పొట్టు తీయని ధాన్యాల (హోల్ గ్రేయిన్స్)లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయన్నది తెలిసిందే. ఈ పొట్టు కారణంగానే అవి చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంటాయి. అందుకే వాటిల్లోంచి వచ్చే కార్బోహైడ్రేట్లు రక్తంలో నెమ్మదిగా కలుస్తుంటాయి. ఫలితంగా ఒంట్లోకి విడుదలయ్యే చక్కెర మోతాదులూ ఆలస్యమవుతాయి.
పొట్టుతీయని వరి విషయంలో ముడి బియ్యం మాదిరిగానే పొట్టు తీయని ఓట్స్, గోధుమ, బార్లీ వంటి వాటిని అలాగే తీసుకోవడం వల్ల పొట్టుతీసిన వాటితో పోలిస్తే తక్కువగా బరువు పెరుగుతారని, అందువల్ల ఇన్సులిన్ విడుదల యంత్రాంగం కూడా నియంత్రితంగా పనిచేస్తూ పూర్తిస్థాయి ఆరోగ్యకరంగా ఉంటుందంటున్నారు పరిశోధకులు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ప్రచురితమైంది. ∙ఇలా తినడం వల్ల ఊబకాయం తగ్గడంతో ΄ాటు స్థూలకాయంతో వచ్చే అనేక అనర్థాలనూ తగ్గించుకోవచ్చన్నది పరిశోధకుల మాట.
Comments
Please login to add a commentAdd a comment