
గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియాను ఉత్పత్తి చేస్తున్న ఏఎమ్ గ్రీన్(AM Green) సుస్థిర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. గ్రీన్ ఇంధనాలు, రసాయనాల కోసం స్థిరమైన సరఫరా అందించేందుకు డీపీ వరల్డ్(DP World)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారంతో డీకార్బనైజేషన్‌కు ప్రయత్నాలు జరుగుతాయని కంపెనీ తెలిపింది.
ఇటీవల కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం రెండు కంపెనీలు తాజాగా భాగస్వామ్య పత్రాలపై సంతకాలు చేశాయి. ఏఎమ్ గ్రీన్, డీపీ వరల్డ్ సంయుక్తంగా ఈ పరిశ్రమలో లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నాయి. సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల(MTPA) గ్రీన్ అమ్మోనియా, 1 ఎంటీపీఏ గ్రీన్ మిథనాల్‌ను ఎగుమతి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. జీరో-కార్బన్ ఉద్గారాల కోసం యూరోపియన్ యూనియన్, యూఏఈలో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: మొబైల్ రీఛార్జ్ మరింత భారం కానుందా..?
గ్రీన్ కో గ్రూప్ & ఏఎమ్ గ్రీన్ వ్యవస్థాపకుడు మహేష్ కొల్లి మాట్లాడుతూ..‘గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా ఎదగాలనే భారతదేశ ఆశయానికి కంపెనీ కట్టుబడి ఉంది. గ్రీన్ మాలిక్యూల్స్‌తో వాతావరణ కాలుష్యాన్ని కట్టడి చేయవచ్చు. ఈ పరిశ్రమలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడానికి డీపీ వరల్డ్‌లో భాగస్వామ్యం కావడం సంతోషకరం. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మిథనాల్, ఇతర సుస్థిర ఇంధనాలను సమర్థవంతంగా ఎగుమతి చేయడానికి తోడ్పడుతుంది’ అన్నారు. డీపీ వరల్డ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ యువరాజ్ నారాయణ్ మాట్లాడుతూ..‘స్వచ్ఛమైన ఇంధనాలు, రసాయన ఉత్పత్తుల ఎగుమతిని సులభతరం చేయడానికి ఏఎమ్ గ్రీన్‌తో భాగస్వామ్యం కీలకం కానుంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment