కూరల్లో రుచి కావాలంటే దానికి కావాలసిన అన్ని పదార్థాలు సమపాళ్లలో పడాలి. ముఖ్యంగా ఉప్పు,కారం, నూనె, అల్లం వెల్లుల్లి, మసాలా. అయితే వంట తొందరగా అయిపోతుందనో, సమయాభావం వల్లనో చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ముందే రెడీ చేసి పెట్టుకుంటారు. మరి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి? తెలుసుకుందామా?
మార్కెట్లో ఇన్‌స్టెంట్‌గా చాలా రకాల మసాలాలు, పొడులు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రస్తుతం కాలంలో వాటిని ఎంతవరకు నమ్మాలి అనేది ప్రధాన సమస్య. ముఖ్యంగా అల్లం , వెల్లుల్లి పేస్ట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుళ్లిపోయిన బంగాళాదుంపలు, పేపర్ ముక్కలు తదితర వస్తువులతో అనారోగ్య వాతావరణంలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారవుతుందున్న వార్తల మధ్య అల్లం, వెల్లుల్లి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చూసుకోవాలి.
అల్లం వెల్లుల్లి రెండూ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పొట్టు తీసిన శుభ్రంగా కడిగిన అల్లం, పొట్టువలిచిన వెల్లుల్లికలిపి మెత్తగా మిక్సీలో నూరుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, పసుపు కలుపుకుంటే పాడు గాకుండా ఉంటుంది. ఈ పేస్ట్‌ను గాలి చొరబడని గాజు సీసాలో పుంచి, ఫ్రిజ్‌లో భద్రపరచాలి.
ఒకరోజు వాడిన స్పూను మరో రోజు వాడకుండా, తడి తగలకుండా జాగ్రత్త పడాలి. ఉప్పు లేదా నూనె, లేదా పసుపు కలపడం వల్ల కనీసం రెండు వారాలు నిల్వ ఉంటుంది. అలాగే వెనిగర్‌ను కూడా కలుపుతారు.ఇలాంటి చిట్కాలు పాటిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడైపోదు. పైగా కలర్ మారకుండా, మంచివాసనతో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment