Healthy Indoor Smokeless Grill: How It Works And Price Details Check - Sakshi
Sakshi News home page

Indoor Smokeless Grill: అతి తక్కువ నూనెతో గ్రిల్‌ చేసి పెట్టే స్మోక్‌లెస్‌ గ్రిల్‌ ధర..రూ.4,109!

Published Thu, Mar 10 2022 2:20 PM | Last Updated on Thu, Mar 10 2022 3:47 PM

Healthy Indoor Smokeless Grill: How It Works Price Details Check - Sakshi

సెలవురోజుల్లో, చిన్న చిన్న పార్టీల్లో.. గ్రిల్‌ ఐటమ్స్‌ పక్కా అంటుంటారు భోజన ప్రియులు. నాన్‌స్టిక్‌ పాత్రల్లో.. ఎక్కువ నూనె పోసి.. ఒక్కో ఐటమ్‌ గ్రిల్‌ చేసుకునేకంటే.. ఒకేసారి ఎక్కువ ఐటమ్స్‌ని అతి తక్కువ నూనెతో గ్రిల్‌ చేసి పెట్టే ఈ ఇన్‌డోర్‌ గ్రిల్‌ వంట గదిలో ఉంటే రుచులకు కొదవే ఉండదు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఈ స్మోక్‌లెస్‌ నాన్‌స్టిక్‌ ఇండోర్‌ ఎలక్ట్రిక్‌ గ్రిల్‌.. ఆహారం నుంచి కొవ్వును వేరుచేస్తుంది.

దీనిపైన నాన్‌స్టిక్‌ పాన్‌ని సులభంగా డివైజ్‌ నుంచి వేరుచేసుకుని క్లీన్‌ చేసుకోవచ్చు. దీనికి అనువైన మూత కూడా ఉంటుంది. దాంతో దీనిలో ఆహారం వేగంగా గ్రిల్‌ అవుతుంది. ఈ గ్రిల్‌కి ఇరువైపులా పట్టుకోవడానికి వీలుగా హ్యాండిల్స్‌ ఉంటాయి. టెంపరేచర్‌ పెంచుకోవడానికి ఒకవైపు అడ్జస్టబుల్‌ రెగ్యులేటర్‌ ఉంటుంది. గ్రిల్‌ చేసుకునే ఐటమ్‌ని బట్టి టెంపరేచర్‌ సెట్‌ చేసుకోవచ్చు. 
ధర : 55 డాలర్లు (రూ.4,109) 

చదవండి: ఏంటిది.. నాకు తలకొట్టేసినట్టు అయ్యింది.. ఆ ఫొటోలు, వీడియోలను ఎలా తొలగించాలి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement