
పొట్టు తీయని ధాన్యాలను (హోల్ గ్రేయిన్స్‌ను) ఆహారంగా తీసుకుంటే అందులోని పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య కారకాలన్న విషయం తెలిసిందే. ఇక ఇదే అంశం ఆరోగ్యానికి మరో అనుకూలమైన అంశంగా నిరూపితమైందని చెబుతున్నారు పరిధకులు. పొట్టు ఉన్న కారణంగా హోల్ గ్రెయిన్స్ జీర్ణమయ్యే వేగం చాలా నెమ్మదిగా కొనసాగుతుంటుందట. అందువల్లనే ఒంట్లోకి చక్కెర విడుదలు సైతం ఆలస్యమవుతుంటాయి.
ఫలితంగా ఇన్సులిన్ విడుదల యంత్రాంగం మంచి నియంత్రితంగా ఉంటుందంటున్నారు పరిశోధకులు. ఇక వరి, ఓట్స్, గోధుమ, బార్లీ వంటి వాటిని పొట్టుతో తినడం వల్ల బరువు పెరగకుండా ఉండే మరో ప్రయోజనమూ ఉంటుందట. ఉదాహరణకు వరిని ముడిబియ్యంగా తినడం వల్ల, పొట్టుతీసిన వాటితో పోలిస్తే తక్కువ బరువు పెరుగుతారట. దాంతో స్థూలకాయంతో వచ్చే అనర్థాలనూ తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. నిరూపితమైన ఈ అధ్యయన ఫలితాలను ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ప్రచురించారు.
Comments
Please login to add a commentAdd a comment