు పింఛన్లు మంజారు చేసి పత్రాలను అందించామన్నారు. కొత్తగా వివిధ పింఛన్లు మంజారు కోరుతూ 25,570 దరఖాస్తులు అందాయని వివరించారు. ఇళ్ల మంజూరుకు 13,047 మందికి మంజారు పత్రాలు అందించగా మరో 21,681 మంది కొత్తగా దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. కుటుంబ సహాయ పథకం కింద 647 మంది అర్హులను గుర్తించి ఇప్పటివరకూ 281 మందికి మంజూరు చేశామని కలెక్టర్ సిద్ధార్థ జైన్ వివరించారు.