కెమికల్స్‌తో వెళ్తున్న ఆటో దగ్ధం | chemicals auto fired at hyderabad | Sakshi
Sakshi News home page

కెమికల్స్‌తో వెళ్తున్న ఆటో దగ్ధం

Oct 29 2015 1:04 PM | Updated on Sep 4 2018 5:07 PM

కెమికల్ డ్రమ్ములతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు మంటల్లో కాలిపోయిన ఘటన బహదూర్‌పూరలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

బహదూర్‌పురా: కెమికల్ డ్రమ్ములతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు మంటల్లో కాలిపోయిన ఘటన హైదరాబాద్‌లోని బహదూర్‌పూరలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

కాటేదాన్ వైపు కెమికల్స్ డ్రమ్ములతో వెళ్తున్న ఆటోలో ప్రమాదశాత్తు మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై ఆటోను రోడ్డు పక్కన నిలిపివేసి, పక్కకు వెళ్లిపోయాడు. ఒక్కసారిగా అంటుకున్న మంటలతో ఆటో పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ హాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement