జమ్ముకశ్మీర్‌లో మరో పేలుడు.. 24 గంటల్లో మూడోది.. | Explosion In Jammu Bajalta 3rd Blast In 24 Hours | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో మరో పేలుడు.. 24 గంటల్లో మూడోది..

Published Sun, Jan 22 2023 5:03 PM | Last Updated on Sun, Jan 22 2023 5:03 PM

Explosion In Jammu Bajalta 3rd Blast In 24 Hours - Sakshi

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరో పేలుడు ఘటన జరిగింది. శనివారం రాత్రి బజల్తాలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు  ఓ డంపర్‌ను ఆపగా.. అందులోని యూరియా ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ పేలుడుపై విచారణ జరిపిన పోలీసులు ఉగ్రచర్యగా అనుమానిస్తున్నారు.

అంతకుముందు శనివారం ఉదయం నర్వాల్ ప్రాంతంలో అరగంట వ్యవధిలో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు పౌరులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ పేలుళ్లను ఉగ్ర దాడిగా అధికారులు పేర్కొన్నారు. ముష్కరులు ఐఈడీలు ఉపయోగించి ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కశ్మీర్‌లో కొనసాగుతున్నందున  అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సమయంలో వరుస పేలుళ్లు జరుగుతుండటంతో మరింత అప్రమత్తమయ్యారు.
చదవండి: మోదీ, దీదీ మధ్య 'మో-మో' ఒప్పందం.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement