చార్మినార్ (హైదరాబాద్): పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సౌత్‌జోన్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. మీర్‌చౌక్, భవానీనగర్, బహదూర్‌పుర, రెయిన్‌బజార్ ప్రాంతాల్లోని దుకాణాలలో అరటి పళ్లను రసాయనాలతో మగ్గిస్తున్నట్టు గుర్తించి ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. 103 రసాయన బాటిళ్లను, 950 అరటి గెలల్ని స్వాధీనం చేసుకున్నారు.