Hyderabad: Petrol Pumps use e-chips to give less fuel to customers - Sakshi
Sakshi News home page

వాహనదారులకు షాక్‌.. బంకుల్లో కొన్నేళ్లుగా చిప్‌ దందా.. లీటర్‌కు బదులు..

Published Thu, Nov 17 2022 9:42 AM | Last Updated on Thu, Nov 17 2022 11:42 AM

Chip Scam Identified In Hyderabad Petrol Pumps - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పెట్రోల్‌ బంక్‌ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు బంక్‌ యజమానులు ఎలక్ట్రానిక్‌ చిప్‌లతో తక్కువ పెట్రోల్‌ పోస్తూ వాహనదారుల జేబులకు గండికొడుతున్నారు. 

తాజాగా, నగరంలోని పలు బంకుల్లో ఎస్‌వోటీ టీమ్‌ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో కొందరు బంక్‌ యజమానులు చిప్‌ అమర్చి లీటర్‌కు రూ.10 గండి కొడుతున్నట్టు గుర్తించారు. వాహనదారులను నిలువుదోపిడీ చేస్తున్నట్టు కనుగొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ చీకటి దందా జరుగుతున్నట్టు తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారిని గట్టిగా విచారించడంతో నగరవ్యాప్తంగా పలు బంకుల్లో చిప్‌లు అమర్చినట్టు నిందితులు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement