నిజామాబాద్‌ నగరంలో భారీ పేలుడు! | Blast In Nizamabad After Man Shakes Box Of Chemicals Telangana | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ నగరంలో భారీ పేలుడు!

Published Sun, Dec 11 2022 8:34 AM | Last Updated on Sun, Dec 11 2022 2:57 PM

Blast In Nizamabad After Man Shakes Box Of Chemicals Telangana - Sakshi

పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ నగరం రెండో పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెద్దబజార్‌లో శనివారం రాత్రి 10.30 గంటలకు భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా పేలుడుతో అక్కడి శివసాయి వైన్స్, ఫ్యాషన్‌ స్టోర్, లక్ష్మీనర్సింహస్వామి జనరల్‌ స్టోర్‌లకు సంబంధించిన షెడ్లు ధ్వంసమయ్యాయి. చెత్త ఏరుకునే వ్యక్తి కెమికల్‌ పదార్థాలను తీసుకురావడంతో పేలుడు సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు. కెమికల్‌ పదార్థాలు ఉన్న బాక్సును ఊపడంతో పేలుడు జరిగిందని వెల్లడించారు. 

స్థానికులు పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ పేలుడులో చేతికి తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని జీజీహెచ్‌కు తరలించినట్లు రెండో టౌన్‌ ఎస్సై పూర్ణేశ్వర్‌ తెలిపారు. ఇది బాంబు పేలుళ్లా.. లేక రసాయినిక చర్య కారణంగా జరిగిన పేలుడా అనేది దర్యాప్తులో తేలనుందని చెప్పారు.

ఇదీ చదవండి: అమ్మో పులి...! జిల్లాలో మళ్లీ చిరుతల అలజడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement