అల్లం వెల్లుల్లి నిల్వ ఉండాలంటే..!
కిచెన్ కిటుకు
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే... రుబ్బే ముందు వాటిని కాస్త దోరగా వేయించాలి. అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే... తరిగిన తర్వాత నీటిలో కాకుండా మజ్జిగలో వేయాలి. అలా చేయడం వల్ల కూర కూడా రుచిగా ఉంటుంది. బియ్యం, పప్పులు పురుగు పట్టకుండా ఉండాలంటే... కొన్ని పసుపు కొమ్ములు వేస్తే సరి. ఉల్లిపాయను సగం వాడాక, రెండో సగం నల్లగా అయి పాడవుతుంది. అలా కాకుండా ఉండాలంటే... ఆ బద్దకు వెన్న రాసి ఉంచాలి. పాలు ఎక్కువ మీగడ కట్టాలంటే... పాలు పోసిన గిన్నెను ముందు కాసేపు చల్లని నీటిలో ఉంచి, అప్పుడు కాచాలి.