south zone police
-
మూఢ నమ్మకాలు..వన్యప్రాణుల అమ్మకాలు
సాక్షి, హైదరాబాద్: అరుదైన వన్యప్రాణులను ఈశాన్య రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి పాతబస్తీ కేంద్రంగా అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నిందితుడి నుంచి 4 స్లోలోరిస్లతో పాటు నక్షత్ర తాబేలు, మరో అరుదైన తాబేలును స్వాధీనం చేసుకున్నామని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి ఆదివారం వెల్లడించారు. కేసును అధీనంలోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. పాతబస్తీలోని బార్కస్‌కు చెందిన అన్నదమ్ములు సాలెహ్ బిన్ మహ్మద్ బదామ్, అలీ బిన్ మహ్మద్ బదామ్ మందుల షాపు నిర్వహిస్తున్నారు. ఈ ఆదాయం చాలకపోవడంతో అదనపు రాబడి మార్గాలు అన్వేషించారు. ఏడాది క్రితం పావురాల అమ్మకం మొదలెట్టారు. ఆపై కొన్ని రకాలైన పిల్లులు, కోళ్లను విక్రయించేవారు. వీరి వద్దకు వచ్చే కస్టమర్లలో అనేకులు అరుదైన జంతువులు కావాలని కోరడంతో వీరి దృష్టి వాటిపై పడింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి తెచ్చి.. కొందరు కస్టమర్లలో ఉన్న మూఢనమ్మకాల నేపథ్యంలో కొన్ని అరుదైన జంతువులకు నగరంలో డిమాండ్ ఉందని అలీ బిన్ గుర్తించాడు. ఈశాన్య రాష్ట్రాల్లో దొరికే వాటిని అక్రమ మార్గంలో తెచ్చి విక్రయించడం ద్వారా తేలిగ్గా భారీ మొత్తం సంపాదించవచ్చని అన్నదమ్ములు పథకం వేశారు. అలీ బిన్ ఈశాన్య రాష్ట్రాల్లో జంతువులను స్మగ్లింగ్ చేసే వారిని సంప్రదించాడు. వారి సహకారం తో ప్రైవేట్ వాహ నాల్లో వాటిని సిటీకి తీసుకు వస్తున్నాడు. వీటిని కొన్నాళ్ల పాటు తమ ‘కబూతర్ ఖానా’లోనే ఉంచి ఆపై కోరిన వారికి మూడు రెట్ల ధరకు అమ్ముతున్నారు. వీరి దందాపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో సిబ్బంది నిందితుల ఇంటిపై దాడి చేశారు. సాలెహ్ బిన్ను అదుపులోకి తీసుకుని నాలుగు స్లో లోరిస్‌లు, స్టార్ తాబేలు, డొప్ప తాబేలును స్వాధీ నం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం జంతువులతో సహా నిందితుడిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. పరారీలో ఉన్న అలీ బిన్ చిక్కితే ఈ కేసులో కీలకాంశాలు వెలుగులోకి రావచ్చు. స్లో లోరిస్.. రూ.50 వేలు లోరిస్కు చెందిన కొన్ని అవయవాలను సంప్రదాయ వైద్యంలో ఔషధాల తయారీకి వాడుతున్నారు. దీని మాంసం తింటే పటుత్వం పెరుగుతుందని, సజీవంగా తమ ప్రాంగణంలో పాతి పెడితే అదృష్టం పడుతుందనే మూఢనమ్మకాలున్నాయి. ►క్షీరదాల జాతికి చెందిన స్లో లోరిస్ జంతువు నిశాచరి. నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో కూడా ఇది లేదు. ఇవి ఈశాన్య రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లో ఉంటాయి. ►శాకాహారి అయిన స్లో లోరిస్ చెట్లపై నివసిస్తూ బొప్పాయి సహా కొన్ని రకాలైన పళ్లను తింటుంది. దీనికి ఆహారం నిమిత్తం రోజుకు రూ.300 వరకు వెచ్చిస్తున్నారు. ►దీనిని రూ.15 వేలకు ఖరీదు చేసి రూ.50 వేలకు అలీ సోదరులు విక్రయిస్తున్నారు. నక్షత్ర తాబేలు రూ.40 వేలు.. స్టార్ టార్టాయిస్ ఇంట్లో ఉంచుకున్నా, పెంచుకున్నా భవిష్యత్తు బాగుంటుందని, అదృష్టం వరిస్తుందనే నమ్మకం ఉంది. మెత్తడి డొప్ప తాబేలు ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుందని నమ్మకం పలువురిలో ఉంది. ►స్టార్ టార్టాయిస్గా పిలిచే నక్షత్ర తాబేళ్లు పొడి ప్రాంతాలు, కొన్ని అడవుల్లో జీవిస్తుంటాయి. ఇవి భారీ సంఖ్యలో విదేశాలకు స్మగ్లింగ్ అవుతుంటాయి. ►సుదీర్ఘ సమయం నీటి అడుగున ఉండగలిగే మెత్తడి డొప్ప తాబేలు దేశంలోని గంగ, సింధు, మహానదుల్లో మాత్రమే దొరుకుతుంది. ►నక్షత్ర తాబేళ్లను రూ.10 వేలకు కొని.. రూ.40 వేలకు, మెత్తని డొప్పతో ఉండే తాబేళ్లను రూ.5 వేలకు ఖరీదు చేసి రూ.20 వేలకు విక్రయిస్తున్నారు. -
పండ్లపై విషం చిమ్ముతున్న ఐదుగురు అరెస్ట్
చార్మినార్ (హైదరాబాద్): పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సౌత్‌జోన్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. మీర్‌చౌక్, భవానీనగర్, బహదూర్‌పుర, రెయిన్‌బజార్ ప్రాంతాల్లోని దుకాణాలలో అరటి పళ్లను రసాయనాలతో మగ్గిస్తున్నట్టు గుర్తించి ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. 103 రసాయన బాటిళ్లను, 950 అరటి గెలల్ని స్వాధీనం చేసుకున్నారు. -
భారీగా డ్రగ్స్ స్వాధీనం
-
భారీగా డ్రగ్స్ స్వాధీనం
న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో గుట్టు చప్పుడు కాకుండా.. నగరంలోకి డ్రగ్స్ తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన స్మగ్లర్ల గుట్టు సౌత్ జోన్ పోలీసులు గురువారం బయట్టబయలు చేశారు. గతంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తూ (పెడ్లర్స్) అరెస్టై, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న వారిపై నిఘా పెట్టిన పోలీసులు.. భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. వీటితో పాటు.. డ్రగ్స్ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 144 ఇంజక్షన్లతో పాటు.. భారీగా మత్తుపదార్థాలు సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇద్దరు అరెస్ట్ : 80 సెల్ ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్ : పని చేస్తున్న షాప్‌లోనే చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు సేల్స్మేన్స్ను సౌత్ జోన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 80 సెల్ ఫోన్లుతోపాటు రూ. 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ మసాలాల తయారీ ముఠా అరెస్ట్
హైదరాబాద్ : కల్తీ చేయడానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా...ఇప్పటివరకూ మనం యూరియా, రసాయనాలు కలిపి పాలు తయారు చేయడం.. జంతు కళేబరాలను, కొవ్వును మరిగించి నూనెలు కాయడం.. కార్బైడ్ వంటి విష రసాయనాలతో పండ్లను మగ్గబెట్టడం.. పసివాళ్లు కూడా తాగే పాలను కూడా కల్తీ చేస్తున్న అక్రమార్కుల దందాలో తాజాగా కల్తీ మసాలాల తయారీ వెలుగుచూసింది. తాజాగా గసగసాలు మొదలు మిరియాలు, జీలకర్ర, వాము వరకూ ఏదీ వదలటం లేదు. పాతబస్తీ కేంద్రంగా నకిలీ మసాలాలు తయారు చేస్తున్న ఓ ముఠాను సౌత్ జోన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు సంబంధించి ముగ్గురు, హైదరాబాద్‌కు చెందిన 11మంది వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున నకిలీ మసాలాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మసాలాల తయారీకి ప్రమాదకరమైన కెమికల్స్, ఆయిల్స్, కలర్స్‌ను ఈ ముఠా వాడుతున్నట్లు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. బొప్పాయి గింజలతో మిరియాలు, గడ్డితో జీలకర్ర, వాము, సోంప్, బొంబాయి రవ్వతో గసగసాలు, నకిలీ ఆవాలను ఈ ముఠా తయారు చేస్తున్నట్లు చెప్పారు. హుస్సేని అలం పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రికాపురంలో మూడు గోడౌన్లలో తయారు చేయడం.. బస్తాల్లో వాటిని నింపి బేగంబజార్ తో పాటు రాష్టంలోని వివిధ జిల్లాలకు బస్తాల్లో గిట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. 40 లక్షల విలువైన కల్తీ మసాలాను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యాపారి రాజేంద్ర గుప్తాతో పాటు బేగం బజార్‌లోని 11మంది వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. రూ.కోట్లలో టర్నోవర్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. *గసగసాల్లో ఉప్మారవ్వ (బన్సీరవ్వ పెద్దరకం, బొంబాయిరవ్వ)ను గసగసాల్లా మార్చేందుకు పిండిమరలో వేస్తారు. కాస్త పలుకుగా మారగానే వాటిని గసగసాల్లో కలిపేస్తారు. తెల్లగా ఉండేందుకు పెయింట్ మిశ్రమాన్ని కలిపి ఆరబెడుతున్నారు. *మిరియాలు గుండ్రంగా ఉండవు... బొప్పాయి విత్తనాలు గుండ్రంగా ఉంటాయి. వీటిని కలిపేందుకు బొప్పాయి విత్తనాలు ఎగుడుదిగుడుగా మారడానికి ముందుగా రెడ్ఆక్సైడ్ మిశ్రమంతో కలుపుతారు. వాటిని మిరియాలతో కలిపి కంకర మిషన్ తరహాలో యంత్రంలో వేసి కొంచెం బ్లాక్ ఆక్సైడ్‌ను కలుపుతారు. ఇదంతా అయ్యాక ఎండలో ఆరబెట్టి బస్తాల్లో ప్యాకింగ్ చేస్తారు. *జీలకర్రను తక్కువ ధరకు దిగుమతి చేసుకోవడం, వాటిలో సోంపు కలుపుతారు. ఈ మిశ్రమం బాగా దగ్గరగా ఉండేందుకు మైదాపిండితో కలిపి పిండిమరలో ఒకసారి వేసి మళ్లీ కలిపేస్తారు. మరీ తెల్లగా ఉంటే కొంచెం నల్లగా మారేందుకు పెయింట్‌ను చిలకరిస్తారు. -
పాతబస్తీలో భారీ బందోబస్తు
-ఐబీ హెచ్చరికల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం -భవానీనగర్‌లో బ్యాగు కలకలం.. -రెయిన్‌బజార్‌లో పట్టుబడిన నలుగురు దుండగులు హైదరాబాద్ : ఐబీ హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ మండలం పోలీసులు పాతబస్తీలో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. శుక్రవారం పాతబస్తీ రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నలుగురు అనుమానితులు పట్టుబడటం...వారి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేని విదేశీయులు కావడంతో దక్షిణ మండలం పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పట్టుబడిన వారిలో ఇద్దరు బంగ్లాదేశ్‌కు, ఒకరు పాకిస్తాన్, మరొకరు మయన్మార్లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ నలుగురికి హుజీ తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో పలు కేసులతో సంబంధం ఉన్న మరో పది మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. అలాగే భవానీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో అనుమానాస్పద బ్యాగ్ శుక్రవారం కలకలం రేపింది. ఆ బ్యాగ్‌లో బాంబు ఉండ వచ్చని స్థానికులు ఆందోళన చెందారు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్పందించిన అది ఖాళీ బ్యాగ్ అని తేల్చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మండలంలోని చార్మినార్, ఫలక్‌నుమా, మీర్‌చౌక్, సంతోష్‌నగర్ పరిధిలో భద్రతను పటిష్టం చేశారు. అదనపు బలగాలతో నిఘా ముమ్మరం... అన్ని ప్రాంతాల్లోనూ అదనపు బలగాలతో నిఘా ముమ్మరం చేశారు. పంద్రాగస్టు వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రెండు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. జనసమ్మర్ధం ఉన్న ప్రదేశాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
50 మంది బాలకార్మికులకు విముక్తి
-
ఆపరేషన్ స్మైల్ లో 50 మంది బాలకార్మికులకు విముక్తి
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి వరకూ కొనసాగిన ఆపరేషన్ స్మైల్ లో పలువురు బాల కార్మికులకు విముక్తి లభించింది. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పాతబస్తీలో పోలీసులు ఆపరేషన్ స్మైల్ పేరిట రైడ్ నిర్వహించారు. ఫలక్ నుమా, ముస్తఫానగర్‌లో బ్యాగ్‌ల తయారీ కేంద్రంపై సౌత్ జోన్ పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలోనే బిహార్, కోల్‌కతాకు చెందిన 50 మంది బాలకార్మికులను గుర్తించి.. వారిని అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ మీడియాకు తెలిపారు. -
స్వచ్ఛ హైదరాబాద్‌లో మాజీ రౌడీషీటర్లు
హైదరాబాద్ : స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో మాజీ రౌడీషీటర్లు భాగస్వామ్యులయ్యారు. సంతోష్ నగర్ పైగాటూంబ్స్ వద్ద మంగళవారం మాజీ రౌడీ షీటర్లు స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొన్నారు. సౌత్ జోన్ పోలీసులు ఈరోజు ఉదయం మాజీ రౌడీ షీటర్లతో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చేయించారు. కాగా స్వచ్ఛ హైదరాబాద్‌లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని సౌత్ జోన్ పోలీసులు పిలుపునిచ్చారు.