బ్రెడ్ ప్యాకెట్‌లో కొన్ని స్లైసులను మాత్రం వాడి మిగిలిన వాటిని ప్యాకెట్‌లో అలానే ఉంచేస్తుంటాం. అయితే అవి కొన్నిసార్లు రాయిలా గట్టిగా మారతాయి. ఇటువంటప్పుడు బ్రష్‌ను నీటిలో ముంచి స్లైసులపైన రాయాలి. తరువాత కొద్దిగా నీటిని చల్లి, స్లైసులను పదిహేను సెకన్ల పాటు అవెన్‌లో ఉంచితే మెత్తగా తాజాగా మారిపోతాయి.
డ్రైఫ్రూట్స్‌ని మార్కెట్ నుంచి తెచ్చిన తరువాత కొద్దిగా ఉప్పువేసి దోరగా వేయించి, గాలిచొరబడని డబ్బాలో నిల్వచేస్తే వర్షాకాలంలోనూ మెత్తబడకుండా, పాడవకుండా కరకరలాడతాయి.
ఒక గుడ్డు తెల్ల సొనలో స్పూను తేనె వేసి చక్కగా కలపౠలి. ఈ మిశ్రమాన్ని ముక్కుమీద, చుట్టూ పూతలా వేసి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment