Kitchen technique
-
డ్రైఫ్రూట్స్.. ఇలా చేస్తే వర్షాకాలంలో ఫ్రెష్‌గా ఉంటాయి
బ్రెడ్ ప్యాకెట్లో కొన్ని స్లైసులను మాత్రం వాడి మిగిలిన వాటిని ప్యాకెట్లో అలానే ఉంచేస్తుంటాం. అయితే అవి కొన్నిసార్లు రాయిలా గట్టిగా మారతాయి. ఇటువంటప్పుడు బ్రష్‌ను నీటిలో ముంచి స్లైసులపైన రాయాలి. తరువాత కొద్దిగా నీటిని చల్లి, స్లైసులను పదిహేను సెకన్ల పాటు అవెన్‌లో ఉంచితే మెత్తగా తాజాగా మారిపోతాయి. డ్రైఫ్రూట్స్‌ని మార్కెట్ నుంచి తెచ్చిన తరువాత కొద్దిగా ఉప్పువేసి దోరగా వేయించి, గాలిచొరబడని డబ్బాలో నిల్వచేస్తే వర్షాకాలంలోనూ మెత్తబడకుండా, పాడవకుండా కరకరలాడతాయి. ఒక గుడ్డు తెల్ల సొనలో స్పూను తేనె వేసి చక్కగా కలపౠలి. ఈ మిశ్రమాన్ని ముక్కుమీద, చుట్టూ పూతలా వేసి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది. -
తక్కువ నూనెతో గ్రిల్ చేసి పెట్టే స్మోక్లెస్ గ్రిల్ ధర ఎంతంటే!
సెలవురోజుల్లో, చిన్న చిన్న పార్టీల్లో.. గ్రిల్ ఐటమ్స్ పక్కా అంటుంటారు భోజన ప్రియులు. నాన్‌స్టిక్ పాత్రల్లో.. ఎక్కువ నూనె పోసి.. ఒక్కో ఐటమ్ గ్రిల్ చేసుకునేకంటే.. ఒకేసారి ఎక్కువ ఐటమ్స్‌ని అతి తక్కువ నూనెతో గ్రిల్ చేసి పెట్టే ఈ ఇన్డోర్ గ్రిల్ వంట గదిలో ఉంటే రుచులకు కొదవే ఉండదు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఈ స్మోక్లెస్ నాన్‌స్టిక్ ఇండోర్ ఎలక్ట్రిక్ గ్రిల్.. ఆహారం నుంచి కొవ్వును వేరుచేస్తుంది. దీనిపైన నాన్‌స్టిక్ పాన్ని సులభంగా డివైజ్ నుంచి వేరుచేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. దీనికి అనువైన మూత కూడా ఉంటుంది. దాంతో దీనిలో ఆహారం వేగంగా గ్రిల్ అవుతుంది. ఈ గ్రిల్‌కి ఇరువైపులా పట్టుకోవడానికి వీలుగా హ్యాండిల్స్ ఉంటాయి. టెంపరేచర్ పెంచుకోవడానికి ఒకవైపు అడ్జస్టబుల్ రెగ్యులేటర్ ఉంటుంది. గ్రిల్ చేసుకునే ఐటమ్‌ని బట్టి టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ధర : 55 డాలర్లు (రూ.4,109) చదవండి: ఏంటిది.. నాకు తలకొట్టేసినట్టు అయ్యింది.. ఆ ఫొటోలు, వీడియోలను ఎలా తొలగించాలి? -
వంటింటి చిట్కాలతో వింటర్ కష్టాలు పరార్: సోహా అలీఖాన్
బాలీవుడ్ తారల్లో సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ వార్తల్లో ఉంటూ అందర్నీ ఆకట్టుకునే కొందరిలో సైఫ్ సోదరి నటి సోహా అలీఖాన్ కూడా ముందు వరుసలో ఉంటుంది. తాజాగా తన వర్కవుట్స్ వీడియోస్ ద్వారా ఈ మధ్య వయసు నటి అందర్నీ ఆకట్టుకున్న సోహా... సంప్రదాయ వైద్య చిట్కాలనే తాను ఫాలో అవుతానని అంటోంది. తన ఆరోగ్య రహస్యం అదేనని చెప్పిందీమె. ప్రస్తుత వింటర్ సీజన్‌ను ఎదుర్కోవడానికి ఫ్యాన్స్ కోసం కొన్ని టిప్స్ కూడా ఇస్తోంది. ఆమె ఏం చెప్తోందంటే... ‘వర్షాకాలం ముగియడం, శీతాకాలం ఆరంభం కావడం వంటి వాతావరణ మార్పుల కారణంగా దగ్గు, జలుబు లాంటి సమస్యలు అధికంగా కనిపిస్తుంటాయి. మన ఆరోగ్యం కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శ్వాస ఆరోగ్యం నిర్వహించుకోవడంలో అత్యంత కీలకం ఇది. యోగా సాధన ఈ సీజన్లో చాలా మంచిది. వాతావరణంలో అకస్మాత్తుగా జరిగే మార్పులను తట్టుకుని నిలబడటానికి శరీరానికి కొంత సమయం ఇవ్వడం అవసరం. అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు నేను మా పెద్ద వాళ్ల అడుగు జాడల్లో నడుస్తుంటాను. మా అమ్మ చిన్నప్పుడు మా కోసం చేసినట్టు.. విక్స్ వ్యాపోరబ్తో ఆవిరి పట్టడం, యూకలిప్టస్, కర్పూరం, పుదీనా వంటి వాటిని వంటింటి వైద్యంలో భాగంగా వినియోగించడం చేస్తాను. తగినంత వేడిగా ఉండే వంటకాలు, సీజన్‌కు తగ్గట్టుగా సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం ద్వారా శ్వాస కోస వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. నా కుమార్తె ఇన్నాయాతో కలిసి సూర్యాస్తమయం చూడటాన్ని అమితంగా ఇష్టపడతాను. అది కూడా నాకు చాలా రిలీఫ్ ఇస్తుంది’ అని తెలిపారు. -
అల్లం వెల్లుల్లి నిల్వ ఉండాలంటే..!
కిచెన్ కిటుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే... రుబ్బే ముందు వాటిని కాస్త దోరగా వేయించాలి. అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే... తరిగిన తర్వాత నీటిలో కాకుండా మజ్జిగలో వేయాలి. అలా చేయడం వల్ల కూర కూడా రుచిగా ఉంటుంది. బియ్యం, పప్పులు పురుగు పట్టకుండా ఉండాలంటే... కొన్ని పసుపు కొమ్ములు వేస్తే సరి. ఉల్లిపాయను సగం వాడాక, రెండో సగం నల్లగా అయి పాడవుతుంది. అలా కాకుండా ఉండాలంటే... ఆ బద్దకు వెన్న రాసి ఉంచాలి. పాలు ఎక్కువ మీగడ కట్టాలంటే... పాలు పోసిన గిన్నెను ముందు కాసేపు చల్లని నీటిలో ఉంచి, అప్పుడు కాచాలి.