ఎస్‌ఓటీ పోలీసులు స్వాదీనం చేసుకున్న నాసిరకం అల్లం, వెల్లుల్లి, రసాయన పదార్థాలు
కీసర: నాసిరకం అల్లం, వెల్లుల్లి తయారీ కేంద్రంపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. కీసర ఇన్‌స్పెక్టర్ రఘువీర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఈస్ట్‌గాంధీనగర్‌లో ఓ ఇంటిలో నాసిరకం అల్ల,వెలుల్లి తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం సాయంత్రం ఆ ఇంటిపై దాడి చేశారు. తనకు అన్నిరకాల అనుమతులు ఉన్నట్లు పట్టుబడిన వ్యక్తి చెప్పడంతో పోలీసులు సమగ్ర విచారణ జరిపారు.
కూషాయిగూడ చక్రీపురానికి చెందిన కొత్తపల్లి భానుప్రసాద్(58) కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకొని కొన్నిరోజులుగా అదనపు లాభం కోసం నాసిరకం అల్లం, వెల్లుల్లి తయారు చేస్తున్నాడు. ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా పౌల్ట్రీమీల్, అజాంటాక్స్‌టైటానియం డయాక్సైడ్‌యాంటాస్ట్ రసాయనాలు కలిపారని తెలిపారు. జాడులు, డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 4044 కిలోల అల్లం, వెల్లుల్లి పేస్టు.. రసాయనాలు అజాంటాక్స్ 40 కిలోలు, పౌల్ట్రీమీల్ 30 కిలోలు, ఎసిటిక్ యాసిడ్ 20లీటర్లు, సిట్రిక్ యాసిడ్ 20 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment