Ginger garlic paste
-
ఇది చూస్తే జీవితంలో అల్లం పేస్ట్ వాడరు
-
వర్షాకాలంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ : చిట్కాలు
కూరల్లో రుచి కావాలంటే దానికి కావాలసిన అన్ని పదార్థాలు సమపాళ్లలో పడాలి. ముఖ్యంగా ఉప్పు,కారం, నూనె, అల్లం వెల్లుల్లి, మసాలా. అయితే వంట తొందరగా అయిపోతుందనో, సమయాభావం వల్లనో చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ముందే రెడీ చేసి పెట్టుకుంటారు. మరి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి? తెలుసుకుందామా?మార్కెట్లో ఇన్స్టెంట్గా చాలా రకాల మసాలాలు, పొడులు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రస్తుతం కాలంలో వాటిని ఎంతవరకు నమ్మాలి అనేది ప్రధాన సమస్య. ముఖ్యంగా అల్లం , వెల్లుల్లి పేస్ట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుళ్లిపోయిన బంగాళాదుంపలు, పేపర్ ముక్కలు తదితర వస్తువులతో అనారోగ్య వాతావరణంలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారవుతుందున్న వార్తల మధ్య అల్లం, వెల్లుల్లి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి రెండూ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పొట్టు తీసిన శుభ్రంగా కడిగిన అల్లం, పొట్టువలిచిన వెల్లుల్లికలిపి మెత్తగా మిక్సీలో నూరుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు కలుపుకుంటే పాడు గాకుండా ఉంటుంది. ఈ పేస్ట్‌ను గాలి చొరబడని గాజు సీసాలో పుంచి, ఫ్రిజ్‌లో భద్రపరచాలి.ఒకరోజు వాడిన స్పూను మరో రోజు వాడకుండా, తడి తగలకుండా జాగ్రత్త పడాలి. ఉప్పు లేదా నూనె, లేదా పసుపు కలపడం వల్ల కనీసం రెండు వారాలు నిల్వ ఉంటుంది. అలాగే వెనిగర్‌ను కూడా కలుపుతారు.ఇలాంటి చిట్కాలు పాటిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడైపోదు. పైగా కలర్ మారకుండా, మంచివాసనతో ఉంటుంది. -
హైదరాబాద్ లో మరో కల్తీ దందా..
-
కుళ్లిపోయిన అల్లం వెల్లులితో పేస్ట్ తయారీ
-
కుళ్లిన అల్లం, వెల్లుల్లితో.. ప్రజల ప్రాణాలతో చెలగాటం
ఆదిలాబాద్‌టౌన్: ప్రజల అవసరాలను సొమ్ము చేసుకోవడంతో పాటు వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు కొంతమంది వ్యాపారులు. గతంలో జిల్లా కేంద్రంలో కల్తీ, గడువు దాటిన నూనె, కల్తీ చాయ్ పత్తి తయారు చేస్తూ పట్టుబడ్డ విషయం విదితమే. తాజాగా జిల్లా కేంద్రంలోని ఖానాపూర్‌లో కుళ్లిన అల్లం, వెల్లుళ్లితో పేస్ట్, ఇతర మసాలాలు తయారు చేస్తున్న వ్యాపారి గుట్టురట్టయ్యింది. శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్ సమయంలో ఫ్యాక్టరీలోకి వెళ్లి పరిశీలించగా కుళ్లిన ఎల్లిగడ్డలు, అల్లం పేస్ట్ డబ్బాల్లో ప్యాకింగ్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో మున్సిపల్ అధికారులకు సమాచారం అందించడంతో ఈ తతంగం బయటపడింది. ఏడేళ్లుగా వ్యాపారం.. పట్టణంలోని ఆర్ఆర్ ఫుడ్ ప్రొడక్ట్ పేరిట ఖానాపూర్లోని క్రిస్టల్ గార్డెన్ వెనకాల ఈ ఫ్యాక్టరీని కొనసాగిస్తున్నారు. పట్టణంలోని బొక్కల్‌గూడకు చెందిన సిరాజ్ అహ్మద్ పేరిట ఈ ఫ్యాక్టరీ కొనసాగుతోంది. నిర్వాహకుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుమతి ఉందని చెబుతున్నాడు. అయితే మున్సి పాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఏడేళ్లుగా అక్రమంగా నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఎంఎస్ఎంఈ (చిన్న తరహా పరిశ్రమల) అనుమతి కూడా లేదు. సివిల్సప్లై లైసెన్స్ తీసుకోవాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం కొనసాగిస్తున్నారు.ఽ పర్యవేక్షణ కరువు.. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కుల ఆగడాలు కొనసాగుతున్నాయి. వారి అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యాపారులు ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు మరవడంతో ఇలాంటి ఫ్యాక్టరీల్లో హానికరమైన పదార్థాలను తయారు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అనుమతులు లేకుండా వెలుస్తున్న ఫ్యాక్టరీపై అధికారులు నిఘా ఉంచి చర్యలు చేపట్టకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. ఫ్యాక్టరీ సీజ్.. ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ, కుళ్లిన పదార్థాలు తయారు చేసి సరఫరా చేస్తున్న ఫ్యాక్టరీకి శుక్రవారం శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్, ఆదిలాబాద్‌అర్బన్ తహసీల్దార్ భోజన్న సీల్ వేశారు. ఆహార పదార్థాల నాణ్యతపై శాంపిల్స్ సేకరించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేపట్టేందుకు సమాచారం అందించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, వన్‌టౌన్ సీఐ రామకృష్ణ, ఎస్సై అజరొద్దీన్, ఆదిలాబాద్ ఆర్ఐ మహేష్, మున్సిపల్, రెవెన్యూ శాఖాధికారులు సందర్శించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. -
బరితెగిస్తున్న కల్తీగాళ్లు
కీసర: నాసిరకం అల్లం, వెల్లుల్లి తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. కీసర ఇన్స్పెక్టర్ రఘువీర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఈస్ట్గాంధీనగర్లో ఓ ఇంటిలో నాసిరకం అల్ల,వెలుల్లి తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు సోమవారం సాయంత్రం ఆ ఇంటిపై దాడి చేశారు. తనకు అన్నిరకాల అనుమతులు ఉన్నట్లు పట్టుబడిన వ్యక్తి చెప్పడంతో పోలీసులు సమగ్ర విచారణ జరిపారు. కూషాయిగూడ చక్రీపురానికి చెందిన కొత్తపల్లి భానుప్రసాద్(58) కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకొని కొన్నిరోజులుగా అదనపు లాభం కోసం నాసిరకం అల్లం, వెల్లుల్లి తయారు చేస్తున్నాడు. ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా పౌల్ట్రీమీల్, అజాంటాక్స్టైటానియం డయాక్సైడ్యాంటాస్ట్ రసాయనాలు కలిపారని తెలిపారు. జాడులు, డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 4044 కిలోల అల్లం, వెల్లుల్లి పేస్టు.. రసాయనాలు అజాంటాక్స్ 40 కిలోలు, పౌల్ట్రీమీల్ 30 కిలోలు, ఎసిటిక్ యాసిడ్ 20లీటర్లు, సిట్రిక్ యాసిడ్ 20 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ అల్లం పేస్ట్ తయారీ కేంద్రంపై పోలీసుల దాడి
సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్‌లో నకిలీ అల్లం పేస్ట్ తయారీ కేంద్రంపై దాడి చేసి మహ్మద్ అనే వ్యక్తిని మల్కాజ్ గిరి ఎస్ ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఉప్పల్‌లోని కేసీఆర్ నగర్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ చేస్తున్న నిందితుడి నుంచి 500 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1000 కిలోల ముడిసరుకు, తయారు చేసే మేషిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
అల్లం,వెల్లుల్లి కల్తీ పేస్ట్
-
ఇంటికి అందం.. వంటింటికి రుచి
ఇంటిప్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే, గ్రైండ్ చేసేప్పుడు ఒక స్పూన్ నూనె కలపాలి.పండ్లను కోశాక ముక్కలు నల్లబడకుండా వుండాలంటే, ముక్కలపై ఉప్పు కలిపిన నీళ్లు చల్లి తడిబట్టతో కప్పాలి.బంగాళాదుంప, చిలగడదుంప మొలకలు పెరిగితే, వాటిని ముక్కలుగా కోసి కుండీలలో... జార్లో నీళ్ళుపోసి పెంచొచ్చు. ఇండోర్ ప్లాంట్‌గా ఇంటి అందాన్ని పెంచుతాయి.ఇనుప సామాను తుప్పుపట్టకుండా ఉండడానికి వాటి మధ్య కర్పూరం బిళ్ళలు ఉంచాలి. ఖీర్ మిగిలిపోతే మళ్ళీ వేడి చేయకూడదు. దాన్నలాగే కుల్ఫీకప్స్లో పోసి ఫ్రిజ్‌లో పెట్టి, పిల్లలకివ్వవచ్చు. కొత్తిమీర, కరివేపాకు, పుదీన వంటి ఆకు కూరలు న్యూస్పేపర్లో చుట్టి పాలిథిన్ కవర్లో వుంచితే ఎక్కువకాలం నిలవ వుంటాయి.గోడలమీద క్రేయాన్‌తో గీసిన గీతలు పోవాలంటే సిగరెట్ బూడిదతో రుద్దాలి. కిరోసిన్ లో ముంచిన బట్టతో కిటికీలు, తలుపులు తుడిస్తే తుప్పు మరకలు పోతాయి. ఆ వాసనకు దోమలు కీటకాలు ఇంట్లోకి రావు. -
అల్లం వెల్లుల్లి నిల్వ ఉండాలంటే..!
కిచెన్ కిటుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే... రుబ్బే ముందు వాటిని కాస్త దోరగా వేయించాలి. అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే... తరిగిన తర్వాత నీటిలో కాకుండా మజ్జిగలో వేయాలి. అలా చేయడం వల్ల కూర కూడా రుచిగా ఉంటుంది. బియ్యం, పప్పులు పురుగు పట్టకుండా ఉండాలంటే... కొన్ని పసుపు కొమ్ములు వేస్తే సరి. ఉల్లిపాయను సగం వాడాక, రెండో సగం నల్లగా అయి పాడవుతుంది. అలా కాకుండా ఉండాలంటే... ఆ బద్దకు వెన్న రాసి ఉంచాలి. పాలు ఎక్కువ మీగడ కట్టాలంటే... పాలు పోసిన గిన్నెను ముందు కాసేపు చల్లని నీటిలో ఉంచి, అప్పుడు కాచాలి.